The Goat Life Runtime: పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ రన్ టైమ్ ఇదే - లిప్‌లాక్ సీన్ హైలైట్ అంట!
The Goat Life Runtime: పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్‌లైఫ్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో మార్చి 28న రిలీజ్ అవుతోంది. ఈ పృథ్వీరాజ్, అమలపాల్ లిప్‌లాక్ సీన్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.

The Goat Life Runtime: సలార్ తర్వాత మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) మూవీ మార్చి 28న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు.
ఈ సినిమా రన్ టైమ్ రివీలైంది. రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నిడివితో గోట్‌లైఫ్ తెలుగులో రిలీజ్ అవుతోంది. రెండు గంటల యాభై రెండు నిమిషాల లెంగ్త్‌తో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ సభ్యులు కొన్ని సీన్స్‌కు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. దాంతో పదకొండు నిమిషాలు పైనే సినిమాను ట్రిమ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ నుంచి యూ ఏ సర్టిఫికెట్ వచ్చింది.
లిప్‌లాక్ సీన్...
గోట్‌లైఫ్ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమారన్, అమలాపాల్ మధ్య లిప్‌లాక్ సీన్ ఉండబోతున్నట్లు తెలిసింది. ఐదు నిమిషాల కంటే ఎక్కువ నిడివితోనే ఈ లిప్‌లాక్ సీన్ ఉంటుందని అంటున్నారు. గోట్‌లైఫ్ సినిమాకు ఈ లిప్‌లాక్ హైలైట్‌గా ఉంటుందని మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల కాలంలో ఎక్కువ నిడివి గల లిప్‌లాక్ సీన్ ఉన్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. కథ డిమాండ్ మేరకు లిప్‌లాక్ సీన్ పెట్టాల్సివచ్చిందిన ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ తెలిపింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్నందించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి 'తేజమే రెహమానేనా..' అనే లిరికల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు.
పాటలో ఏఆర్ రెహమాన్ యాక్టింగ్...
'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. తేజమే రెహమానేనా తేజమే రహీమ్, యాడున్నావో యాడున్నావో గుండె తడవగ వానై పో..ఉప్పే లేని కన్నీరొలికి, ఆవిరి పెదవుల తాకగ రా..ఆటు పోటుల ఆకలి ఎడారిలో చూడన చూడన నీ కలకై...' అంటూ ఎడారి కష్టాల్లో ఉన్న హీరో తన ప్రేయసిని తల్చుకుంటూ పాడే ఎమోషనల్ సాంగ్ ఇది.
ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా కనిపిస్తారని మేకర్స్ ప్రకటించారు. సినిమా షూటింగ్ జరిగిన ఏడారికి స్వయంగా వెళ్లిన రెహమాన్ ..అక్కడ హీరో క్యారెక్టర్ పడే సంఘర్షణను, ప్రకృతిని తానూ అనుభూతి చెందుతాడు. ఆ ఫీల్ తోనే ఈ పాట కంపోజ్ చేసినట్లు రెహమాన్ లిరికల్ వీడియోలో వెల్లడించారు.
వాస్తవ ఘటనలతో...
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నాడు డైరెక్టర్ బ్లెస్సీ..
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. గోట్‌లైఫ్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 2009లో గోట్‌లైఫ్ మూవీని అనౌన్స్ చేశారు. 2024లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.