Telugu Cinema News Live September 6, 2024: The GOAT Box Office Collections: తొలి రోజే రూ.126 కోట్లు.. దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కొత్త రికార్డు
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 06 Sep 202403:46 PM IST
- The GOAT Box Office Collections: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లలో దుమ్మురేపింది. గురువారం (సెప్టెంబర్ 5) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Fri, 06 Sep 202402:44 PM IST
- Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కాగా.. మరికొన్ని వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.
Fri, 06 Sep 202412:52 PM IST
- Sai Pallavi Dance: తన చెల్లెలి పెళ్లిలో సాయి పల్లవి మైమరచిపోయి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమె చెల్లెలు పూజా కన్నన్ గురువారం (సెప్టెంబర్ 5) పెళ్లి చేసుకుంది.
Fri, 06 Sep 202411:32 AM IST
- OTT Psychological Thriller: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. జగపతి బాబు, అనసూయ నటించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎక్కడ చూడాలంటే..
Fri, 06 Sep 202411:03 AM IST
Prabhas Donations List Till Now: కల్కి 2898 ఏడీ సినిమాలో కర్ణుడిగా ఎంతగానో అలరించిన ప్రభాస్ రియల్ లైఫ్‌లో కూడా కర్ణుడే అని అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే తెలంగాణ, ఏపీలోని వరద బాధితులకు చెరో రూ. కోటి విరాళంగా ఇచ్చాడు. ఇలా ఇప్పటివరకు ప్రభాస్ ఎన్ని కోట్లు దానిమిచ్చాడో తెలుసుకుందాం.
Fri, 06 Sep 202410:42 AM IST
- OTT Comedy Thriller: ఓటీటీలోకి ఇప్పుడో కామెడీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఆహా వీడియో ఒరిజినల్ అయిన ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (సెప్టెంబర్ 6) రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేయడం విశేషం.
Fri, 06 Sep 202410:07 AM IST
కౌన్ బనేగా కరోడ్‌పతిలో అవివాహిత మహిళల గురించి నోరుజారిన కంటెస్టెంట్‌కి అమితాబ్ బచ్చన్ క్లాస్‌పీకారు. ఇంటికి ఆ మహిళలు భారమని అర్థం వచ్చేలా కంటెస్టెంట్ మాట్లాడటగా అమితాబ్ వారిస్తూ చెప్పిన మాటలకి నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
Fri, 06 Sep 202410:04 AM IST
- Heroine Tax: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె కట్టిన ట్యాక్స్ తో పోలిస్తే.. రెండో స్థానంలో ఉన్న వాళ్లు కట్టింది చాలా చాలా తక్కువే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎంత ట్యాక్స్ కట్టిందో చూడండి.
Fri, 06 Sep 202409:29 AM IST
Horror Movie Adbhut OTT Release Date: ఓటీటీ, థియేటర్‌లలో రిలీజ్ కాకుండా నేరుగా బుల్లితెరపై సందడి చేయనుంది హారర్ మూవీ అద్భుత్. వెంకటేష్ సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించి ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత్ టీవీ ఛానెల్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.
Fri, 06 Sep 202409:25 AM IST
Guppedantha Manasu Shailendra: గుప్పెడంత మనసు విలన్ జోడీ దేవయాని, శైలేంద్ర కాంబో మరో కొత్త సీరియల్‌లో కనిపించబోతున్నారు. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సూర్యకాంతం సీరియల్‌లో వీరిద్దరు తల్లీకొడుకులుగా నటిస్తున్నారు.
Fri, 06 Sep 202408:48 AM IST
Jai Jai Ganesha Promo: సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ, ఖుష్బూ ఫస్ట్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈటీవీలో జై జై గణేశా పేరుతో ఓ స్పెషల్ షో టెలికాస్ట్ కానుంది. ఈ షోలో ఇంద్రజ, ఖుష్బూలతో పాటు హీరో శివాజీ కూడా సందడి చేశాడు.
Fri, 06 Sep 202408:45 AM IST
- OTT Telugu Horror Thriller: తెలుగులో ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. కొన్ని రోజుల కిందట ఈ సిరీస్ అనౌన్స్ చేయగా.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 6) ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు.
Fri, 06 Sep 202407:54 AM IST
Kannada OTT: కన్నడ లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ భీమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. దునియా విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దునియా విజయ్ దర్శకత్వం వహించాడు.
Fri, 06 Sep 202407:51 AM IST
- OTT Release This Week: ఈవారంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏవి చూడాలనే కన్ఫ్యూజన్ ఆడియెన్స్‌కు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెటర్ సినిమాలను సజ్జెస్ట్ చేస్తున్నాం. వాటిలో వయలెంట్ యాక్షన్ మూవీ నుంచి, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకు ఉన్నాయి.
