Suddala Ashok Teja: కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది.. లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ కామెంట్స్-lyricist suddala ashok teja comments on revu movie in audio release event chandrabose speech about revu audio tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suddala Ashok Teja: కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది.. లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ కామెంట్స్

Suddala Ashok Teja: కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది.. లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Suddala Ashok Teja About Revu Movie In Audio Release: మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించేలా తెరకెక్కిన రేవు సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌ జూలై 24న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది.. లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ కామెంట్స్

Suddala Ashok Teja Revu Audio Release: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నిర్మాణ సూపర్ విజన్‌ను జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన రేవు సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అ‌వుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (జూలై 24) హైదరాబాద్‌లో రేవు ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ రేవు మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తెలుగు ప్రముఖ గీత రచయితలు, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గేయ రచయితలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసి ఆకట్టుకున్నారు.

"రేవు సినిమా ఆడియో ఫంక్షన్‌కు మా ప్రభు అన్న పిలిస్తే వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ సినిమా పాటలు విన్న తర్వాత సరైన కార్యక్రమానికే వచ్చాను అనిపించింది. అశోక్ తేజ గారిని చూసి చాలా రోజులవుతోంది. అలాగే అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి గారిని ఈ వేదిక మీద కలుసుకోవడం సంతోషంగా ఉంది" అని ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ తెలిపారు.

"రేవు సినిమాకు పాటలు రాసిన ఇమ్రాన్ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో అతను రాసిన పాటలు అంతే వైవిధ్యంగా ఉన్నాయి. అన్నిఎమోషన్స్‌తో పాటలు రాశారు. సంగీతం బాగుంది. రేవు సినిమాలో నవ్యత, నాణ్యత రెండూ కనిపించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ చంద్రబోస్ పేర్కొన్నారు.

గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. "రేవు సినిమా కార్యక్రమం చూస్తుంటే కొత్త నెత్తుటి సముద్రం చూస్తున్నట్లు ఉంది. నేను తీరప్రాంతంలో పుట్టలేదు. కానీ, తీరప్రాంత ప్రజల గురించి తెలుసు. వారి జీవన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. రేవు సినిమా వేదిక మీద అక్షరాలన్నీ కలిపినట్లు ఉంది. ఈ ప్రయత్నం చేసిన ఘనత ప్రభు గారిది, పర్వతనేని రాంబాబు గారిది" అని చెప్పారు.

"ఈ ఆడియో ఫంక్షన్‌కు గీత రచయిలను అతిథులుగా పిలవడం గొప్ప సంప్రదాయంగా చెబుతున్నా. ఈ క్యాసెట్‌ను నేను దాచుకుంటా. అప్పట్లో రాఘవేంద్రరావు, దాసరి గారి సినిమాలకు పనిచేసి ఆ క్యాసెట్ అందుకున్నప్పుడు కలిగిన సంతోషం ఇప్పుడు కలుగుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. మనమంతా రేవు సినిమాకు సపోర్ట్ చేయాలి. ఇది స్ఫూర్తిగా కొత్త ప్రతిభావంతులు సినిమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నా" అని సుద్దాల అశోక్ తేజ అన్నారు.

ఇదిలా ఉంటే, రేవు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రేవు చిత్రాన్ని మత్స్యకారుల జీవన విధానాన్ని, శైలిని చాటి చెప్పేలా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.