LGM OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ ధోనీ ఎల్‌జీఎమ్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?-lgm ott release date dhoni movie streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lgm Ott Release Date: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ ధోనీ ఎల్‌జీఎమ్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

LGM OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ ధోనీ ఎల్‌జీఎమ్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

LGM OTT Release Date: టీమిండియా క్రికెట‌ర్ ధోనీ నిర్మించిన ఎల్‌జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్‌) మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది.

ఎల్‌జీఎమ్

LGM OTT Release Date: లెజెండ‌రీ క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీ నిర్మించిన ఎల్‌జీఎమ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్ర‌వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఈ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఎల్‌జీఎమ్ సినిమాకు ర‌మేష్ త‌మిళ‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ కోలీవుడ్ మూవీలో హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా హీరోహీరోయిన్లుగా న‌టించారు. న‌దియా కీల‌క పాత్ర‌ను పోషించింది. ధోనీ సినిమా రంగంలోకి ఎంట‌ర్ అవుతూ ఫ‌స్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేసిన మూవీ కావ‌డంతో షూటింగ్ ప్రారంభం నుంచే ఎల్‌జీఎమ్ సినీ అభిమానుల దృష్టిని ఆక‌ర్షించింది. భారీ అంచ‌నాల‌తో తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో రిలీజైన ఈ చిన్న సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

త‌మిళంలో జూలై 28న రిలీజైన ఈ సినిమా తెలుగులో మాత్రం వారం ఆల‌స్యంగా ఆగ‌స్ట్ 4న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రెండు చోట్ల ఈ సినిమాకు సేమ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. పాయింట్ కొత్త‌గానే ఉన్నా ఫ‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ రెండు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

ఎల్‌జీఎమ్ క‌థేమిటంటే...

గౌత‌మ్ (హ‌రీష్ క‌ళ్యాణ్‌) మీరా(ఇవానా) ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటారు. పెళ్లికి ముందే త‌న‌కు కాబోయే అత్త‌గారు ఎలాంటిదో తెలుసుకోవాల‌ని మీరా అనుకుంటుంది. ఆమెతో క‌లిసి కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. ఆ ట్రిప్‌లో ఏం జ‌రిగింది? త‌ల్లికి, కాబోయే భార్య‌కు మ‌ధ్య గౌత‌మ్ ఎలా న‌లిగిపోయాడు? కూర్గ్ ట్రిప్‌ నుంచి మీరా తో పాటు గౌత‌మ్ త‌ల్లి గోవా ఎందుకు వెళ్లారు? ప్ర‌మాదంలో చిక్కుకున్న వారిని గౌత‌మ్ ఎలా కాపాడాడు? అన్న‌దే ఈసినిమా క‌థ‌.