Fri, 06 Sep 202407:02 AM IST
Naga Chaitanya Engagement Ring: నాగచైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరూ తమ బంధాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది.
Fri, 06 Sep 202406:40 AM IST
Bigg Boss 8 Telugu Day 5 Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో కెప్టెన్స్‌కు బదులు చీఫ్స్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు చీఫ్స్ మధ్య ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ముగిసిన తర్వాత కర్ణాటకకు చెందిన నిఖిల్ మలియక్కల్, యశ్మీ గౌడ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
Fri, 06 Sep 202406:06 AM IST
Nandamuri Mokshagna Teja: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ కన్ఫామ్ అయ్యింది. మోక్షజ్ఞతేజ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.
Fri, 06 Sep 202405:31 AM IST
Nindu Noorella Saavasam September 6th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌లో పిక్నిక్ వెళ్లకుండా అడ్డుకుందామనుకున్న మనోహరి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేయకని మనోహరికి భాగీ వార్నింగ్ ఇస్తుంది. అంతా అనాథాశ్రమంలోకి వెళ్తారు.
Fri, 06 Sep 202405:00 AM IST
New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (సెప్టెంబర్ 6) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 11 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 6 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే వాటిలో హారర్, యాక్షన్, కామెడీ సినిమాలతోపాటు ఇంట్రెస్టింగ్‌గా ఉండే వెబ్ సిరీసులు ఉన్నాయి. అవేంటో లుక్కేద్దాం.
Fri, 06 Sep 202404:11 AM IST
The Goat Day 1 Collection: విజయ్ ది గోట్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక చతికిలాపడింది. గురువారం వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ యాభై ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు. తెలుగు వెర్షన్ మొదటిరోజు 2.25 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.
Fri, 06 Sep 202403:10 AM IST
Tollywood: తెలుగు అవార్డ్ విన్నింగ్ మూవీ హితుడు యూట్యూబ్‌లో రిలీజైంది. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మీరానందన్ హీరోయిన్‌గా నటించింది. 2014లో బెస్ట్ థర్డ్ తెలుగు మూవీగా హితుడు నంది అవార్డును అందుకున్నది.
Fri, 06 Sep 202402:47 AM IST
Daggubati Family Donation To Flood Victims: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు దగ్గుబాటి ఫ్యామిలీతోపాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్, ఫెడరేషన్ అండగా నిలిచింది. వరద బాధితులకు దగ్గుబాటి ఫ్యామిలీ తరఫున కోటి రూపాయలను విరాళం ఇస్తున్నట్లు నిర్మాత సురేష్ దగ్గుబాటి ప్రకటించారు.
Fri, 06 Sep 202402:23 AM IST
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 6 ఎపిసోడ్‌లో ప్రభావతికి ఇవ్వాల్సిన డబ్బు కోసం తన పార్లర్‌తో పాటు బంగారం మొత్తం అమ్మేస్తుంది రోహిణి. మీనావల్లే తాను ఆడిన నాటకం మొత్తం రివర్స్ అయ్యిందని కోపంతో రగిలిపోతుంది.
Fri, 06 Sep 202402:15 AM IST
Brahmamudi Serial September 6th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ బర్త్ డే సందర్భంగా దుగ్గిరాల ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్తారు. అపర్ణ చనిపోడానికి రాహుల్, రుద్రాణి ప్లాన్ వేస్తారు. ట్యాబ్లెట్స్ మార్చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Fri, 06 Sep 202401:31 AM IST
- Karthika deepam 2 serial today september 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప అడ్డు తొలగించుకోవడం కోసం జ్యోత్స్న నరసింహతో చేతులు కలుపుతుంది. దీపను చంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేయిస్తుంది. అటు పంతుల్ని కలిసి పెళ్ళికి రెండు రోజుల్లోనే ముహూర్తం ఉందని చెప్పిస్తుంది.
Fri, 06 Sep 202401:06 AM IST
OTT: సుమంత్ కొత్త మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అనగనగా పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుమంత్ టీచర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Fri, 06 Sep 202401:04 AM IST
Bigg Boss Telugu 8 First Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ ఓటింగ్‌లో లేడి కంటెస్టెంట్, యాంకర్ విష్ణుప్రియ అత్యధిక ఓట్లతో టాప్‌లో దూసుకుపోతోంది. ఆమెకు పోటీగా నాగ మణికంఠ ఉన్నాడు. విగ్గు పీక్కోవడంతో అతనికి బాగా కలిసొచ్చింది. మరి ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే..