Telugu Cinema News Live September 24, 2024: OTT Comedy Web Series: పాపులర్ కామెడీ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది.. వివరాలివే
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 24 Sep 202402:53 PM IST
- Arthamayyindha Arun Kumar 2 OTT Web Series: అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ రెడీ అవుతోంది. ఈ విషయంపై అధికారిక అప్‍డేట్ వచ్చింది. తొలి సీజన్ పాపులర్ కావటంతో రెండో సీజన్‍పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Tue, 24 Sep 202401:36 PM IST
- Devara Movie: దేవర చిత్రం గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కీలక విషయాలు చెప్పారు. క్లైమాక్స్ గురించి హైప్ పెంచేశారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ పాత్ర ఎప్పుడు వస్తుందో కూడా వెల్లడించారు.
Tue, 24 Sep 202411:54 AM IST
- Maharaja OTT Streaming: మహారాజ్ చిత్రం థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ట్రెండింగ్‍లో అదరగొడుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలో తాజాగా మరో ఫీట్ సాధించింది.
Tue, 24 Sep 202410:34 AM IST
- Saripodhaa Sanivaaram OTT Streaming: సరిపోదా శనివారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ సమీపిస్తోంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Tue, 24 Sep 202409:29 AM IST
- Kathi Apology: తిరుమల లడ్డూ కల్తీ విషయంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అయితే, ఈ విషయంపై తమిళ హీరో కార్తి ఓ కామెంట్ చేశారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో కార్తి వివరణ ఇచ్చుకున్నారు.
Tue, 24 Sep 202409:27 AM IST
- Devara Tickets: దేవర మూవీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇదొక్క ఉదాహరణ చాలు. రెండే రెండు నిమిషాల్లో ఏకంగా 27 షోల టికెట్లు అమ్ముడుపోయాయంటే నమ్మగలరా? జూనియర్ ఎన్టీఆర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతలా వేచి చూస్తున్నారో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
Tue, 24 Sep 202408:58 AM IST
Bigg Boss Telugu 8 Fourth Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్ ఓటింగ్‌లో వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రిది టాప్‌లో దూసుకుపోతూ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంతకుముందు యాంకర్ విష్ణుప్రియ, నిఖిల్‌కు వచ్చిన వచ్చిన ఓటింగ్ కంటే ఎక్కువగా సంపాదించి సత్తా చాటాడు.
Tue, 24 Sep 202408:37 AM IST
- Koratala Siva on Chiranjeevi: దేవర సినిమా వస్తున్న తరుణంలో మీడియాతో మాట్లాడారు డైరెక్టర్ కొరటాల శివ. కొన్ని అంశాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో విభేదాల గురించి వస్తున్న రూమర్ల గురించి కూడా రెస్పాండ్ అయ్యారు.
Tue, 24 Sep 202408:36 AM IST
- Chuttamalle Song: చుట్టమల్లే చుట్టేస్తాందె అంటూ దేవర మూవీలోని పాటను బాలీవుడ్ నటి ఆలియా భట్ పాడిన వీడియో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఓ టాక్ షోలో ఆమె ఇలా ఓ తెలుగు పాటను ఎంతో అందంగా పాడి ఆశ్చర్యపరిచింది.
Tue, 24 Sep 202408:01 AM IST
- Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వరుసగా రెండో వారం కూడా అదే రియాల్టీ షో టాప్ లో నిలిచింది. ఇక ఎప్పటిలాగే టాప్ 10లో స్టార్ మా, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన షోలే ఉండటం విశేషం.
Tue, 24 Sep 202407:48 AM IST
Telugu Comedy Web Series Chantabbai In Youtube: నేరుగా యూట్యూబ్‌లోకి వచ్చిన లవ్ అండ్ కామెడీ వెబ్ సిరీస్ చంటబ్బాయ్. గోదావరి నుంచి వచ్చే చల్లగాలి లాంటి కథ అంటూ ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఇందులో సూర్య శ్రీనివాస్, రోహిణి రేచల్ హీరో హీరోయన్లుగా నటించారు.
Tue, 24 Sep 202407:08 AM IST
- OTT Family Drama: ఓటీటీలోకి మరో ఫ్యామిలీ డ్రామా మూవీ నేరుగా వస్తోంది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 24) ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరో పది రోజుల్లో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానుంది.
Tue, 24 Sep 202407:01 AM IST
Bigg Boss Telugu 8 Yashmi Vs Sonia: బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో సోనియా వర్సెస్ యష్మీ జోరుగా సాగింది. సోనియాపై యష్మీ విరుచుకుపడింది. నామినేషన్స్‌లో తనను అన్న మాటలపై కౌంటర్ ఇచ్చింది. సిస్టర్, మదర్ అంటూ వాడిని బాగా వాడుకుంటున్నావ్ అని గట్టిగా చెప్పేసింది. తర్వాత ఎమోషనల్ అయి ఏడ్చేసింది.
Tue, 24 Sep 202406:06 AM IST
- OTT Top Malayalam Movies: ఓటీటీల్లోకి ఈ మధ్యకాలంలో కొన్ని బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ మలయాళం సినిమాలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ప్రైమ్ వీడియో, జీ5, మనోరమ మ్యాక్స్ లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 10 మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.
Tue, 24 Sep 202405:03 AM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీలో ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటైన కిల్ ను ఇప్పుడు తెలుగుతోపాటు మరో రెండు భాషల్లోనూ చూడొచ్చు.
Tue, 24 Sep 202404:12 AM IST
OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వారం మొత్తంగా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి స్ట్రీమింగ్ అవనున్నాయి. వాటిలో 2 భయపెట్టే హారర్ సినిమాలతోపాటు క్రైమ్, కామెడీ, రొమాంటిక్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్‌తో ఏకంగా 11 వరకు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి.
Tue, 24 Sep 202403:37 AM IST
- Jr NTR Thanks Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. దేవర మూవీ టికెట్ల ధరలను పెంచడంతోపాటు అర్ధరాత్రి షోలకు అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ.. తారక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Tue, 24 Sep 202403:08 AM IST
Nindu Noorella Saavasam September 24th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో అరవింద్‌ను పట్టుకునేందుకు ప్లాన్ వేస్తాడు అమర్. ఇంటికెళ్లి భాగీని రెడీ అవ్వమని, బయటకు వెళ్తున్నామని చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న టెర్రరిస్ట్ అరవింద్ భాగీని చంపేందుకు ప్లాన్ వేస్తాడు.
Tue, 24 Sep 202402:52 AM IST
Gundeninda Gudigantalu Serial September 24th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో మీనాను పట్టుకుని పార్వతి ఇంటికి వెళ్తాడు బాలు. తాంబూలం ఇస్తూ రవితో సుమతి పెళ్లి మాట్లాడేందుకు వచ్చాను అని బాలు చెబుతుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్లో..
Tue, 24 Sep 202402:16 AM IST
- OTT Korean Thriller: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది ఓ కొరియన్ థ్రిల్లర్ మూవీ. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఆ ఏడాది కొరియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
Tue, 24 Sep 202401:51 AM IST
Karthika deepam 2 serial today september 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీకాంత్ తో స్వప్న పెళ్లి జరుగుతుందని కాశీ దీపకు చెప్తాడు. పెళ్లి ఆపేందుకు దీప సుమిత్రను ఉపయోగించుకుంటుంది. పెళ్లి మండపంలోకి శ్రీధర్ రాకుండా సుమిత్రను గుడి బయట కాపలాగా ఉంచుతుంది.
Tue, 24 Sep 202401:43 AM IST
Brahmamudi Serial September 24th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో కావ్య చేసిన వినాయకుడి విగ్రహం రాజ్ ఇంటికి చేరుతుంది. కావ్యను రమ్మని కాల్ చేయమని రాజ్‌కు చెబితే ఒప్పుకోడు. దాంతో కావ్య చీరను రాజ్ పక్కన పెట్టి పూజ జరిపిస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Tue, 24 Sep 202412:00 AM IST
Bigg Boss Telugu 8 Abhay Naveen Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 మూడోవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. బిగ్ బాస్ హౌజ్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అభయ్ నవీన్ ఊహించనివిధంగా ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్‌గా నిలిచాడు. మరి మూడు వారాలు హౌజ్‌లో ఉన్న అభయ్ ఎంత సంపాదించాడో చూస్తే..