Lucky Baskhar Runtime: మోస్తరు రన్‍టైమ్‍తో వస్తున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా.. ఎంతంటే..-lucky baskhar movie runtime revealed censor completed for dulquer salmaan movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Baskhar Runtime: మోస్తరు రన్‍టైమ్‍తో వస్తున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా.. ఎంతంటే..

Lucky Baskhar Runtime: మోస్తరు రన్‍టైమ్‍తో వస్తున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా.. ఎంతంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 22, 2024 03:35 PM IST

Lucky Baskhar Runtime: లక్కీ భాస్కర్ సినిమా సెన్సెర్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో రన్‍టైమ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రం ఎంత నిడివితో రానుందో తెలిసిపోయింది.

Lucky Baskhar Runtime: మోస్తరు రన్‍టైమ్‍తో వస్తున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా.. ఎంతంటే..
Lucky Baskhar Runtime: మోస్తరు రన్‍టైమ్‍తో వస్తున్న దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా.. ఎంతంటే..

‘సీతారామం’ సినిమాతో తెలుగులో చాలా పాపులర్ అయ్యారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్కర్ తెలుగులో ‘లక్కీ భాస్కర్’ మూవీ చేశారు. ఈ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ లక్కీ భాస్కర్ చిత్రం అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

లక్కీ భాస్కర్ సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఓ బ్యాంకు ఉద్యోగి ధనవంతుడిగా ఎలా మారాడన్న విషయం ప్రధానంగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో రన్‍టైమ్ ఎంత ఉండనుందో వెల్లడైంది.

రన్‍టైమ్ ఇదే

లక్కీ భాస్కర్ సినిమా 2 గంటల 30 నిమిషాల (150 నిమిషాలు) రన్‍టైమ్‍తో రానుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‍ను సెన్సార్ బోర్డు ఇచ్చిందని తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికేట్ విషయాన్ని మూవీ టీమ్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఎక్కువగా కాకుండా మోస్తరుగా రెండున్నర గంటల రన్‍టైమ్‍తో రావడం ఈ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

స్టోరీలైన్ ఇలా..

లక్కీ భాస్కర్ చిత్రంలో ముంబైలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా చేసే భాస్కర్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి అతడికి జోడీగా నటించారు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండటంతో డబ్బు కోసం బ్యాంకులో భాస్కర్ స్కామ్స్ చేస్తాడని ట్రైలర్లో ఉంది. దీంతో భారీగా ధనవంతుడు అవుతాడు. ఆ తర్వాత అతడికి సవాళ్లు ఎదురవుతాయి. ఇలా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగింది. దుల్కర్, మీనాక్షితో పాటు ఈ చిత్రంలో సాయికుమార్, రామ్‍కీ, సూర్య శ్రీనివాస్, హైపర్ ఆది, రిత్విక్, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రలు పోషించారు. 

లక్కీ భాస్కర్ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించారు. వాతి (తెలుగులో సార్) మూవీతో గతేడాది మంచి హిట్ కొట్టారు వెంకీ. ఇప్పుడు డిఫరెంట్ పాయింట్‍తో లక్కీ భాస్కర్ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంపై మూవీ యూనిట్ మంచి నమ్మకంతో ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. 

‘తప్పులు వెతికితే పార్టీ’

ఇటీవల జరిగిన లక్కీ భాస్కర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్లు చేశారు. లక్కీ భాస్కర్ సినిమాలో కూడా తప్పులు వెతికితే.. వారికి పార్టీ ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారిపై గతంలో చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన.. నాగవంశీ మరోసారి వెటకారంగా ఈ వ్యాఖ్య చేశారు. ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నామని ఆయన చెప్పారు.

Whats_app_banner