Liger OTT Release Date: విజయ్ దేవరకొండ హీరోగా, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా గత నెల 25న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోవడంతోఅభిమానులు తీవ్రంగా నిరాశకు లోనయ్యారు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో విజయ్ తర్వాతి చిత్రం జేజీఎంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా లైగర్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే అనుకున్నదానికంటే నాలుగు వారాల ముందుగానే సినిమా ఓటీటీలోకి అందుబాటులో రానుంది. సెప్టెంబరు 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రసారం కానుంది. సినిమాకు వచ్చిన భారీ నష్టాలను పూడ్చుకునేందుకే ముందుగానే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు గానూ లైగర్ మేకర్స్ హాట్‌స్టార్‌తో మంచి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా వల్ల నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి చెల్లించేందుకు పూరి జగన్నాథ్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో హాట్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మేకర్స్‌కు కాస్త ఉపశమనాన్ని కలిగించిందట.
అయితే ఇటీవల తెలుగు నిర్మాతల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏ సినిమా అయిన థియేటర్లలో రిలీజైన 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నిబంధన విధించింది. కానీ లైగర్ విషయంలో మాత్రం ఇది ఈ నిబంధన వర్తించదట. ఎందుకంటే చాలా ముందుగానే మేకర్స్.. డీల్ కుదుర్చుకున్నారట.
Liger OTT Release Date telugu: విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం