Telugu Cinema News Live September 4, 2024: Daavudi Song Lyrics: అదిరిపోయేలా దేవర ‘దావూదీ’ సాంగ్.. లిరిక్స్ ఇవే
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 04 Sep 202403:37 PM IST
- Daavudi song Lyrics - Devara Movie: దేవర సినిమా నుంచి మూడో పాట రిలీజ్ అయింది. ‘దావుదీ’ అంటూ క్యాచీ పదాలతో ఈ సాంగ్ విడుదలైంది. ఈ పాట వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ట్రెండీగా ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.
Wed, 04 Sep 202402:30 PM IST
- Mr Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయింది. నిర్మాతలకు భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చింది. ఈ తరుణంలో రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారనే విషయం బయటికి వచ్చింది.
Wed, 04 Sep 202401:04 PM IST
- Nindha OTT Release Date: నింద సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. రెండున్నర నెలల తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
Wed, 04 Sep 202411:52 AM IST
- Daavudi Song from Devara: దేవర మూవీ నుంచి మూడో పాట వచ్చేసింది. పుల్ జోష్ ఉన్న ట్యూన్‍తో ఈ సాంగ్ ఉంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్, వారి మధ్య కెమిస్ట్రీ వారెవా అనేలా ఉన్నాయి.
Wed, 04 Sep 202411:02 AM IST
- Bigg Boss Telugu 8 Today Promo: బిగ్బాస్ 8లో నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నామినేషన్ల ప్రక్రియ మూడో ఎపిసోడ్‍కు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా మణింకంఠపై పృథ్విరాజ్ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.
Wed, 04 Sep 202410:19 AM IST
- Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. అయితే, ఈ మూవీ ఓటీటీ డేట్‍పై సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Wed, 04 Sep 202409:36 AM IST
- Nani on Priyadarshi: టాలీవుడ్ ఆమిర్ ఖాన్ అంటూ యువ హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించాడు నేచురల్ స్టార్ నాని. అతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 35 చిన్న కథ కాదు ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన అతడు.. దర్శితోపాటు మూవీని కూడా ఆకాశానికెత్తేశాడు.
Wed, 04 Sep 202409:29 AM IST
Tamil Web Series: హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన పంచాయత్ వెబ్‌సిరీస్ తమిళంలోకి రీమేక్ అవుతోంది. తళవెట్టియాన్‌పాళ్యం అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ తమిళ్ సిరీస్‌లో అభిషేక్‌కుమార్, దేవదర్శిని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Wed, 04 Sep 202409:07 AM IST
- Prabhas - Allu Arjun Donation: వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వరద బాధితుల కోసం సినీ సెలెబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు వరద సహాయక చర్యల కోసం ఇరు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు.
Wed, 04 Sep 202408:47 AM IST
Mister Celebrity Movie: టాలీవుడ్ సీనియర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. మిస్టర్ సెలబ్రిటీ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. సెలిబ్రిటీలపై వచ్చే రూమర్స్‌తో ఈ సినిమాను దర్శకుడు చందిన రవికిషోర్ తెరకెక్కించాడు.
Wed, 04 Sep 202408:36 AM IST
- Suhas Movie: ఏపీ, తెలంగాణల్లోని వరదలు కొంప ముంచాయి. దీంతో తెలుగులో ఈ వారం రిలీజ్ కావాల్సిన కామెడీ మూవీ వాయిదా పడింది. సుహాస్ నటించిన ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ బుధవారం (సెప్టెంబర్ 4) అధికారికంగా అనౌన్స్ చేశారు.
Wed, 04 Sep 202407:43 AM IST
- Intimate Scene: హీరో, హీరోయిన్లు ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో ఎవరైనా అదుపు తప్పితే ఎలా ఉంటుంది? నిజానికి ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇలాగే ఓ హీరో అలాంటి సీన్ చేసే వేళ కంట్రోల్ చేసుకోలేక హీరోయిన పెదవిని గట్టిగా కొరికేశాడట.
