మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల ఎంతో లక్కీ అని అంటున్నారు నెటిజన్లు. తన భర్త వరుణ్ తేజ్ ఆమెను అంత బాగా చూసుకుంటుండటమే అందుకు కారణం. సెలబ్రిటీ కపుల్స్ అంటే గొడవలు వస్తాయని, విడిపోతారని చాలా జంటలు నిరూపించాయి. కానీ ప్రేమగా కూడా ఉండొచ్చని కొంతమంది చాటిచెప్పారు. అలాంటి వాళ్లలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కచ్చితంగా ఉంటారు. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్లు వాళ్ల మధ్య ఉన్న అన్యోన్య దంపత్యానికి నిదర్శనంలా నిలిచాయి.
లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసిన ఫస్ట్ మూవీ అందాల రాక్షసి. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో మూవీ యూనిట్ పార్టిసిపేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో భర్త వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి.
‘‘అంతకంటే ముందు ఒంటరిగా బతికేదాన్ని. ఒక్కదానినే ఉండటం అలవాటైపోయింది. కానీ వరుణ్ వచ్చిన తర్వాత లైఫ్ మారిపోయింది. అతను నన్ను అమ్మలా చూసుకుంటున్నాడు. నాకు టైమ్ కు మెడిసిన ఇస్తాడు. చేతితో తినిపిస్తాడు. నేనెప్పుడూ ఎవరికీ తినిపించలేదు. నేను అడగకపోయినా తను నా కోసం అన్నీ చేస్తాడు’’ అని లావణ్య తెలిపింది.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి మిస్టర్ మూవీ చేశారు. ఈ సినిమా 2017లో రిలీజైంది. ఈ మూవీ షూటింగ్ లోనే లావణ్య, వరుణ్ మనసులు కలిశాయి. 2018లో ఈ జోడీ అంతరిక్షం సినిమా కూడా చేసింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట 2023 నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ప్రెగ్నంట్. ఆమె గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది మే 6న సోషల్ మీడియాలో వరుణ్ ప్రకటించాడు.
లావణ్య త్రిపాఠి డెబ్యూ మూవీ అందాల రాక్షసి. 2012లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ ఫీల్ గుడ్ మూవీ యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి. నవీన చంద్ర, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. జూన్ 13న థియేటర్లకు రాబోతోంది. మరి రీ రిలీజ్ లో ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
సంబంధిత కథనం