Leo Climax: లియో క్లైమ్యాక్స్ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రేంజ్‌లో ఉంటుందట!
Leo Climax: లియో క్లైమ్యాక్స్ అవెంజర్స్ ఎండ్‌గేమ్ రేంజ్‌లో ఉంటుందట. ఈ విషయాన్ని ఈ సినిమాలో నటిస్తున్న నటుడు అరోణోదయన్ చెప్పాడు. చివరి 20 నిమిషాలు ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పడం విశేషం.
Leo Climax: కోలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ విజయ్ దళపతి, లోకేష్ కనగరాజ్. గతేడాది విక్రమ్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అందించిన లోకేష్.. ఇప్పుడు విజయ్ తో సినిమా తీస్తుండటంతో దీనిపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే విక్రమ్ రికార్డులను కూడా రజనీ, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ బ్రేక్ చేయగా.. ఇప్పుడు లియో ఆ రికార్డులనూ తిరగరాస్తుందని భావిస్తున్నారు.
తాజాగా లియో మూవీ మరో కీలకమైన అప్డేట్ ఇచ్చాడు ఈ సినిమాలో నటిస్తున్న అరుణోదయన్. క్లైమ్యాక్స్ గురించి అతడు స్పందించాడు. దీనిని అతడు ఏకంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ తో పోల్చడం విశేషం. చివరి 20 నిమిషాలు ఓ రేంజ్ లో ఉంటుందని అరుణోదయన్ చెప్పాడు. హాలీవుడ్ లో అత్యధిక వసూళ్ల సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన అవెంజర్స్: ఎండ్ గేమ్ తో లియోని పోల్చడంపై ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ లియో వస్తోంది. గతేడాది వచ్చిన విక్రమ్ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. కమల్ హాసన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోనూ క్లైమ్యాక్స్ హైలైట్ గా నిలిచింది.
ఇప్పడు లియోలోనూ క్లైమ్యాక్స్ చాలా పెద్దగా ఉంటుందని, చివరి అరగంట మొత్తం క్లైమ్యాక్స్ కిందికే వస్తుందని అరుణోదయన్ తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమా రిలీజైన తర్వాత ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయని కూడా అతడు స్పష్టం చేశాడు. అతని కామెంట్స్ తర్వాత ఈ సినిమాలో అతిథి పాత్రలపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
విక్రమ్ మూవీలో సూర్య క్యారెక్టర్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ లియో మూవీలో ఎవరు రాబోతున్నారో అన్న ఆసక్తి నెలకొంది. మరోసారి సూర్యను తీసుకొస్తారా లేక కార్తీ లేదా కమల్ హాసన్ లలో ఒకరిని తీసుకురాబోతున్నారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. లియో మూవీలో విజయ్ సరసన త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.