Unstoppable 4 OTT: నన్ను వదిలేయండంటూ బాలయ్యకు దండం పెట్టేసిన రామ్‍చరణ్.. ఫోన్‍లో ప్రభాస్.. సరదాగా అన్‍స్టాపబుల్ ప్రోమో
Unstoppable 4 OTT: గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్ కోసం అన్‍స్టాపబుల్ షోకు రామ్‍చరణ్ వచ్చారు. ప్రశ్నలతో చెర్రీని ఇబ్బంది పెట్టేశారు బాలయ్య. ప్రభాస్‍కు కూడా కాల్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో జోష్‍తో సరదాగా ఉంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‍స్టాపబుల్ 4’కు గెస్టుగా వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్. తాను హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుండగా.. బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహరాజ్ జనవరి 12న రిలీజ్‍కు ఉంది. ఇద్దరు సంక్రాంతి రేసులో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అన్‍స్టాపబుల్ షోకు చరణ్ వచ్చారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో నేడు వచ్చేసింది. ఫున్ ఫన్‍తో సరదాగా సాగింది. వివరాలివే..
టెన్షన్‍గా ఉంది
గేమ్ ఛేంజర్ మూవీ డైలాగ్ అన్‍ప్రెడిక్టబుల్ అని బాలయ్య, రామ్‍చరణ్ అనడంతో అన్‍స్టాపబుల్ 4 ప్రోమో మొదలైంది. సర్‌ప్రైజ్‍లు చాలా ఉన్నాయని బాలకృష్ణ అంటే.. కొంచెం టెన్షన్‍గా ఉందని చరణ్ చెప్పారు. ఆ తర్వాత చరణ్ అమ్మ, నానమ్మ మాట్లాడిన వీడియోను బాలయ్య చూపించారు.
అల్లు అరవింద్‍తో పార్టీకి వెళతా..
చిరంజీవి, పవన్ కల్యాణ్ నాగబాబు కలిసి ఉన్న ఫొటో చూపించి.. ఎవరితో పార్టీకి వెళతావని బాలయ్య అడిగారు. ఈ ముగ్గురితో కాదు.. మామ అల్లు అరవింద్‍తో వెళతానని చరణ్ అన్నారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని రూమర్లు ఉండగా.. అరవింద్ పేరును చరణ్ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
చరణ్ ఎమోషనల్
2023లో గొప్ప బహుమతి ఇచ్చావంటూ.. చరణ్ కూతురు క్లీంకార పుట్టినప్పటి విజువల్స్ చూపించారు బాలకృష్ణ. దీంతో చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఆడపిల్ల పుడితే.. ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే అని బాలయ్య అన్నారు. పాపకు అన్నం పెడితే తప్ప తన తినడు అని చరణ్ గురించి వాళ్ల నానమ్మ చెప్పారు.
అప్పుడే క్లీంకారను చూపిస్తా
క్లీంకారను ఎప్పుడు చూపిస్తావని బాలకృష్ణ అడిగారు. ఏ రోజైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడు అందరికీ చూపిస్తానని చరణ్ సమాధానం చెప్పారు. ఉపాసనతో గొడవ జరిగితే మళ్లీ కలిసేందుకు ఏం చేస్తావని బాలయ్య అడిగారు. అప్పుడు తన పెంపుడు కుక్క రైమ్‍ను చరణ్ పిలిచారు.
ఆ తర్వాత చరణ్ ఫ్రెండ్స్ హీరో శర్వానంద్, విక్రమ్ వచ్చారు. శర్వా ఏదో అంటే వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్టుగా చూశారు బాలయ్య. ఇదంతా సరదాగా సాగింది.
పవన్.. ఎలా బెటర్
పవన్ కల్యాణ్.. యాక్టర్‌గా బెటరా.. పొలిటిషియన్‍గా బెటరా అని బాలకృష్ణ అడిగారు. దీంతో తనను ట్రబుల్‍లో పెట్టేందుకు ఇలా అడుగుతున్నారని చరణ్ అన్నారు. అందుకే అని బాలయ్య చెప్పారు. ఉపాసన అంటే భయమా అని కూడా ప్రశ్నించారు. దీంతో నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టారు చరణ్. పర్సనల్‍గా మహేశ్, ప్రభాస్‍లో ఎవరు కంఫర్టబుల్ అని అడిగితే.. ఇంకా హార్ట్ బీట్ పెంచమ్మా అన్నారు చెర్రీ. దీంతో బాలయ్య నవ్వేశారు.
ఆ తర్వాత దిల్‍రాజు ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో సరదాగా మాట్లాడారు బాలయ్య. పార్టీ ఇస్తానంటే.. పది మందితో వస్తానని అన్నారు. రా మచ్చా మచ్చా పాటకు బాలకృష్ణ, చరణ్, దిల్‍రాజు కలిసి స్టెప్స్ వేశారు. తొడ కొట్టారు.
ప్రభాస్‍కు కాల్.. టెన్షన్ పడిన చరణ్
రెబల్ స్టార్ ప్రభాస్‍కు కాల్ చేశారు బాలకృష్ణ. ప్రభాస్ పెళ్లెప్పుడు అని అడిగారు. తనకి తనకి ఏం జరిగిందని చరణ్‍ను ఉద్దేశించి ప్రభాస్‍ను బాలయ్య అడిగారు. దీంతో ఏం లేదంటూ టెన్షన్‍గా చూశారు చరణ్. “మీరు ఫోన్ చేస్తే టెన్షన్ వస్తోంది.. నాకు కాదు చరణ్‍కు” అని నవ్వుతూ ప్రభాస్ చెప్పారు. అన్‍ప్రెడెక్టిబుల్ అనే డైలాగ్‍తో ఈ ప్రోమో ముగిసింది.
ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్
రామ్‍చరణ్ పాల్గొన్న ఈ అన్‍స్టాపబుల్ 4వ సీజన్ తొమ్మిదో ఎపిసోడ్ ఆహా ఓటీటీలో జనవరి 8వ తేదీ సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్‍కు రానుంది.