Mystery Thriller Movie: శంబాల మూవీలో త‌మిళ హీరోయిన్ - ఆది సాయికుమార్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌!-lubber pandhu fame swasika to play key role in aadi saikumar shambhala movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mystery Thriller Movie: శంబాల మూవీలో త‌మిళ హీరోయిన్ - ఆది సాయికుమార్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌!

Mystery Thriller Movie: శంబాల మూవీలో త‌మిళ హీరోయిన్ - ఆది సాయికుమార్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌!

Mystery Thriller Movie: ఆది సాయికుమార్ శంబాల మూవీ నుంచి మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ న్యూ ఇయ‌ర్ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ల‌బ్బ‌రు పందు ఫేమ్ స్వాసిక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

మిస్టరీ థ్రిల్లర్ మూవీ

Mystery Thriller Movie: ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న శంబాల మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఏ (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు. శంబాల టైటిల్ కింద ఉన్న మిస్టికల్ వరల్డ్ అనే క్యాప్ష‌న్‌ను ఆస‌క్తిని పంచుతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు.

కొత్త పోస్ట‌ర్‌...

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా శంబాల కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఓ పొలంలో విచిత్ర ఆకార‌ణంలో ఉన్న‌ దిష్టి బొమ్మ.. ఆకాశం నుంచి భూమ్మీదకు వస్తున్న అగ్ని కణం క‌నిపిస్తోన్నాయి. వైరెటీగా డిజైన్ చేసిన‌ న్యూ ఇయ‌ర్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌లే ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా అత‌డి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రివీల్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వింటేజ్ లుక్‌లో ఆది సాయికుమార్ క‌నిపించాడు.

సూర్య మూవీలో...

శంబాల మూవీలో త‌మిళ న‌టి స్వాసిక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. రీసెంట్ త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ల‌బ్బ‌ర్ పందులో నాచ‌ర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది స్వాసిక‌. ప్ర‌స్తుతం సూర్య45వ మూవీలో స్వాసిక న‌టిస్తోంది. శంబాలాలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో స్వాసిక క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. శంబాల మూవీలో రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ యాక్ట‌ర్స్ లీడ్ రోల్స్ చేస్తోన్నారు.

హైద‌రాబాద్‌లో...

హన్స్ జిమ్మర్ వంటి హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌తో కలిసి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి శంబాలా సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో శరవేంగా చిత్రీకరణ జరుపుకుంటోంది శంబాల. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇన్స్‌పెక్ట‌ర్ యుగంధ‌ర్...

శంబాల‌తో పాటు ఇన్స్‌పెక్ట‌ర్ యుగంధ‌ర్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు ఆది సాయికుమార్‌. ఈ మూవీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రితో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. గ‌తంలో ఆది సాయికుమార్‌, వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి కాంబోలో చుట్టాల‌బ్బాయి మూవీ వ‌చ్చింది.