Monkey Man OTT: హనుమంతుడి మూవీకి సూపర్ క్రేజ్.. SXSWలో స్టాండింగ్ ఒవేషన్, హీరో ఎమోషనల్ కామెంట్స్
Monkey Man Premiere At SXSW Festival: తేజ సజ్జా హనుమాన్ సినిమా తరహాలోనే హనుమంతుడిని గొప్పగా చూపించిన మరో సినిమా మంకీ మ్యాన్. దేవ్ పటేల్ హీరోగా నటించిన ఓటీటీ మూవీ మంకీ మ్యాన్‌కు ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్ ఎస్‌ఎక్స్ఎస్‌డబ్ల్యూలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Monkey Man In SXSW Festival: ఇటీవల హనుమంతుడిని సూపర్ హీరోగా తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ దాదాపుగా రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టి 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. హనుమంతుడి పాత్రకు సంబంధించిన కంటెంట్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29, మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలు వస్తున్నట్లు తెలిసిందే.

అయితే, వీటి లాగే హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని హాలీవుడ్ నుంచి వస్తున్న మరొ కొత్త సినిమా మంకీ మ్యాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా హీరో దేవ్ పటేల్ నటించడమే కాకుండా దీన్ని తెరకెక్కించారు. హీరో దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఓటీటీ సినిమా మంకీ మ్యాన్ ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంకీ మ్యాన్ సినిమాను SXSW (South by Southwest 2024) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
మార్చి 8 నుంచి మార్చి 16వ తేది వరకు ఈ ఎస్ఎక్స్ఎస్‌డబ్ల్యూ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలో మంకీ మ్యాన్ సినిమాను తాజాగా స్క్రీనింగ్ చేశారు. మంకీ మ్యాన్ సినిమా చూసిన హాలీవుడ్ ప్రముఖులను విపరీతంగా ఆకట్టుకుంది. మంకీ మ్యాన్ మూవీ చూసినవాళ్లంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. దాంతో తనకు మూవీకి వచ్చిన స్పందన చూసిన హీరో దేవ్ పటేల్ స్టేజీపై ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమాలో తాను పోషించిన పాత్రకు నిజమైన స్ఫూర్తి లార్డ్ హనుమాన్ అని దేవ్ పటేల్ చెప్పాడు.
"హనుమంతుడి భక్తి, విధేయత, శౌర్యం, బలం, వినయం, క్రమ శిక్షణకు నిలిచే దేవుడు హనుమంతుడు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర హనుమాన్ నుంచే ప్రేరణ పొంది రూపొందించాను. రామాయణం, మహా భారతం నుంచి ప్రేరణ పొందిన సినిమాలు ఇండియాలో చాలా ఉన్నాయి. హాలీవుడ్‌లో మాత్రం ఇదే తొలి సినిమా. ఈ మూవీతో భగవంతుడు హనుమాన్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నాను" అని దేవ్ పటేల్ తెలిపాడు.
కాగా మంకీ మ్యాన్ మూవీ హనుమాన్ నేపథ్యంలో ఉండే ఒక రివేంజ్ స్టోరీ. తన తల్లి మరణానికి కారణం అయిన వాళ్లను హీరో ఎలా అంతం చేశాడన్న అంశాలతో తెరకెక్కింది. పేరుకు మంకీ మ్యాన్ హాలీవుడ్ మూవీ అయినా ఎక్కువగా ముంబై పరిసరాల్లో సినిమాను చిత్రీకరించారు. ఇందులో మదర్ సెంటిమెంట్, రివేంజ్, కుల వ్యవస్థ వంటి పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మంకీ మ్యాన్‌లో అదిరిపేయో విజువల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మంకీ మ్యాన్ సినిమాలో శోభితా ధూళిపాళ హీరోయిన్‌గా నటించింది. మకరంద్ దేశ్ పాండే, సికందర్ ఖేర్, పిటోబాష్, విపిన్ శర్మ, షార్లోటో కోప్లే, అశ్విన్ కల్సేకర్ ముఖ్య పాత్రలు పోషించారు. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన మంకీ మ్యాన్‌ను పాల్ అంగునావేలా, జాన్ కొలీలతో కలిసి తెరకెక్కించాడు దేవ్ పటేల్. ఈ ఇద్దరు సినిమాకు స్క్రీన్ ప్లే రాశారు. ఏప్రిల్ 5న మంకీ మ్యాన్ సినిమాను యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా అమెరికాలో విడుదల కానుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా మంకీ మ్యాన్ రిలీజ్ కానుందని సమాచారం.