లెవెన్ రివ్యూ.. షాకింగ్ ట్విస్టులు.. ఇవాళ రిలీజైన నవీన్ చంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?-leven movie review in telugu and rating hero naveen chandra crime investigation thriller leven explained telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  లెవెన్ రివ్యూ.. షాకింగ్ ట్విస్టులు.. ఇవాళ రిలీజైన నవీన్ చంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

లెవెన్ రివ్యూ.. షాకింగ్ ట్విస్టులు.. ఇవాళ రిలీజైన నవీన్ చంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. తమిళం, తెలుగు భాషల్లో బైలింగువల్‌గా ఇవాళ (మే16) లెవెన్ మూవీ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో లెవెన్ రివ్యూలో తెలుసుకుందాం.

లెవెన్ రివ్యూ.. షాకింగ్ ట్విస్టులు.. ఇవాళ రిలీజైన నవీన్ చంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌తో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. తాజాగా నవీన్ చంద్ర నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (మే 16) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి లెవెన్ రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: లెవెన్

నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, దిలీపన్, అభిరామి, ఆడుకాలం నరేన్, రిత్విక, రవివర్మ, అర్ణై, కిరిటీ దామరాజు తదితరులు

దర్శకుడు: లోకేష్అజ్ల్స్

సంగీత దర్శకుడు: డి ఇమ్మాన్

సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోక్

ఎడిటింగ్: శ్రీకాంత్ ఎన్‌బీ

విడుదల తేది: మే 16, 2025

కథ:

వైజాగ్‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హత్యలు ఎవరు చేశారు, ఎవరిని చేశారు అనేది అంతుచిక్కకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ హత్య కేసులను పరిశోధించే పోలీస్ ఆఫీసర్ రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దీంతో స్మార్ట్ పోలీస్‌గా పేరున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ (నవీన్ చంద్ర)కు ఆ కేసు అప్పగిస్తారు.

కేసు పరిశోధనలో ఓ చిన్న క్లూ దొరుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? అరవింద్ హంతకులను పట్టుకున్నాడా? అసలు హత్యకు గురయింది ఎవరు? వారిని హంతకుడు చంపడానికి కారణాలు ఏంటీ? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే లెవెన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ అనగానే ఒక హత్య లేదా వరుస హత్యలు వాటిపై పరిశోధన ఇలాగే సినిమాలు ఉంటాయి. అయితే, వాటిని ఎంత గ్రిప్పింగ్, థ్రిల్లింగ్‌గా తెరపై ఆవిష్కరించామనేదే సవాలుగా ఉంటుంది. ఆ సవాలులో డైరెక్టర్ లోకేష్ అజ్ల్స్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. వరుస హత్యలు జరగడం, హీరో కేసు తీసుకోవడం రొటీన్ అయినప్పటికీ తెరకెక్కించిన విధానం బాగుంది.

హత్యలు చేసేది ఎవరు

ముఖ్యంగా సినిమాలో వచ్చే షాకింగ్ ట్విస్టులు, మలుపులు ఎంతో ఆకట్టుకుంటాయి. హత్యలు చేసేది ఎవరు అనేది మాత్రమే కాకుండా ఎవరు హత్యకు గురయ్యారో తెలియకపోవడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక చనిపోయింది ఎవరో తెలుసుకున్న తర్వాత కూడా కిల్లర్‌ను పట్టుకోకపోవడం, క్లైమాక్స్‌లో రివీల్ కావడం చాలా సినిమాల్లోనే చూస్తాం. కానీ, అది సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చేలా మూవీ ఉంటే సక్సెస్ అయినట్లే. అందులో లెవెన్ సక్సెస్ అయింది.

అదిరిపోయే బీజీఎమ్

చివరి వరకు ఉత్కంఠంగా లెవెన్‌ను చిత్రీకరించారు. ఇక సినిమాకు తగినట్లుగా వచ్చే బీజీమ్ ఎంతో ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. ఇక నవీన చంద్ర మరోసారి తన నటనతో మెప్పించాడు. తన యాక్టింగ్‌లో మంచి వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ లోకేష్ అజ్ల్స్ తన ప్రతిభ చూపించాడు.

నిజమైన ద్విభాషా చిత్రం

మిగతా పాత్రలు కూడా చాలా బాగా మెప్పించాయి. ఇక ద్విభాషా చిత్రాలంటూ వచ్చే చాలా వరకు సినిమాల్లో లిప్ సింక్ సరిగ్గా కుదరదు. కానీ, లెవెన్ మూవీలో తెలుగు వెర్షన్ బాగుంది. నిజమైన ద్విభాషా చిత్రం లెవెన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఊహించని మలుపులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో సీట్‌లో కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లర్ లెవెన్ మూవీ.

రేటింగ్: 3/5

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం