Aha OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన టాలీవుడ్ డ్రామా థ్రిల్లర్ మూవీ - ఎందులో చూడాలంటే?
AHA OTT: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిన్న సినిమా నరుడి బ్రతుకు నటన శుక్రవారం ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డ్రామా థ్రిల్లర్ మూవీలో శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా కనిపించారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా నరుడి బ్రతుకు నటన సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
డ్రామా థ్రిల్లర్...
డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన నరుడి బ్రతుకు నటన మూవీలో శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా నటించారు. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించాడు. శృతిజయన్, ఐశ్వర్య అనిల్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది.
డబ్బే సర్వస్వం అనుకునే ఓ యువకుడి జీవితం తాలూకు విలువను, ఆనందాన్ని ఎలా తెలుసుకున్నాడన్నది నాచురల్‌గా దర్శకుడు ఈ మూవీలో ఆవిష్కరించాడు. కంప్లీట్‌గా కేరళ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయిన ఈ మూవీ అరవైకిపైగా అవార్డులను గెలుచుకుంది.
నరుడి బ్రతుకు నటన కథ…
సినిమా నటుడు కావాలన్నది సత్య (శివ రామచంద్రవరపు) కలలు కంటుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అవకాశం రాదు. ఆడిషన్స్‌లో అవమానాలు ఎదుర్కొంటాడు.
సత్యలో యాక్టింగ్ టాలెంట్ లేదని అతడి తండ్రి కూడా అనుకుంటాడు. సినిమా కలను పక్కనపెట్టి జాబ్ చేసుకోమని సలహా ఇస్తాడు. నటుడు కావాలంటే ముందుగా మనిషిగా మారాలని, ఎమోషన్స్ గురించి తెలుసుకోవాలని స్నేహితుడు ఇచ్చిన సలహాను నమ్మి ఒంటరిగా కేరళ వెళతాడు సత్య.
సత్య దగ్గర ఉన్న డబ్బు కొద్దిరోజుల్లోనే అయిపోతుంది. ఫోన్ మిస్సవుతుంది. రిచ్ లైఫ్‌స్టైల్ అనుభవించిన సత్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తోంది. కష్ట సమయంలో సత్య జీవితంలోకి అనుకోకుండా సల్మాన్ (నితిన్ ప్రసన్న) వస్తాడు.
సత్యకు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. అక్కడే సరోగసీ ద్వారా మరొకరికి బిడ్డను కనడానికి సిద్ధ పడ్డ లేఖను (శృతి జయన్) సత్య ఇష్టపడటం మొదలుపెడతాడు. సల్మాన్ పరిచయం సత్య జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది?లేఖకు తన ప్రేమను సత్య చెప్పాడా? నటుడు కావాలనే సత్య కల తీరిందా? సల్మాన్ విఫల ప్రేమ కథేమిటి? మోనిక (ఐశ్వర్య) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
హీరోగా...విలన్‌గా...
నరుడి బ్రతకు నటన కంటే ముందు పలు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శివ రామచంద్రవరపు కనిపించాడు. బాలుగాని టాకీస్, కారందోశతో పాటు పలు చిన్న సినిమాల్లో కథానాయకుడిగా కనిపించాడు. వకీల్‌సాబ్, మజిలీ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, హిట్ 2తో పాటు పలు తెలుగు మూవీస్‌లో నెగెటివ్, పాజిటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలు చేశాడు. నితిన్ ప్రసన్న తెలుగులో అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో విలన్‌గా కనిపించాడు.