Lucky Baskhar First song lyrics: భార్యను బుజ్జగించేందుకు బెస్ట్ సాంగ్: లక్కీ భాస్కర్ ఫస్ట్ సాంగ్ లిరిక్స్ ఇవే: పాడుకోండి
Lucky Baskhar First song lyrics: లక్కీ భాస్కర్ సినిమా నుంచి తొలిపాట వచ్చేసింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ పాట మెలోడియస్‍గా ఉంది. లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
Lucky Baskhar Srimathi Garu lyrics: యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా లక్కీ భాస్కర్ సినిమా తెరకెక్కుతోంది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలోనే వచ్చిన ఈ మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా సాగింది. లక్కీ భాస్కర్ సినిమా నుంచి ‘శ్రీమతి గారు’ అంటూ తొలి పాట నేడు (జూన్ 19) రిలీజ్ అయింది. భార్యను భర్త బుజ్జిగించేలా ఉన్న ఈ మెలోడిస్ సాంగ్ అదిరిపోయింది.
లక్కీ భాస్కర్ ఫస్ట్ సాంగ్
లక్కీ భాస్కర్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘శ్రీమతి గారు’ పాటకు వింటేజ్ మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు. తెలుగులో ఈ పాటను విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ పాట మెలోడియస్‍గా మంచి లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. అలిగిన భార్యను మెప్పించేందుకు భర్త పాడే పాటగా ఉంది. ఈ పాటలో దుల్కర్, మీనాక్షి కెమిస్ట్రీ అద్భుతంగా కనిపించింది. లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
'శ్రీమతి గారు' పాట లిరిక్స్ ఇవే..
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు
పలుకే నీది.. ఓ వెన్నె పూస
అలకే ఆపే మనసా
మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా
ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే
ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే
నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు
హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే
నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే
అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని
నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే
బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు
గారాబం మెచ్చిందే శ్రీమతి గారు
లక్కీ భాస్కర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. బ్యాంకులో పని చేసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‍గా ఈ మూవీలో దుల్కర్ నటిస్తున్నారు. అయితే, ఏదో బిగ్ ట్విస్ట్ ఉంటుందనేలా టీజర్‌లో హింట్ ఇచ్చారు మేకర్స్. గతేడాది ‘సార్’తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి.. లక్కీ భాస్కర్ మూవీని తెరకెక్కిస్తున్నారు.
లక్కీ భాస్కర్ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ఇటీవల ప్రకటించింది. అయితే, ఆ తేదీకి దేవర సినిమా వస్తుండటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్‍లో రిలీజ్ డేట్ లేదు. ఆగస్టులోనే లక్కీ భాస్కర్ మూవీని రిలీజ్ చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‍పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
టాపిక్