Liger Hindi OTT Release Date: విజయ్ దేవరకొండ (Vijay deverakonda)లైగర్ ఓటీటీ ద్వారా ఈ వారంలోనే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా హిందీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సోమవారం వెల్లడించారు. లైగర్ హిందీ వెర్షన్ అక్టోబర్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా గత నెల 22న ఈ సినిమా రిలీజైంది. కానీ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు.
తాజాగా దీపావళి సందర్భంగా బాలీవుడ్‌లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri jagannadh)ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ రొటీన్ కథ, కథనాల కారణంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
లైగర్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. హిందీలో కూడా ఈ సినిమా ఇరవై కోట్ల లోపే వసూళ్లను సాధించింది. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్యా పాండే హీరోయిన్‌గా నటించింది. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్‌తో జనగణమన సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. కానీ లైగర్ ఫ్లాప్‌తో ఈ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.