Lucky Baskhar TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మూవీ లక్కీ భాస్కర్.. డేట్, టైమ్ ఇదే
Lucky Baskhar TV Premier Date: లక్కీ భాస్కర్ టీవీలోకి వచ్చేస్తోంది. గతేడాది బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీ.. స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ గురువారం (జనవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
Lucky Baskhar TV Premier Date: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. గతేడాది దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న మూవీ రిలీజైన విషయం తెలిసిందే. తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపుతోంది. ఈ మూవీ ఇప్పుడు టీవీలోకి కూడా వచ్చేస్తోంది.

లక్కీ భాస్కర్ టీవీ ప్రీమియర్ డేట్
లక్కీ భాస్కర్ మూవీ వచ్చే ఆదివారం (జనవరి 19) స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. ఆరోజు సాయంత్రం 6 గంటలకు మూవీ ప్రసారం కానున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. గురువారం (జనవరి 16) ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపింది. "సాధారణ జీవితం నుంచి అసాధారణ జీవితానికి. భాస్కర్ థ్రిల్లింగ్ జర్నీని లక్కీ భాస్కర్ లో చూడండి.
ఈ ఆదివారం, జనవరి 19న సాయంత్రం 6 గంటలకు కేవలం స్టార్ మాలో" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా తన ఎక్స్ అకౌంట్లోనే మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు, విశేషాలతో అభిమానులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసింది.
లక్కీ భాస్కర్ మూవీ గురించి..
లక్కీ భాస్కర్ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయగా.. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 31న రిలీజైంది. తెలుగులో దుల్కర్ కు వరుసగా నాలుగో హిట్ అందించిన సినిమా ఇది. ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి.. అతని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.
ఎంతో కష్టపడి పని చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురుచూసే ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి.. ఆ ప్రమోషన్ రాకపోవడంతో నిబంధనల్లోని లోపాలను సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి మోసాలకు పాల్పడ్డాడు? ఏకంగా రూ.100 కోట్లు ఎలా సంపాదించాడన్నది ఈ లక్కీ భాస్కర్ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకూ థియేటర్, ఓటీటీలో మూవీ చూడని వాళ్లు వచ్చే ఆదివారం స్టార్ మా ఛానెల్లో ఈ సినిమాను చూసేయండి.