తెలుగులో మిస్ కాకుండా చూడాల్సిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ చిల్డ్ర‌న్‌ మూవీస్ ఇవే - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌-little soldiers to hope best national award winning telugu children movies on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తెలుగులో మిస్ కాకుండా చూడాల్సిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ చిల్డ్ర‌న్‌ మూవీస్ ఇవే - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌

తెలుగులో మిస్ కాకుండా చూడాల్సిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ చిల్డ్ర‌న్‌ మూవీస్ ఇవే - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌

Nelki Naresh HT Telugu

తెలుగులో డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో వ‌చ్చిన కొన్ని చిల్డ్ర‌న్ మూవీస్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి. నేష‌న‌ల్‌తో పాటు నంది పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న ఆ సినిమాలు ఏవంటే?

చిల్డ్ర‌న్‌ మూవీస్

ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బాలల సినిమాల నిర్మాణం చాలా త‌గ్గింది. గ‌తంలో స్టార్ డైరెక్ట‌ర్స్ తెర‌కెక్కించిన కొన్ని చిల్డ్ర‌న్స్ మూవీస్ అద్భుత విజ‌యాల‌ను ద‌క్కించుకున్న దాఖ‌లాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. తెలుగులో వ‌చ్చిన కొన్ని క్లాసిక్ చిల్డ్ర‌న్ మూవీస్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ సినిమాలు ఏవంటే?

లిటిల్ సోల్జ‌ర్స్‌...

బిగ్‌బాస్ బాల‌దిత్య చైల్డ్ యాక్ట‌ర్‌గా న‌టించిన తెలుగు మూవీ లిటిల్ సోల్జ‌ర్స్ ఓ నేష‌న‌ల్ అవార్డుతో పాటు ఆరు నంది పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న‌ది. 1996లో రిలీజైన ఈ చిల్డ్ర‌న్ మూవీకి గుణ్ణం గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో బేబీ కావ్య‌తో పాటు ర‌మేష్ అర‌వింద్‌, హీరా కీల‌క పాత్ర‌లు పోషించారు. మ్యూజిక‌ల్‌గా ఈ మూవీ పెద్ద హిట్ట‌య్యింది.

మ‌ణిర‌త్నం అంజ‌లి

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అంజ‌లి యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో త‌రుణ్, ర‌ఘువ‌ర‌న్‌, ప్ర‌భు, బేబీ షామిలి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అంజ‌లి అనే చిన్నారి జీవితం నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకుంది. ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియ‌ల్‌గా ఎంట్రీగా నిలిచినా తుది నామినేష‌న్స్‌లో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. ఇది త‌మిళ సినిమానే అయినా తెలుగులో పెద్ద విజ‌యాన్ని సాధించింది.

పాపం ప‌సివాడు

1972లో తెలుగులో రిలీజైన పాపం ప‌సివాడు మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. అడ్వెంచ‌ర‌స్ డ్రామా మూవీగా తెర‌కెక్కిన ఈ బాల‌ల సినిమాకు వీ రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో మాస్ట‌ర్ రాము, ఎస్వీరంగ‌రావు, న‌గేష్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. త‌న మావ‌య్య‌తో క‌లిసి గోపీ అనే పిల్లాడు ప్ర‌యాణిస్తోన్న విమానం థార్ ఏడారిలో కుప్ప‌కూలిపోతుంది. ఈ విమానం ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన గోపికి ఎడారిలో ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? ఆ ఎడారి నుంచి ప్రాణాల‌తో అత‌డు బ‌య‌ట‌ప‌డ్డాడా? లేదా? అన్న‌దే ఈ ఈ మూవీ క‌థ‌.

హోప్ మూవీ

టాలీవుద్ దివంగ‌త నిర్మాత డీ రామానాయుడు యాక్ట‌ర్‌గా క‌నిపించిన హోప్ మూవీ సోష‌ల్ ఇష్యూస్‌పై వ‌చ్చిన బెస్ట్ మూవీగా జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న‌ది. మోడ్ర‌న్ ఎడ్యుకేష‌న‌ల్ సిస్ట‌మ్ కార‌ణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నారు? ఒత్తిడిని భ‌రించ‌లేక ఎలా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు అనే పాయింట్‌తో హోప్ మూవీని ద‌ర్శ‌కుడు స‌తీష్ కాశేట్టి తెర‌కెక్కించారు. ఈ సినిమాలో క‌ళ్యాణి ఓ కీల‌క పాత్ర పోషించింది.

మిణుగురులు

త‌మ పాఠ‌శాల‌లోని స‌మ‌స్య‌ల‌ను క‌లెక్ట‌ర్‌కు విన్న‌వించే క్ర‌మంలో కొంద‌రు అంధులైన చిన్నారులు సాగించిన స్ఫూర్తిదాయ‌క ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రిస్తూ రూపొందిన తెలుగు మూవీ మిణుగురులు ప‌లు ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అనేక అవార్డుల‌ను అందుకున్న‌ది. అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో దీప‌క్ స‌రోజ్‌, ఆశిష్ విద్యార్థి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం