Lyf Movie Teaser: ఇరవై ఏళ్ల తర్వాత యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎస్‌పి చరణ్ రీఎంట్రీ - ఎల్‌వైఎఫ్ టీజర్ రిలీజ్
Lyf Teaser: ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్‌పి చరణ్ యాక్టర్‌గా ఇరవై ఏళ్ల తర్వాత తెలుగులో ఓ సినిమా చేస్తోన్నాడు. ఎల్‌వైఎఫ్ పేరుతో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. ఎల్‌వైఎఫ్ టీజర్‌ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు.
దివంగత దిగ్గజ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్‌పి చరణ్ యాక్టర్‌గా దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నాడు. ఎల్‌వైఎఫ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీహర్ష, కషిక కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్...
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ కిషోర్ రాఠీ, మహేష్ రాఠీతో కలిసి ఏ రామస్వామి రెడ్డి ఎల్‌వైఎఫ్ సినిమాను నిర్మిస్తోన్నారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎల్‌వైఎఫ్ టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదలచేశారు.
తండ్రీకొడుకుల కథ...
తండ్రీకొడుకుల అనుబంధంతో ఫన్నీగా టీజర్ మొదలైంది. సంఘ సేవ చేస్తోన్న తండ్రీకొడుకులపై బెట్టింగ్ పాల్పడే వ్యక్తులుగా ముద్రపడినట్లు టీజర్‌లో చూపించారు. పొలిటికల్‌గా బలవంతుడైన ఓ బిజినెస్‌మెన్‌ను తన తెలివితేటలతో హీరోతో పాటు అతడి తండ్రి ఎలా దెబ్బకొట్టారన్నది టీజర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. చివరలో మైథలాజికల్ పాయింట్‌ను టచ్ చేయడం, అఘోరాలను చూపించడం ఆసక్తిని పంచుతోంది. శివోహం అనే కాన్సెప్ట్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది,
చిన్న సినిమాలే తీయాలి....
టీజర్ రిలీజ్ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... "శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా మంచి కథతో తెరకెక్కిన ఎల్‌వైఎఫ్ మూవీ సక్సెస్‌గా నిలవాలి. ఎక్కువ బడ్జెట్‌తో కాకుండా మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే బాగుంటాయి. వందల కోట్లలో బడ్జెట్ పెట్టి తర్వాత టికెట్ రేట్లు పెంచామని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఇండస్ట్రీకి మంచిది.
ఎల్‌వైఎఫ్ ఆ కోవకు చెందిన సినిమాగానే కనిపిస్తోంది. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా తక్కువ బడ్జెట్ తో రూపొందిన చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ విషయాన్ని పలు సినిమాలు నిరూపించాయి. కొత్త సినిమాలతో పోటీపడుతూ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ఎల్‌వైఎఫ్ అదే విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
మణిశర్మ మ్యూజిక్...
ఎల్‌వైఎఫ్ మూవీలో ప్రవీణ్, భద్రం, షకలక శంకర్, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. మనీషా ఆర్ట్స్ సంస్థ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదంతో పాటు తెలుగులో పలు బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించింది. ఎల్‌వైఎఫ్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి సినిమా ప్రొడక్షన్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.
నాలో మూవీలో హీరోగా...
ఎల్‌వైఎఫ్ మూవీలో హీరో శ్రీహర్ష తండ్రిగా ఎస్.పి చరణ్ కనిపించబోతున్నాడు. గతంలో తెలుగులో నాలో సినిమాలో హీరోగా నటించాడు ఎస్.పి చరణ్ నటించాడు. తమిళంలో పదికిపైగా సినిమాలు చేశాడు. సరోజ, ద్రోహి, వా తో పాటు తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్ నటుడిగా చరణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని వెబ్‌సిరీస్‌లలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలు పోషించాడు ఎస్.పి చరణ్.