14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?-lucky bhaskar get four awards in gaddar telangana film awards 2024 best third feature film special jury award dulquer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?

14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?

Sanjiv Kumar HT Telugu

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు తొలిసారిగా అవార్డులు ప్రకటించారు. 14 ఏళ్ల క్రితం నంది అవార్డ్స్ ప్రకటించిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పేరుతో పురస్కారాలు అందించనుంది. గద్దర్ అవార్డ్స్ 2024లో లక్కీ భాస్కర్ సినిమాకు ఏకంగా 4 పురస్కారాలు వరించాయి.

14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నంది అవార్డ్స్ ఎంతో కీలకంగా ఉండేవి. గత 14 ఏళ్లుగా నంది అవార్డ్స్‌ను ప్రకటించలేదు. కానీ, 14 ఏళ్ల తర్వాత టాలీవుడ్ పరిశ్రమకు అవార్డ్స్ ప్రకటన వచ్చింది. అయితే, నంది అవార్డ్స్‌కు బదులుగా తెలంగాణలో చిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రకటించారు.

2024 సినిమాలకు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డులు ప్రకటించడం విశేషంగా మారింది. గద్దర్ అవార్డ్స్ 2024ను జ్యూరీ ఛైర్మన్ జయసుధ ప్రకటించారు. అయితే, 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు అనౌన్స్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

2024 గద్దర్ అవార్డ్స్‌

గద్దర్ అవార్డ్స్ 2024 కోసం 1248 నామినేషన్స్ రాగా 11 కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించారు. అలాగే, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన సినిమాల్లో ఒక మూవీని ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. ఇక 2024 గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) అవార్డ్స్ దక్కించుకున్నారు.

4 విభాగాల్లో పురస్కారాలు

ఇదిలా ఉంటే, ఈ గద్దర్ అవార్డ్స్‌లలో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలు వరించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.

విమర్శకుల ప్రశంసలు

2024 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి లక్కీ భాస్కర్ మూవీకి నాలుగు కేటగిరీల్లో గద్దర్ అవార్డ్స్ వరించాయి. అవేంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఉత్తమ మూడో ఫీచర్ ఫిల్మ్

ఉత్తమ ఫీచర్ చిత్రంగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా నిలవగా.. రెండో ఉత్తమ సినిమా అవార్డును పొట్టేల్ కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ మూడో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో లక్కీ భాస్కర్ చోటు సంపాదించుకుంది.

బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్

లక్కీ భాస్కర్ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మరో పురస్కారం వరించింది. ఈ కేటగిరీలో లక్కీ భాస్కర్‌ డైరెక్టర్ వెంకీ అట్లూరి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా గద్దర్ అవార్డ్ అందుకోనున్నారు. లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్‌ను ఫిదా చేసిన విషయం తెలిసిందే.

బెస్ట్ ఎడిటర్

అలాగే, గద్దర్ అవార్డ్స్ 2024కి గానూ బెస్ట్ ఎడిటర్ కెటగిరీలో నవీన్ నూలి పురస్కారం అందుకోనున్నారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గానూ ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలికి అవార్డ్‌ను ప్రకటించారు. ఎలాంటి అనవసరపు సన్నివేశం లేకుండా పర్‌ఫెక్ట్ సీన్లతో లక్కీ భాస్కర్ సినిమాను ఎడిట్ చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం వరించింది.

స్పెషల్ జ్యూరీ అవార్డ్

ఇక పలువురికి స్పెషల్ జ్యూరీ కింద గద్దర్ అవార్డ్స్‌ను ప్రకటించారు. వాటిలో మొదటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ విభాగంలో దుల్కర్ సల్మాన్‌కు పురస్కారాన్ని ప్రకటించారు. లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు గానూ ఈ అవార్డ్ అందుకోనున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2024లో నాలుగు పురస్కారాలను లక్కీ భాస్కర్ వరించి సత్తా చాటింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం