Top 3 Telugu Serials: టాప్ 3 తెలుగు సీరియల్స్ ఇవే.. అర్బన్ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నవి ఈ సీరియల్స్‌నే..-latest trp ratings of star maa tv serials top 3 telugu serials in urban market karthika deepam gunde ninda gudi gantalu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Top 3 Telugu Serials: టాప్ 3 తెలుగు సీరియల్స్ ఇవే.. అర్బన్ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నవి ఈ సీరియల్స్‌నే..

Top 3 Telugu Serials: టాప్ 3 తెలుగు సీరియల్స్ ఇవే.. అర్బన్ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నవి ఈ సీరియల్స్‌నే..

Hari Prasad S HT Telugu

Top 3 Telugu Serials: తెలుగు టీవీ సీరియల్స్ లో అర్బన్ మార్కెట్ లో టాప్ 3 స్థానాల్లో ఉన్న సీరియల్స్ ఏవో తేలిపోయాయి. అయితే ఈ సీరియల్స్ అన్నీ స్టార్ మాకు చెందినవే కావడం విశేషం. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇవి దూసుకెళ్తున్నాయి.

టాప్ 3 తెలుగు సీరియల్స్ ఇవే.. అర్బన్ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నవి ఈ సీరియల్స్‌నే..

Top 3 Telugu Serials: స్టార్ మా సీరియల్స్ దూకుడు ఎలా ఉందో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే అందులోనూ ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ అటు రూరల్, ఇటు అర్బన్ రెండింట్లోనూ టాప్ లోకి దూసుకురావడం విశేషం. పదో వారానికి సంబంధించిన రేటింగ్స్ లో అర్బన్ మార్కెట్ లోనూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ వెనుకబడిపోయింది.

టాప్ 3 తెలుగు సీరియల్స్ ఇవే

ప్రతి వారం తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేస్తారన్న విషయం తెలుసు కదా. అయితే ఇందులో అర్బన్, రూరల్ కలిపి టాప్ లో ఏ సీరియల్స్ ఉన్నాయో చూస్తుంటాం. కానీ కేవలం అర్బన్ మార్కెట్ విషయానికి వస్తే ఈ రేటింగ్స్, టాప్ 3 స్థానాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. తాజాగా 10వ వారానికి రిలీజ్ చేసిన రేటింగ్స్ లో అర్బన్ మార్కెట్ ప్రకారం తెలుగులో టాప్ 3 అన్నీ స్టార్ మాకు చెందిన సీరియల్సే.

వీటిలో కార్తీకదీపం 2 తొలిస్థానంలో నిలవడం విశేషం. నిజానికి ఓవరాల్ గా కొన్ని నెలలుగా ఈ సీరియల్ టాప్ లో ఉన్నా.. అర్బన్ మార్కెట్ లో మాత్రం గుండె నిండా గుడి గంటలు టాప్ లో ఉంటూ వస్తోంది. కానీ తాజా రేటింగ్స్ ప్రకారం చూస్తే.. 10.68 రేటింగ్ తో కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానాన్ని ఆక్రమించింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు 10వ వారం అర్బన్ మార్కెట్ లో 10.43 రేటింగ్ నమోదైంది. ఇక మూడో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 9.53 రేటింగ్ వచ్చింది. ఆ లెక్కన తెలుగు టీవీ ఛానెల్స్ లో అర్బన్ ఏరియాలోని ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్న సీరియల్స్ ఈ మూడే అని తేలిపోయింది.

కార్తీకదీపం 2 దూకుడు

కార్తీకదీపం సీరియల్ తొలి సీజన్ లోనే కాదు రెండో సీజన్లోనూ తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ రక్తి కట్టిస్తూ సాగుతోంది. దీంతో అటు రూరల్, ఇటు అర్బన్ రెండు ఏరియాల్లోనూ ఈ సీరియల్ ను ఎగబడి చూసేస్తున్నారు. నిజానికి దీనికంటే ముందు బ్రహ్మముడి సీరియల్ టాప్ లో ఉండేది.

కానీ ఆ సీరియల్ టైమ్ మార్చిన తర్వాత కార్తీకదీపం 2 హవా మొదలైంది. గడిచిన నాలుగైదు నెలలుగా ఈ సీరియల్ కు తిరుగులేకుండా పోతోంది. గుండె నిండా గుడి గంటలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణంలాంటి సీరియల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా.. అవేవీ ఈ సీరియల్ ను టీఆర్పీల్లో దాటలేకపోతున్నాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం