Life Of Ram Song Lyrics: యూట్యూబ్ లో 22 కోట్ల వ్యూస్.. జీవితాన్ని తెలిపే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్.. ఇదిగో లిరిక్స్-life of ram song lyrics from jaanu movie telugu sharwanand sirivennela sitharama shastri tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Life Of Ram Song Lyrics: యూట్యూబ్ లో 22 కోట్ల వ్యూస్.. జీవితాన్ని తెలిపే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్.. ఇదిగో లిరిక్స్

Life Of Ram Song Lyrics: యూట్యూబ్ లో 22 కోట్ల వ్యూస్.. జీవితాన్ని తెలిపే లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్.. ఇదిగో లిరిక్స్

Life Of Ram Song Lyrics: తెలుగు సినిమా పాటలను ప్రేమించే ఫ్యాన్స్ ప్లే లిస్ట్ లో కచ్చితంగా ఈ సాంగ్ ఉంటుంది. జీవిత అర్థాన్ని తెలిపే ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉంది. అయిదేళ్ల క్రితం రిలీజైన లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ లిరిక్స్ మీకోసం.

లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ లో శర్వానంద్ (youtube)

అయిదేళ్ల అయినా ‘లైఫ్ ఆఫ్ రామ్’ సాంగ్ క్రేజ్ మాత్రం అసలు తగ్గట్లేదు. కథానాయకుడి ఒంటరి ప్రయాణాన్ని వివరిస్తూ సాగే ఈ పాట ఫ్యాన్స్ మది దోచుకుంటూనే ఉంది. ఈ సాంగ్ లో హీరో పర్సనాలిటీకి చాలా మంది వ్యక్తిగతంగా కనెక్ట్ కావడమే ఇందుకు కారణం. 2020 ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పోస్టు చేసిన ఈ వీడియో సాంగ్ కు ఇప్పటివరకూ 22 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

సిరివెన్నెల ఆణిముత్యం

శర్వానంద్, సమంత జోడీగా నటించిన ‘జాను’ సినిమాలోని ఈ సాంగ్ దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ మేలిమి ఆణిముత్యం. ఎన్నో అద్భుతమైన పాటలకు సాహిత్యాన్ని అందించి దివికేగిన సిరివెన్నెల.. ఈ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ తో మరో పెట్టు పైకేక్కేశారనే చెప్పొచ్చు. ఈ సాంగ్ లోని ఒక్కో పదానికి ఉండే అర్థం ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకెళ్లింది.

ఈ సాంగ్ కు అద్భుతమైన మ్యూజిక్ ను ఇచ్చారు గోవింద్ వసంత. అంతే గొప్పగా పాడారు సింగర్ ప్రదీప్ కుమార్. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేసిన జాను మూవీ రొమాంటికా డ్రామాగా రిలీజ్ అయింది. తమిళంలో వచ్చిన ‘96’ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా.. ఫ్యాన్స్ మనసులను బరువెక్కించింది.

లిరిక్స్ ఇదిగో

పల్లవి:

ఏదారెదురైనా ఎటువెళుతుందో అడిగానా

ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న

ఎం చూస్తూ ఉన్నా నే వెతికాన ఏదైనా

ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న

కదలని ఓ శిలనే ఐన

తృటిలో కరిగే కలనే ఐన

ఎం తేడా ఉందట

నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా

ఇలాగే కడదాకా

ఓ ప్రశ్నై ఉంటానంటున్న

ఏదో ఒక బదులై

నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్న

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు

అనొద్దు దయుంచి ఎవరు

ఇంకొన్ని జన్మలకి సరిపడు

అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా

తన వెన్నంటి నడిపిన

చేయూత ఎవరిది

నా ఎద లయను కుసలం అడిగిన

గుస గుస కబురుల

గుమ గుమ లెవరివి

చరణం 1:

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా

కాలం ఇపుడే నను కనగా

అనగనగ అంటూ నే ఉంటా

ఎపుడు పూర్తవనే అవక

తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక

కాలు నిలవదు ఏ చోట నిలకడగా

ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ

ఎందుకు వేస్తుందో కేక మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు

అనొద్దు దయుంచి ఎవరు

ఇంకొన్ని జన్మలకి సరిపడు

అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా

తన వెన్నంటి నడిపిన

చేయూత ఎవరిది

నా ఎద లయను కుసలం అడిగిన

గుస గుస కబురుల

గుమ గుమ లెవరివి

చరణం 2:

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం

నాకే సొంతం అంటున్నా విన్నారా

నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న

రాకూడదు ఇంకెవరైనా

అమ్మ వొడిలో మొన్న

అందని ఆశలతో నిన్న

ఎంతో ఊరిస్తూ ఉంది

జాబిలీ అంత దూరాన ఉన్న

వెన్నెలగా చంతనే ఉన్న

అంటూ ఊయలలూపింది జోలాలి

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం