Liger Box Office Collections: లైగర్ బాక్సాఫీస్ కలెక్షన్లు అదిరిపోయేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్లు ఇంకా తెలియకపోయినా.. యూఎస్ ప్రీమియర్స్ ద్వారా మాత్రం లైగర్ బాగానే వసూలు చేసింది. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే లైగర్ 3.5 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమా అఫీషియల్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన సరిగమ సినిమాస్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
"లైగర్ ప్రీమియర్స్ గ్రాస్ 3.5+ లక్షల డాలర్లుగా ఉంది. వసూళ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి" అని ఈ సంస్థ ట్వీట్ చేసింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా అంటే గురువారం(ఆగస్ట్ 25) రాత్రి స్పెషల్ షోలు వేస్తుండగా.. శుక్రవారం మూవీ రిలీజ్ కానుంది.
ఇక లైగర్ మూవీ రివ్యూల విషయానికి వస్తే ట్విటర్‌లో ఫ్యాన్స్ పూర్తిగా డివైడయ్యారు. విజయ్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ బాగానే నచ్చింది. అయితే మిగతా వారు మాత్రం పెదవి విరిచారు. విజయ్ పర్ఫార్మెన్స్‌కు అందరూ వందకు వంద మార్కులు వేసినా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే నాసిరకంగా ఉన్నట్లు ట్విటర్‌లో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ లైగర్‌తోనే బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఇది ఆ రేంజ్ మూవీ కాదని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. మూవీ ఫస్ట్ రివ్యూలు ఎలా ఉన్నా.. దీనిపై భారీ అంచనాలు ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో ఓపెనింగ్స్ విషయంలో మాత్రం లైగర్‌కు ఢోకా లేదనే చెప్పాలి.
సంబంధిత కథనం