OTT Movies On Lord Krishna: శ్రీ కృష్ణుడిపై తెరకెక్కిన మనసు దోచే సినిమాలు- 2 వెంకటేష్‌వే- ఏ ఓటీటీలో చూడాలంటే?
OTT Movies On Lord Krishna Related Story: ఓటీటీలో శ్రీకృష్ణుడిపై తెరకెక్కిన అనేక సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో మనసు దోచే తెలుగు సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో రెండు సినిమాలు విక్టరీ వెంకటేష్ హీరోగా చేసినవి కావడం విశేషం.
Lord Krishna Based Telugu Movies On OTT: నేడు (ఆగస్ట్ 26) కృష్ణాష్టమి. దీన్నే శ్రీకృష్ణ జన్మాష్టమిగా కూడా జరుపుకుంటారు. ఎందుకుంటే ఈ రోజును శ్రీకుృష్ణుడు జన్మించినట్లుగా హిందువులంతా భావిస్తారు. ఈ పర్వదినాన అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని అంతా కొలుస్తారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఆధారంగా తెరకెక్కిన తెలుగు సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో లుక్కేద్దాం.
కార్తికేయ 2
కార్తికేయకు సీక్వెల్‌గా తెరకెక్కిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఇటీవలే 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారం అందుకుంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా కృష్ణుడి ఆధారంగా, ఆయన గొప్పతనం చెప్పే విధంగా ఉంటుంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ 2 చిత్రం ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమాను ఎంతోమంది చూసినప్పటికీ శ్రీకృష్ణుడి టాపిక్ పరంగా మాత్రం కార్తికేయ 2 బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవచ్చు.
గోపాల గోపాల ఓటీటీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ తొలిసారిగా కలిసి నటించిన సినిమా గోపాల గోపాల. హిందీ మూవీ ఓ మైగాడ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ శ్రీకృష్ణుడిగానే కనిపిస్తాడు. శ్రీకృష్ణుడిలా పవన్ కల్యాణ్ పెట్టే పోజులు, దాన్ని వెంకటేష్ అనుకరించే తీరు సినిమాకు మంచి రెస్పాన్స్ తీసుకొచ్చింది. అలాగే దేవుడిని కాదు మనిషి నమ్ము అనే సిద్ధాంతంతో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
శ్రీ కృష్ణావతారం ఓటీటీ
స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ అంటే శ్రీకృష్ణుడి పాత్రకు పెట్టింది పేరు. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ను తప్పా ఇంకెవరిని ఊహించుకోవడం చాలా కష్టమైన విషయమే. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించి, లార్డ్ కృష్ణ పురాణం ఆధారంగా తెరకెక్కిన సినిమా శ్రీ కృష్ణావతారం. ఈ సినిమా సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీతోపాటు యూట్యూబ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
దేవిపుత్రుడు ఓటీటీ
వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ దేవిపుత్రుడు. ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ గ్రాఫిక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ద్వారక, కృష్ణపక్షులు చేసే సుడిగుండాలు, సముద్ర గర్భంలో ఉన్న కృష్ణుడి విగ్రహం, ప్రళయం రాకుండా విగ్రహం ఉండటం వంటి కృష్ణుడి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దేవిపుత్రుడు మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.
రాధాకృష్ణ సీరియల్ ఓటీటీ
ఇటు తెలుగు, అటు హిందీలో సూపర్ హిట్ అయిన మైథాలజీ సీరియల్ రాధాకృష్ణ. శ్రీకృష్ణ, రాధా లవ్ స్టోరీపై వచ్చిన ఈ సీరియల్ ఎంతగానో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇందులో కృష్ణుడిగా నటించిన సుమేద్ ముద్గల్ కార్ చెప్పే నీతి సూక్తులు, అతని నటన సీరియల్‌కు ఎంతో హెలెట్‌గా నిలిచాయి. ఈ సీరియల్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు.