బిగ్ బాస్‌లోకి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, సెలబ్రిటీలతోపాటు సీరియల్ హీరోయిన్స్, నటీనటులు కంటెస్టెంట్స్‌కా వెళ్తుంటారు. అలా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో ఆకట్టుకుంటోన్న సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి.
ముద్ద మందారం, అగ్ని పరీక్ష సీరియల్స్‌లో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ తనూజ గౌడ బిగ్ బాస్ 9 తెలుగులో తన గేమ్‌తో అలరిస్తుంది. అయితే, బిగ్ బాస్‌కు వెళ్లకముందు తనూజ గౌడ ఓ సినిమా కూడా చేసింది. అది కూడా తెలుగు మూవీ. ఆ సినిమానే లీగల్లీ వీర్.
2024లో వచ్చిన తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రమే లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివ చైతన్య నిర్మించారు. లీగల్లీ వీర్ సినిమాలో మలికిరెడ్డి, తనూజ పుట్టస్వామి, ప్రియాంక రెవ్రీ, దయానంద్ రెడ్డి, జయశ్రీ రాచకొండ ప్రధాన పాత్రలు పోషించారు.
వీరితోపాటు ఢిల్లీ గణేష్, వజ్జ వెంకట గిరీధర్, లీలా సాంసన్, వలప్పక్కుడి వీర శంకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎం వీరనారాయణ రెడ్డి సమర్పణలో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మలికిరెడ్డి శాంతమ్మ నిర్మించిన లీగల్లీ వీర్ గతేడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.
పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రంగానే ఆడినట్లు సమాచారం. కానీ, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.9 రేటింగ్ సాధించుకుంది లీగల్లీ వీర్ సినిమా. అలాంటి లీగల్లీ వీర్ సినిమా సుమారు పది నెలలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
లయన్స్ గేట్ ప్లేలో లీగల్లీ వీర్ ఓటీటీ రిలీజ్ అయింది. అక్టోబర్ 10 నుంచి తెలుగులో లీగల్లీ వీర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ బాలిక మర్డర్ కేసులో రామస్వామి అనే వ్యక్తి ఇరుక్కుంటాడు. అతనే దోషి అన్నట్లుగా అన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యాల్లో ఒకరిగా తనూజ గౌడ కూడా ఉంటుంది. రామస్వామికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు లాయర్‌గా తానేంటే నిరూపించుకోవాలని తపన పడే వీర్ రెడ్డి ఈ కేసు టేకప్ చేస్తాడు.
ఆ తర్వాత ఏమైంది? రామస్వామిని ఈ కేసు నుంచి వీర్ రెడ్డి బయటపడేలా చేశాడా? అసలు బాలికను ఎవరు హత్య చేశారు? రామస్వామి చుట్టు అల్లుకున్న సాక్ష్యాలు ఏంటీ? బాలికకు రామస్వామికి ఉన్న సంబంధం ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఇటీవలే ఓటీటీ రిలీజ్ అయిన లీగల్లీ వీర్ చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్