OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ఫ్యాన్స్‌కు పండ‌గే - ప‌ద‌హారు సినిమాలు, ఆరు సిరీస్‌లు రిలీజ్‌-list of movies and web series releasing this week on ott
Telugu News  /  Entertainment  /  List Of Movies And Web Series Releasing This Week On Ott
అమిగోస్
అమిగోస్

OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ఫ్యాన్స్‌కు పండ‌గే - ప‌ద‌హారు సినిమాలు, ఆరు సిరీస్‌లు రిలీజ్‌

31 March 2023, 5:52 ISTNelki Naresh Kumar
31 March 2023, 5:52 IST

OTT Releases This Week: ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిలీజైన‌, కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవంటే...

OTT Releases This Week:

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

అమిగోస్(Amigos) - ఏప్రిల్ 1

క‌ళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్‌లో న‌టించిన అమిగోస్ సినిమా ఏప్రిల్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ర‌క్త సంబంధం లేని ముగ్గురు వ్య‌క్తుల క‌థ‌తో ఈసినిమా తెర‌కెక్కింది. ఫిబ్ర‌వ‌రి 10న థియేట‌ర్ల‌లో విడుద‌లైన అమిగోస్‌ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. కాన్సెప్ట్‌, క‌ళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగున్నా క‌న్ఫ్యూజ‌న్ లేకుండా ద‌ర్శ‌కుడు క‌థ‌ను స్క్రీన్‌ఫై ప్ర‌జెంట్ చేయ‌డంలో త‌డ‌బ‌డ్డాడ‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టించింది.

ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహ‌బ్బ‌త్ (హిందీ)

ఫ‌రాజ్ (హిందీ)

కిల్ బాక్సూన్‌ (కొరియ‌న్ మూవీ)

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ 2 (హాలీవుడ్ మూవీ)

కాపీక్యాట్ కిల్ల‌ర్ (తైవాన్ సిరీస్ )

అన్‌సీన్ సిరీస్ సీజ‌న్ 2

షెహ‌జాదా (హిందీ మూవీ)

ఆహా ఓటీటీ (Aha OTT)

స‌త్తిగాని రెండెక‌రాలు

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా క‌నిపించిన జ‌గ‌దీష్ భండారి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న స‌త్తిగారి రెండెక‌రాలు సినిమా ఆహా ఓటీటీ ద్వారా ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. డార్క్ కామెడీ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు అభిన‌వ్ దండ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. వెన్నెల‌కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు.

గోదారి డాక్యుమెంట‌రీ

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

శ్రీదేవి శోభ‌న్‌బాబు

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించిన శ్రీదేవి శోభ‌న్‌బాబు మూవీ గురువారం (మార్చి 30) నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంతోష్ శోభ‌న్‌, గౌరి జి కిష‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు ప్ర‌శాంత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా ఈ సినిమా నిలిచింది. బావ‌మ‌ర‌ద‌ళ్ల క‌థ‌తో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందింది.

గాస్‌లైట్ మూవీ

జీ5 ఓటీటీ (Zee5)

అయోథి (త‌మిళ్ మూవీ)

ఆగిళ‌న్ (త‌మిళ్ మూవీ)

యునైటెడ్ క‌చ్ఛే (హిందీ సిరీస్‌)

స‌న్ నెక్స్ట్ ఓటీటీ

భ‌గీరా

ప్ర‌భుదేవా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన భ‌గీరా మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో శుక్ర‌వారం రిలీజ్ కానుంది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మిస్ట‌ర్ బ్యాచ్‌ల‌ర్ (క‌న్న‌డ మూవీ)

అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime Video)

ది ప‌వ‌ర్ సిరీస్

క‌చేర్ మ‌నుష్

విక్ట‌ర్ లెస్పార్డ్‌