OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ మూవీ.. 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్!
Love Reddy OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ మూవీ లవ్ రెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన లవ్ రెడ్డి 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయింది. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.
Love Reddy OTT Release: తెలుగులో వచ్చే సినిమాలు ఎక్కువగా లవ్ స్టోరీపై ఆధారంగానే వస్తుంటాయి. ఎటు చూసి కథ ఒకేలా ఉన్న చూపించే విధానంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. యూత్‌ను ఆకట్టుకోవడమే కాకుండా అందరికి కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్ కూడా చూపిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా అట్రాక్ట్ చేసే సినిమాలు కూడా ఉంటాయి.
గతేడాది రిలీజ్
అయితే, ప్రేమకథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో గతేడాది వచ్చిన తెలుగు రొమాంటిక్ మూవీనే లవ్ రెడ్డి. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎంజీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
వాస్తవ సంఘనటల ఆధారంగా
సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరించారు. లవ్ రెడ్డి మూవీతో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా డెబ్యూ డైరెక్టర్ స్మరన్ రెడ్డి లవ్ రెడ్డి మూవీని తెరకెక్కించారు.
9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో అక్టోబర్ 18న లవ్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది. అయితే, చిన్న సినిమా కావడం, ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం వంటి ఇతర కారణాలతో సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు. కానీ, లవ్ రెడ్డి మూవీ ఐఎమ్‌డీబీ నుంచి 9.1 రేటింగ్ (ప్రస్తుతం ఉన్న రేటింగ్) సాధించుకుంది.
లవ్ రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్
ఈ సినిమా అంతలా బాగున్నట్లు ఐఎమ్‌డీబీలో 1903 మంది ఓట్ చేశారు. ఈ ఓటింగ్ ప్రకారం సినిమాకు 9.1 రేటింగ్ వచ్చింది. అలాంటి లవ్ రెడ్డి మూవీ ఇవాళ (జనవరి 3) ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో లవ్ రెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో లవ్ రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానం
అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో లవ్ రెడ్డిని చూడాలంటే రెంటల్ విధానంలో చూడాలి. అంటే, సబ్‌స్క్రిప్షన్ ఉన్పప్పటికీ రూ. 125 నుంచి రూ. 149 వరకు డబ్బు చెల్లించి వీక్షించాలి. కానీ, ఆహా ఓటీటీలో మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఎంచక్కా ఫ్రీగా చూసేయొచ్చు.ఇలా రెండు ఓటీటీల్లో లవ్ రెడ్డి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
బస్సులో మొదలైన ప్రేమ ప్రయాణం
కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈ తెలుగు రొమాంటిక్ మూవీ లవ్ రెడ్డిని రెండు ఓటీటీల్లో చూసి ఆనందించొచ్చు. బస్‌లో మొదలైన ప్రేమ ప్రయాణంగా లవ్ రెడ్డి సాగుతుంది. హీరో హీరోయిన్స్ లవ్ చేసుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం, మళ్లీ కలవడం వంటి కీ పాయింట్స్‌తోనే లవ్ రెడ్డి మూవీ ఉందని రిలీజ్ సమయంలో నెటిజన్స్ రివ్యూ ఇచ్చారు.
టాపిక్