Liam Payne: అనుమానాస్పద రీతిలో పాప్ సింగర్ లియాన్ పేన్ కన్నుమూత - ఆరుగురితో ఎఫైర్లు - చివరకు సింగిల్‌గా!
Liam Payne: ఇంగ్లీష్ పాప్ సింగర్ లియామ్ పేన్ అర్జెంటీనాలోని ఓ హోటల్ బాల్కానీ నుంచి పడి మరణించాడు. అతడి మరణం హాలీవుడ్ వర్గాలతో పాటు మ్యూజిక్ లవర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. వన్ డైరెక్షన్ మ్యూజిక్ బ్యాండ్ ద్వారా ఫేమస్ అయ్యాడు లియామ్ పేన్.

Liam Payne: ఇంగ్లీష్ పాప్ సింగర్ లియామ్ పేన్ అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఓ హోటల్ మూడో ఫ్లోర్ బాల్కానీ నుంచి కిందపడి లియామ్ పేన్ మరణించినట్లు అర్జెంటీనా పోలీస్ వర్గాలు తెలిపాయి. ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా...లేదంటే మత్తులో అతడు బాల్కానీ నుంచి జారిపడ్డాడా అన్నది మిస్టరీగా మారింది. 31 ఏళ్ల వయసులోనే అతడు కన్నుమూయడం మ్యూజిక్ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురిచేస్తోంది.
డ్రగ్స్ సేవించాడా?
చనిపోవడానికి ముందు అతడు డ్రగ్స్ సేవించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. లియామ్ పేన్ మరణంపై పోలీసుల విచారణ కొనసాగుతోన్నట్లు తెలిసింది. చనిపోవడానికి ముందురోజు లియామ్ పేన్ హోటల్‌లో విచిత్రంగా ప్రవర్తించినట్లు సమాచారం. హోటల్ లాబీలో కోపంతో తన ల్యాప్‌ట్యాప్‌ను పగలగొట్టాడని, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా రూమ్‌లో ఉన్నట్లు చెబుతోన్నారు.
డిప్రెషన్‌లో...
తాను డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్నట్లు గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో లియామ్ పేన్ చెప్పాడు. తాగుడుకు బానిసగా మారిన లియాన్ తన కెరీర్‌లో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. ఏడీహెచ్‌డీ అనే మానసిక సమస్యతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధికి ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. అనారోగ్య సమస్యలతో పాటు కెరీర్‌లోని ఒడిదుడుకులు కూడా అతడి మరణానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వన్ డైరెక్షన్ మ్యూజిక్ బ్యాండ్...
వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయినా వన్ డైరెక్షన్ మ్యూజిక్ బ్యాండ్‌లో 2010 నుంచి 2015 వరకు మెంబర్‌గా కొనసాగాడు లియామ్ ఫేన్. అతడు మెంబర్‌గా ఉన్న టైమ్‌లోనే వన్ డైరెక్షన్ బ్యాండ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. వన్ బ్యాండ్ కంటే ముందు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. చాలా ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయ్యాడు. ది ఎక్స్ ఫ్యాక్టర్ అనే వెబ్‌సిరీస్‌తో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. వన్ డైరెక్షన్‌లో మెంబర్‌గా చేరడంతో దియామ్ దశ తిరిగిపోయింది.
సోలోగా...
2015లో వన్ డైరెక్షన్ నుంచి బయటకు వచ్చి సోలోగా ఆల్బమ్స్ చేయడం మొదలుపెట్టాడు లియామ్. సోలోగా లియామ్ పేన్ చేసిన స్ట్రిప్ ది డౌన్ వరల్డ్ వైడ్‌గా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. యూస్ బిల్‌బోర్డ్ టాప్ 100 లిస్ట్‌లో టాప్ టెన్ సాంగ్స్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్‌లో కొన్ని వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు. పాప్ సింగర్‌గా పలు అవార్డులు అందుకున్నాడు.
లవ్ స్టోరీస్‌లు ఎక్కువే...
లియామ్ పేన్ కెరీర్‌లో లవ్‌స్టోరీస్ ఎక్కువే ఉన్నాయి. అవన్నీ బ్రేకప్ కావడంతో ప్రస్తుతం సింగిల్‌గా జీవిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఎక్స్ ఫ్యాక్టర్ డ్యాన్సర్ డేనియల్ పీజర్‌తో ప్రేమాయణం సాగించాడు లియామ్. ఆ తర్వాత చిన్ననాటి స్నేహితురాలు సోఫియా స్మిత్‌తో కొన్నాళ్లు లవ్ ఎఫైర్ నడిపించాడు.
చెరేల్ కోల్, నయోమీ కాంప్‌బెల్, మాయా హెన్రీ, కేట్ కసీడే .. లియామ్ ఎఫైర్స్ నడిపించాడు. లియమ్ మరణంతో ప్రపంచ సంగీత అభిమానులు షాక్ అవుతోన్నారు. పారిస్ హిల్టన్‌తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ లియామ్ మృతికి సంతాపం తెలిపారు.