OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల అవుతోన్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే-list of movies and web series releasing on ott this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  List Of Movies And Web Series Releasing On Ott This Week

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుద‌ల అవుతోన్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే

Nelki Naresh Kumar HT Telugu
Oct 13, 2022 06:15 AM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో యాక్ష‌న్‌, ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలు ఎక్కువ‌గా స్ట్రీమింగ్ కానున్నాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవంటే...

శింబు
శింబు

OTT Releases This Week:

నేను మీకు బాగా కావాల్సిన వాడిని - ‍‍‍‍‍అక్టోబ‌ర్ 13 ఆహా, అమెజాన్ ప్రైమ్‌

కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram), సంజ‌న ఆనంద్ జంట‌గా న‌టించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో గురువారం (నేడు) నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ప్రేమ‌లో ప‌డిన ఓ క్యాబ్ డ్రైవ‌ర్ క‌థ‌తో రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదె ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సెప్టెంబ‌ర్ 16న ఈసినిమా థియేట‌ర్ల‌లో రిలీజైంది. నెల రోజులు కాక‌ముందే ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2 - అక్టోబ‌ర్ 14 - ఆహా

తెలుగులో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ టాక్‌షోల‌లో ఒక‌టిగా నిలిచింది అన్‌స్టాప‌బుల్‌. ఈ టాక్ షో సెకండ్ సీజ‌న్‌తో హోస్ట్‌గా మ‌రోమారు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచ‌డానికి అగ్ర హీరో బాల‌కృష్ణ రెడీ అయ్యారు. ఈ నెల 14న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు టెలికాస్ట్ కానుంది. ఈ ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు బాల‌కృష్ణ వియ్యంకుడు, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ గెస్ట్‌లుగా హాజ‌రుకానున్నారు. ఆహా ఓటీటీలో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త ఎపిసోడ్‌ను రిలీజ్ చేయ‌నున్నారు.

వెండు థ‌నింధాథు కాడు ( త‌మిళం) - అక్టోబ‌ర్ 13- అమెజాన్ ప్రైమ్‌

హీరో శింబు(Simbu), ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ క‌ల‌యిక‌లో రూపొందిన గ్యాంగ్‌స్ట‌ర్ చిత్రం వెండు థ‌నింధాథు కాడు సినిమా మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అక్టోబ‌ర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సిద్ధి ఇద్నానీ క‌థానాయిక‌గా న‌టించింది.

గుడ్ బ్యాడ్ గ‌ర్ల్ వెబ్‌సిరీస్ - అక్టోబ‌ర్ 14 - సోని లివ్‌

మిస్ మ్యాచ్‌డ్ సీజ‌న్ 2 వెబ్‌సిరీస్ - అక్టోబ‌ర్ 14- నెట్‌ఫ్లిక్స్‌

తాప్సీ దొబారా - అక్టోబ‌ర్ 15- నెట్‌ఫ్లిక్స్‌

తాప్సీ అనురాగ్ క‌శ్య‌ప్ డైరెక్ష‌న్‌లో రూపొందిన దొబారా సినిమా అక్టోబ‌ర్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో స రిలీజ్ కానుంది. మిస్ట‌రీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఎక్సెప్ష‌న్ - అక్టోబ‌ర్ 13 -నెట్‌ఫ్లిక్స్‌

శాంతారాం - అక్టోబ‌ర్ 14 -ఆపిల్ టీవీ ప్ల‌స్‌

బ‌ఫూన్ - అక్టోబ‌ర్ 14 - నెట్‌ఫ్లిక్స్‌

వైభ‌వ్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం బ‌ఫూన్ అక్టోబ‌ర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కార్తిక్ సుబ్బ‌రాజు నిర్మించిన ఈ సినిమాకు అశోక్ వీర‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పాల్తు జ‌న్వ‌ర్ (మ‌ల‌యాళం0 - అక్టోబ‌ర్ 13 - డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌

ట్రిగ్గ‌ర్ (త‌మిళం) - అక్టోబ‌ర్ 14 - ఆహా త‌మిళ్‌

IPL_Entry_Point