Love Me OTT Streaming: మరో ఓటీటీలోకి కూడా వచ్చిన వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ-love me ott streaming vaishnavi chaitanya horror thriller now streaming on aha ott amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me Ott Streaming: మరో ఓటీటీలోకి కూడా వచ్చిన వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ

Love Me OTT Streaming: మరో ఓటీటీలోకి కూడా వచ్చిన వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Jun 17, 2024 07:37 AM IST

Love Me OTT Streaming: వైష్ణవి చైతన్య నటించి హారర్ థ్రిల్లర్ మూవీ లమ్ మి ఇఫ్ యు డేర్ మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

మరో ఓటీటీలోకి కూడా వచ్చిన వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ
మరో ఓటీటీలోకి కూడా వచ్చిన వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీ

Love Me OTT Streaming: రీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పడు రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మి ఇఫ్ యు డేర్ మూవీ గత శుక్రవారం (జూన్ 14) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలుసు కదా. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆ ఓటీటీ ఈ సినిమాను తీసుకొచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది.

ఆహా ఓటీటీలోకి లవ్ మి

బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన లవ్ మి మూవీ మే 25న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలోకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చినట్లు ఆ ప్లాట్‌ఫామ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. దెయ్యంతో ప్రేమ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకులేకపోయింది. దీంతో ఇప్పుడు మూడు వారాల్లోనే రెండు ఓటీటీల్లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్ మి మంచి వసూళ్లే సాధించినా..

లవ్ మి మూవీ గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. హారర్ థ్రిల్లర్ జానర్ కావడంతో తొలి రోజే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. “లవ్ మీ - ఇఫ్ యూ డేర్’ బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించింది. సింగిల్ స్క్రీన్‍లకు మళ్లీ వైభవం తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.4.5కోట్ల వసూళ్లను దక్కించుకుంది” అని మూవీ టీమ్ వెల్లడించింది. లవ్ మీ చిత్రానికి తొలి రోజు థియేటర్లలో ఆక్యుపేషన్ బాగానే కనిపించింది. మోస్తరు బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీకి ఓపెనింగ్ డే మంచి వసూళ్లు వచ్చాయి.

లవ్ మి కథేంటంటే?

అర్జున్ (ఆశిష్), ప్రియ (వైష్ణవి చైతన్య) ప్రేమలో ఉంటారు. దెయ్యాలు లేవంటూ తన యూట్యూబ్ ఛానెల్‍లో వీడియోలు చేస్తుంటాడు అర్జున్. ఇక మిస్టరీలను ఛేదించడాన్ని ఇష్టపడుతుంటాడు. ఈ క్రమంలో దివ్యావతి అనే దెయ్యం గురించి అర్జున్‍కు ప్రియ చెబుతుంది. దివ్యావతి కథ విన్నాక ఆ దెయ్యాన్ని ప్రేమించాలని నిర్ణయించుకుంటాడు అర్జున్.

ఆ దెయ్యం ఉన్న పాడుబడ్డ భవనానికి వెళతాడు. ఆ తర్వాత అర్జున్‍కు ఎదురైన పరిస్థితులు ఏంటి.. దివ్యావతి వెనకున్న కథేంటి.. అర్జున్‍కు దివ్యావతి గురించి ప్రియ ఎందుకు చెప్పింది అనేదే లవ్ మీ మూవీలో ప్రధాన అంశాలు ఉంటాయి.

లవ్ మీ చిత్రాన్ని దిల్‍రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు. లవ్ మీ మూవీకి సీక్వెల్‍ను కూడా మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది. ‘కిల్ మీ.. ఇఫ్ యూ లవ్’ అంటూ సీక్వెల్ టైటిల్ కూడా వెల్లడించింది.

WhatsApp channel