Rama Jogayya Sastry: బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!-lyricist ramajogayya sastry comments on his role in dhoom dhaam movie at pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rama Jogayya Sastry: బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!

Rama Jogayya Sastry: బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!

Sanjiv Kumar HT Telugu
Nov 08, 2024 12:51 PM IST

Ramajogayya Sastry Role In Dhoom Dhaam Movie: టాలీవుడ్‌లో పాటల రచయితగా చాలా పాపులర్ అయిన రామజోగయ్య శాస్త్రి బిజినెస్ మ్యాన్‌గా మారారు. ధూమ్ ధామ్ సినిమాలో బిజినెస్ మ్యాన్‌గా, హీరోయిన్‌కు తండ్రి పాత్రలో కనిపిస్తున్నట్లు ధూమ్ ధామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తెలిపారు.

బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!
బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!

Lyricist Ramajogayya Sastry Role: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ధూం ధాం". ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన "ధూం ధాం" సినిమాకు దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కించారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ఇవాళ అంటే నవంబర్ 8న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. అయితే, ధూమ్ ధామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఐదో పాట కూడా సక్సెస్ కావాలని

ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "ధూం ధాం సినిమాలో పాటలన్నీ రాసే అవకాశం దక్కింది. నాలుగు పాటలు బాగా కుదిరాక ఐదో పాట కూడా సక్సెస్ చేయాలని మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా పాట రాశా. ఆ పాట మంగ్లీ పాడటమే కాదు పాటలో కనిపించింది" అని తెలిపారు.

తండ్రి పాత్ర చేశాను

"ఈ సినిమాలో పాటలు రాయడంతో పాటు ఓ క్యారెక్టర్‌లో నటించాను. సెకండ్ హీరోయిన్ ఫాదర్ రోల్ చేశాను. బిజినెస్ మేన్ పాత్ర ఇది. ధూం ధాం" సినిమా మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి, డైరెక్టర్ సాయికిషోర్‌కు, హీరో చేతన్‌తో పాటు టీమ్ అందరికీ పెద్ద విజయాన్ని ఇవ్వాలి" అని రామజోగయ్య శాస్త్రీ వెల్లడించారు.

ఎంటర్‌టైనింగ్‌గా డైలాగ్స్

డైలాగ్ రైటర్ ప్రవీణ్ వర్మ మాట్లాడుతూ.. "ధూం ధాం సినిమాలో ఎంటర్‌టైనింగ్‌గా డైలాగ్స్ ఉంటాయి. మా టీమ్ అంతా ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేశాం. హీరో చేతన్ ప్యాషనేట్, హీరోయిన్ హెబ్బా బబ్లీ గర్ల్. వీళ్ల క్యారెక్టర్స్ కాంట్రాస్ట్‌గా ఉన్నా సినిమాలో బాగా కుదిరాయి. మీరంతా ధూం ధాం సినిమా చూసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం" అని అన్నారు.

తప్పకుండా బాగుంటాయి

"ప్రేక్షకులకు వినోదాన్ని అందించి వారి బాధలను తగ్గించే ప్రతి దర్శకుడూ గొప్పవాడే. మా సాయి కిషోర్ అలాంటి దర్శకుల సరసన ఈ చిత్రంతో చేరబోతున్నాడు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే ప్లెజెంట్ సినిమాలు తప్పకుండా బాగుంటాయి. ధూం ధాం సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది" అని నటుడు సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.

కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు

దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ.. "ధూం ధాం సినిమా ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు కారణం. ఆయన ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా ఫ్రెండ్ గోపీ మోహన్ ఈ సినిమాకు నిత్యం వెన్నంటే ఉన్నారు. గోపీ సుందర్ గారి మ్యూజిక్, రామజోగయ్య గారి లిరిక్స్ మా మూవీకి ఆకర్షణగా నిలుస్తాయి. సెకండాఫ్‌లోని కామెడీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.

Whats_app_banner