ఓటీటీని ఊపేస్తున్న చిన్న సినిమాలు.. డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు వ్యూస్.. చౌర్య పాఠం లాంటి థ్రిల్లర్లదే జోరు-low budget movies shaking ott thrillers like chaurya paatham ronth show time maargan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీని ఊపేస్తున్న చిన్న సినిమాలు.. డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు వ్యూస్.. చౌర్య పాఠం లాంటి థ్రిల్లర్లదే జోరు

ఓటీటీని ఊపేస్తున్న చిన్న సినిమాలు.. డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు వ్యూస్.. చౌర్య పాఠం లాంటి థ్రిల్లర్లదే జోరు

ఓటీటీలో చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలను దాటి డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డు వ్యూస్ రాబడుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో తెగ డిమాండ్ ఉంది.

ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమాలు (x)

ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ లెక్కల గురించి, బడా హీరోలా గురించి పట్టింపు ఉండదు. కంటెంట్ బాగుంటే చిన్న హీరోల సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవుతాయి. థియేటర్లలో ఆదరణ లేని చిన్న సినిమాలు కూడా ఓటీటీని ఊపుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లు డిజిటల్ స్ట్రీమింగ్ తో తమ ముద్రను బలంగా వేస్తున్నాయి. రికార్డు వ్యూస్ రాబడుతున్నాయి. ఓటీటీలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.

200 మిలియన్

చౌర్య పాఠం (chaurya paatham).. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రీసెంట్ గా 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ రాబరీ థ్రిల్లర్ డిజిటల్ ఆడియన్స్ తో జై కొట్టించుకుంటోంది. 2025 ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. కానీ మే 27, 2025లో ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి దంచికొడుతోంది.

సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఉన్న ఓ యువకుడు ఎలాగైనా మూవీ చేయాలనుకుంటాడు. అందుకు ఓ ప్రశాంతమైన గ్రామంలో ఉన్న బ్యాంకును రాబరీ చేయాలనుకుంటాడు. అందుకు ప్లాన్ వేస్తాడు. చౌర్య పాఠం మూవీలో చాలా ట్విస్ట్ లున్నాయి.

ఒక్క రాత్రిలో

ఒక్క రాత్రి ప్యాట్రోలింగ్ కు వెళ్లిన ఇద్దరు పోలీసులకు ఎదురైన సంఘటనలతో వచ్చిన మలయాళ థ్రిల్లర్ సినిమా ‘రోంత్’. జూన్ 13, 2025లో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా జులై 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళం భాషల్లో మూవీ ప్రసారమవుతోంది. మంచి గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగే ఈ సినిమా ఓటీటీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

హత్యతో ఛేంజ్

ఒక్క హత్య ముగ్గురి జీవితాలను ఎలా మార్చింది? ఈగో కారణంగా పోలీస్, కామన్ మ్యాన్ మధ్య వార్ ఎలాంటి స్థాయికి చేరింది? అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో వచ్చిన మూవీ ‘షో టైమ్’. ఓటీటీలో వరుస థ్రిల్లర్లతో దుమ్ము రేపుతున్న నవీన్ చంద్ర నటించిన మరో మూవీనే ఈ షో టైమ్. జులై 4న థియేటర్లలో రిలీజైన ఈ తెలుగు మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ జులై 25న సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లోకి వచ్చిన మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది.

నల్ల రంగులోకి మారే శవాలు

బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ. రీసెంట్ గా వచ్చిన అతని క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మార్గన్’. అమ్మాయిల డెడ్ బాడీలో నలుపు రంగులోకి మారుతాయి. ఈ కేసులను పరిష్కరించేందుకు అడిషనల్ డీజీపీగా హీరో రంగంలోకి దిగుతాడు. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ.. జులై 25న ఓటీటీలోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఫిల్మ్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం