Leo OTT Release Date: లియో మూవీ అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతోందా? ప్రస్తుతం వస్తున్న వార్తలు ఇదే నిజమంటున్నాయి. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. తొలి రోజు నుంచే లియోకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.
మొదట ఈ సినిమా నవంబర్ 21 నుంచి ఓటీటీలోకి వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి ఈ తేదీని కూడా మేకర్స్ ధృవీకరించలేదు. ఇక ఇప్పుడు లీక్ నేపథ్యంలో కాస్త ముందుగానే సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చే ఆలోచన నెట్‌ఫ్లిక్స్ చేస్తోంది.
అయితే దీనిపై అటు లియో మేకర్స్ నుంచి గానీ, నెట్‌ఫ్లిక్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన లియో సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో దుమ్ము రేపింది. శనివారం (నవంబర్ 4) వరకు లియో మూవీ ఏకంగా రూ.522 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. అయితే జైలర్ రికార్డుకు మాత్రం కాస్త దూరంలోనే ఆగిపోయింది.
ఇప్పుడీ సినిమా ఆన్‌లైన్లో లీకవడం, ముందుగానే ఓటీటీలోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రభావం కలెక్షన్లపై పడనుంది. ఈ లియో మూవీలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ నటించగా.. సంజయ్ దత్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మేనన్ లాంటి వాళ్లు కీలకమైన పాత్రలు పోషించారు.