Lavanya on Varun Tej: వరుణ్ తేజ్ చాలా అందంగా ఉంటాడు.. తమ రిలేషన్ గురించి లావణ్య హింట్ ఇచ్చిందా?
Lavanya on Varun Tej: టాలీవుడ్ బ్యూటీ లావణ్ త్రిపాఠి.. మెగా హీరో లావణ్య త్రిపాఠిపై ప్రశంసల వర్షం కురిపించింది. అందంగా ఉండే హీరోలు ఎవరనే ప్రశ్నకు సమాధానంగా వరుణ్ తేజ్ పేరును చెప్పింది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు ఈమె వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.
Lavanya on Varun Tej: టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఓ పక్క ప్రొఫెషనల్ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితం ద్వారా కూడా వార్తల్లో నిలుస్తోంది. మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఈ అమ్మడు రిలేషన్‌లో ఉందంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై వీరిద్దరూ ఇంతవరకు నోరు మెదపలేదు. తాజాగా లావణ్య త్రిపాఠి.. తమ బంధం గురించి కాస్త హింట్ ఇచ్చింది. ఆమె నటించిన పులిమేక అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మాట్లాడిన లావణ్య.. హీరోల్లో ఎవరు అందంగా ఉంటారనే ప్రశ్నకు వరుణ్ పేరు చెప్పింది.
పులిమేక వెబ్ సిరీస్ ట్రైలర్ ఈవెంట్‌లో విలేకరులతో మాట్లాడిన లావణ్య త్రిపాఠిని.. ఏ హీరోలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని అడుగ్గా.. ఆమె తడుముకోకుండా వరుణ్ తేజ్ పేరు చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య బంధం గురించి కాస్త హింట్ ఇచ్చినట్లయింది. ఇప్పటికే వరుణ్-లావణ్య ప్రేమలో ఉన్నారని విస్తృతంగా వార్తలు వస్తున్న వేళ.. తాజాగా ముద్దుగుమ్మ సమాధానంతో వీరి రిలేషన్‌పై మరింత క్లారిటీ వచ్చింది.
వరుణ్-లావణ్య ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ అనే రెండు చిత్రాల్లో కలిసి కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశంపై ఇంతవరకు వీరిద్దరూ అస్సలు నోరు మెదపలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇరువురు ఒకరినొకరు లైక్ చేసుకోవడం, పోస్టులకు రిప్లయి ఇవ్వడం చేస్తుండటంతో వీరి మధ్య ఏదో ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.
ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కూడా వరుణ్ తేజ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో వరుణ్ పెళ్లి పీటలెక్కుతాడని స్పష్టం చేశారు. అంతేకాకుండా అతడికి కాబోయే భార్య గురించి కూడా త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవ ధారి అర్జున అనే సినిమా చేస్తున్నారు.