Ugadi OTT Releases: ఉగాది రోజున ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే-list of telugu movies releasing on ott on this ugadi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  List Of Telugu Movies Releasing On Ott On This Ugadi

Ugadi OTT Releases: ఉగాది రోజున ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Mar 21, 2023 11:57 AM IST

Ugadi OTT Releases: ఉగాదికి థియేట‌ర్ల‌లో పాటు ఓటీటీలో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. డిఫ‌రెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏవంటే...

షారుఖ్‌ఖాన్  ప‌ఠాన్
షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్

Ugadi OTT Releases: ఉగాదికి ఓటీటీ ద్వారా అభిమానుల‌కు పండుగ విందును అందించేందుకు ప‌లు సినిమాలు రెడీ అవుతోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

షారుఖ్‌ఖ‌న్ ప‌ఠాన్ - అమెజాన్ ప్రైమ్‌

ఉగాది రోజున‌ షారుఖ్‌ఖాన్ (Shahrukh Khan) లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌ఠాన్ (Pathaan) అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

జ‌న‌వ‌రి 25న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా వెయ్యి కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టించ‌గా జాన్ అబ్ర‌హ‌మ్ విల‌న్ పాత్ర‌ను పోషించారు. దేశంలో భారీ కుట్ర‌ల‌కు శ‌త్రువులు వేసిన ప్లాన్స్‌ను ఓ రా ఏజెంట్ ఎలా ఎదుర్కొన్నాడ‌నే క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది.

విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ - ఆహా ఓటీటీ

కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) హీరోగా న‌టించిన విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ల‌వ్‌, యాక్ష‌న్, దేశ‌భ‌క్తి ఇలా మిక్స‌డ్ జోన‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.ఈ ఏడాది టాలీవుడ్ హిట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

పంచ‌తంత్రం - ఈటీవీ విన్

బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, న‌రేష్ అగ‌స్త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన పంచ‌తంత్రం సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఐదు క‌థ‌ల స‌మాహారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

వీటితో పాటుగా తెలుగు సినిమా రైటో లెఫ్టో ఈ టీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.