Telugu News  /  Entertainment  /  List Of Movies And Web Series Releasing On Ott This Week
ర‌క్షిత్ శెట్టి
ర‌క్షిత్ శెట్టి (Twitter)

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుదలకానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

29 September 2022, 6:12 ISTNelki Naresh Kumar
29 September 2022, 6:12 IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో ఫ్యామిలీ,ఎంట‌ర్‌టైన్‌మెంట్ కథాంశాలతో రూపొందిన సినిమాలు,వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సిరీస్‌లు,సినిమాలు ఏవంటే...

OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

రంగ రంగ వైభ‌వంగా - అక్టోబ‌ర్ 2-నెట్‌ఫ్లిక్స్‌

మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్(Vaishnavtej)), కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా సినిమా అక్టోబ‌ర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్నేహం, ప్రేమ అంశాల‌కు కుటుంబ బంధాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు గిరీశాయ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

ప్లాన్ ఏ ప్లాన్ బీ- సెప్టెంబ‌ర్ 30 -నెట్‌ఫ్లిక్స్‌

త‌మ‌న్నా(Tamannaah), రితేష్ దేశ్‌ముఖ్(Riteish Deshmukh) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ చిత్రం ప్లాన్ ఏ ప్లాన్ బీ సెప్టెంబ‌ర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ విడాకుల లాయ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా త‌మ‌న్నా మ్యారేజీ బ్యూరో నిర్వ‌హ‌కురాలిగా న‌టిస్తోంది. శ‌శాంక ఘోష్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

హోక‌స్ పోక‌స్ 2 - సెప్టెంబ‌ర్ 30 డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

ఎంట‌ర్‌గ‌లాక్టిక్ - సెప్టెంబ‌ర్ 30- నెట్‌ఫ్లిక్స్‌

క‌ర్మ యుద్ధ్ సిరీస్ -సెప్టెంబ‌ర్ 30- డిస్నీప్ల‌స్‌హాట్‌స్టార్‌

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో స‌తీష్ కౌషిక్‌, అషుతోష్ రాణా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

రేయికి వేయిక‌ళ్ళు- సెప్టెంబ‌ర్ 30 -ఆహా

అరుణ్‌నిధి స్టాలిన్‌, అజ్మ‌ల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం ఇర‌వుక్కు అయిర‌మ్ కంగ‌ల్ తెలుగులో రేయికి వేయిక‌ళ్ళు పేరుతో డ‌బ్ కానుంది. సెప్టెంబ‌ర్ 30న ఆహాలో ఈ థ్రిల్ల‌ర్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

మై బెస్ట్ ఫ్రెండ్ ఎక్సోర్సిజం -సెప్టెంబ‌ర్ 30 -అమెజాన్ ప్రైమ్‌

ఫ‌రెవ‌ర్ క్వీన్స్ సీజ‌న్ 1- అక్టోబ‌ర్ 2- నెట్‌ఫ్లిక్స్‌

కెప్టెన్(Captain) - సెప్టెంబ‌ర్ 30 - జీ5

ఆర్య‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం కెప్టెన్ సెప్టెంబ‌ర్ 30న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఫాంట‌సీ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు శ‌క్తి సౌంద‌ర్‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ చేయ‌బోతున్నారు.

777 ఛార్లి(777 Charlie) - సెప్టెంబ‌ర్ 30 - అమెజాన్ ప్రైమ్‌

కన్నడ సినిమా 777 ఛార్లి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ధ‌ర్మ అనే ఓ యువ‌కుడికి ఛార్లి అనే డాగ్‌తో ఏర్ప‌డిన అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. రెంట‌ల్ విధానంలో 777ఛార్లి రిలీజ్ కానుంది. ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించిన ఈ చిత్రానికి కిర‌ణ్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

బుల్లెట్ ట్రైన్ -సెప్టెంబ‌ర్ 29 -జీ5

పృథ్వీరాజ్ సుకుమారన్ తీర్పు- సెప్టెంబర్ 30- డిస్నీ ప్లస్ హాట్ స్టార్