Wed, 04 Sep 202407:21 AM IST
Psychological Thriller OTT: తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సింబా ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. సింబా మూవీలో జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది స్టోరీ, డైలాగ్స్ అందించాడు.
Wed, 04 Sep 202406:56 AM IST
- Thriller Movie Youtube: ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఫ్రీగా యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చింది. ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా హక్కులు ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Wed, 04 Sep 202405:55 AM IST
- Star Comedian: ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ చేయడానికి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేస్తోంది. కానీ ఒకప్పుడు ఆమె తినడానికి సరైన తిండి లేక చెత్తకుప్పల్లో దొరికింది కూడా తిన్నదన్న విషయం మీకు తెలుసా? ఆమె సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Wed, 04 Sep 202405:20 AM IST
Gabbar Singh Re Release: టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా గబ్బర్ సింగ్ ఏడు కోట్ల యాభై మూడు లక్షల వసూళ్లను రాబట్టింది. నైజాంలో మొదటిరోజు ఈ సినిమా 2.90 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నది.
Wed, 04 Sep 202405:00 AM IST
- NNS 04th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 4) ఎపిసోడ్లో.. మిస్సమ్మను అంజు.. అమ్మ అని పిలుస్తుంది. అటు పిక్నిక్ కు వెళ్దామని అమర్ అనగా.. చిత్రగుప్తుడికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది.
Wed, 04 Sep 202404:09 AM IST
Bigg boss 8 Telugu Elimination: బిగ్బాస్ 8 తెలుగు నామినేషన్ల ప్రక్రియ మొత్తం గొడవలతోనే సాగింది. అయితే సోనియా, ప్రేరణతో పాటు మిగిలిన కంటెస్టెంట్ల గొడవలు, వాదనలు తెచ్చిపెట్టుకున్నట్లుగా ఆర్టిఫీషియల్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోది ఎక్కువైపోయిందని అంటున్నారు.
Wed, 04 Sep 202403:13 AM IST
- OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి ఓ తమిళ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ హిట్ మూవీ సిరీస్ లో భాగంగా ఈ కొత్త వెబ్ సిరీస్ తెరకెక్కింది.
Wed, 04 Sep 202403:03 AM IST
Mystery Thriller OTT: ఫహాద్ ఫాజిల్, మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇరుల్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మిస్టర్ థ్రిల్లర్ మూవీ తమిళ్ వెర్షన్ ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
Wed, 04 Sep 202402:25 AM IST
- OTT Murder Mystery Web Series: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ నిజ జీవిత క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ టీజర్ తాజాగా రిలీజైంది. ఏడు హత్యల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లింగ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది.
Wed, 04 Sep 202402:11 AM IST
Brahmamudi September 4th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 4 ఎపిసోడ్‌లో రాహుల్‌ను నిర్దోషిగా పోలీసులు విడుదలచేస్తారు. తన కొడుకు జైలు నుంచి బయటకు రావడంతో రుద్రాణి తెగ సంబరపడుతుంది. తనను జైలు పాలు చేసిన కావ్యపై రివేంజ్ తీర్చుకునేందుకు రాహుల్ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.
Wed, 04 Sep 202401:46 AM IST
- Karthika deepam 2 serial today september 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దాసు చెప్పే ఒక్కొక్క నిజం విని పారిజాతం షాక్ అవుతుంది. అసలైన వారసురాలు ఎక్కడ ఉందో వెతికి పట్టుకుని తనకు నిజం చెప్తానని దాసు చెప్తాడు. ఇక నుంచి అదే పనిలో ఉంటానని అంటాడు.
Wed, 04 Sep 202412:41 AM IST
Thalapathy Vijay: దళపతి విజయ్ ది గోట్ మూవీలో టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. కాగా తెలుగులో దళపతి విజయ్ డబ్బింగ్ సినిమాల్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా ది గోట్ రికార్డ్ క్రియేట్ చేసింది.