Leo - Sanjay Dutt: వరుస బ్లాక్‍బాస్టర్లతో దూసుకుపోతున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‍కు క్రేజ్ విపరీతంగా ఉంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‍తో ప్రస్తుతం లియో మూవీ చేస్తున్నారు లోకేశ్. మాస్టర్ తర్వాత రెండోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దీంతో లియో సినిమాపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. లోకేశ్ మార్క్ యాక్షన్ మూవీగానే లియో ఉండనుంది. లియో చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, నేడు (జూలై 29) సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా లియోలో ఆయన పాత్రను లోకేశ్ పరిచయం చేశారు. లియోలో ఆంటోనీ దాస్ క్యారెక్టర్ చేస్తున్నారు సంజయ్. ఈ క్యారెక్టర్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు లోకేశ్ కనగరాజ్.
“ఆంటోనీ దాస్‍ను మీట్ అవండి. సంజయ్ దత్ సర్.. మా నుంచి మీకు స్మాల్ గిఫ్ట్! మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని లోకేశ్ కనగరాజ్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే సంజయ్ దత్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. లియోలో సంజయ్ దత్ క్యారెక్టర్.. ఆంటోనీ దాస్‍ను వీడియో ద్వారా పరిచయం చేశారు లోకేశ్. సంజయ్ దత్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మరోసారి గ్యాంగ్‍స్టర్‌గా కనిపించబోతున్నారు సంజయ్. చాలా స్టైలిష్‍గా ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా పవర్‌ఫుల్‍గా ఉంది.
కాగా, లియో మూవీ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగానే ఉండనుందని టాక్. అంటే లోకేశ్ గత చిత్రాలకు లియోకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. లియో నుంచి విజయ్ ఫస్ట్ లుక్‍కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
లియో సినిమాలో విజయ్‍కు జోడీగా త్రిష నటిస్తున్నారు. అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. లెవెన్ స్ట్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస లియో మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.
కాగా, హీరో రామ్ పోతినేని - దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోనూ సంజయ్ దత్ నటించనున్నారు. ఈ విషయాన్ని పూరి నేడు అధికారికంగా వెల్లడించారు.
టాపిక్