Telugu Cinema News Live September 14, 2024: Bigg Boss 8 Telugu: యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగార్జున - పృథ్వీకి ఫైనల్ వార్నింగ్ - కొత్త చీఫ్‌గా అభయ్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 14 Sep 202405:25 PM IST
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో యష్మి, నైనికలకు నాగార్జున షాకిచ్చాడు. వారిద్దరి క్లాన్స్‌ను రద్దు చేశాడు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పృథ్వీ, సోనియాలకు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. శేఖర్ బాషాకు కొడుకుపుట్టాడంటూ నాగార్జున అతడికి గుడ్‌న్యూస్ వినిపించాడు.
Sat, 14 Sep 202404:01 PM IST
Re Release Movies: రెండు క్లాసిక్ లవ్‌స్టోరీ మూవీస్ ఒకే రోజు థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. సిద్ధార్థ్, జెనిలీయా జంటగా నటించిన బొమ్మరిల్లు సెప్టెంబర్ 21న రీ రిలీజ్ అవుతోంది. శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన జర్నీ మూవీ నెక్స్ట్ వీక్ థియేటర్లలోకి రాబోతోంది.
Sat, 14 Sep 202403:15 PM IST
Thagalaan OTT: విక్రమ్ తంగలాన్ మూవీ శనివారం ఓవర్‌సీస్ ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు.
Sat, 14 Sep 202402:11 PM IST
Telugu Action OTT: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన తిరగబడరా సామీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. త్వరలోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తిరగబడరా సామీ మూవీకి ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు.
Sat, 14 Sep 202412:22 PM IST
Thalapathy Vijay 69 Movie: దళపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించిన అపీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సయ్యాడు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో దళపతి విజయ్ 69వ మూవీని రిలీజ్ కానుంది.
Sat, 14 Sep 202411:42 AM IST
- Jr NTR: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడారు. దేవర సినిమా చూసే వరకు బతికించండి అంటూ ఆ అభిమాని చెప్పిన విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడికి ధైర్యం చెప్పేందుకు ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
Sat, 14 Sep 202411:34 AM IST
Raghava Lawrence: రాఘవ లారెన్స్ హీరోగా తన 25వ మూవీని శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాడు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్, రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Sat, 14 Sep 202409:58 AM IST
Comedy Movie: కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు తెలుగు మూవీ గుడ్‌లక్ గణేషా యూట్యూబ్‌లో శనివారం రిలీజైంది. ఈ ఫాంటసీ కామెడీ మూవీలో యోగిబాబుతో పాటు రమేష్ తిలక్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించాలు. తమిళంలో యానై ముగతాన్ పేరుతో గత ఏడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
Sat, 14 Sep 202409:20 AM IST
Priyanka Chopra In Bikini With Husband Nick Jonas: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బికినీల్లో హాట్ షో చేస్తూ దర్శనం ఇచ్చింది. భర్త నిక్ జోనాస్‌తో కలిసి వేకేషన్‌లో ఎంజాయ్ చేసింది. రెండు వేరు వేరు బికినీల్లో బోల్డ్‌గా కనిపించిన ప్రియాంక చోప్రా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Sat, 14 Sep 202409:09 AM IST
Raghu Thatha Review: కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించిన రఘు తాత మూవీ ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
Sat, 14 Sep 202408:55 AM IST
- Sector 36 OTT Streaming: సెక్టార్ 36 చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుటోంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తెలుగు డబ్బంగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
Sat, 14 Sep 202408:22 AM IST
Nunakuzhi OTT Streaming Record In Pre Subscription: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ క్రైమ్ కామెడీ సినిమా నునాకుజి రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్ స్టార్ మోహన్ లాల్ వెబ్ సిరీస్ మనోరథంగల్‌ను సైతం అధిగమించింది.
Sat, 14 Sep 202408:02 AM IST
- Mathu Vadalara 2 Day 1 Collections: మత్తువదలరా 2 చిత్రం మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. ఫుల్ క్రేజ్‍తో వచ్చిన చిత్రం అంచనాలను నిలుపుకుంటూ అదరగొట్టింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ మూవీ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఫస్ట్ డే వసూళ్లు ఎంత వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.
Sat, 14 Sep 202407:07 AM IST
Sandeep Reddy Vanga Interview With Devara Team: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ టీమ్‌తో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటరాక్షన్‌లో పాల్గొన్న తారక్, జాన్వీ, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివను సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
Sat, 14 Sep 202406:09 AM IST
OTT Movies To Release On Friday: ఓటీటీలో ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 16 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్నీ ఓటీటీ రిలీజ్ అయిన శుక్రవారం (సెప్టెంబర్ 13) నాడు ఫ్రైడే ఫెస్టివల్ జరిగినట్లు అయింది. ఈ పదహారింట్లో ఒక నాలుగు మినహాయిస్తే.. ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్‌గా ఉన్నాయి.
Sat, 14 Sep 202405:37 AM IST
- OTT Collections: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఓటీటీల్లోనూ కలెక్షన్ల లెక్కలను మొదలుపెట్టింది. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో దీన్ని ప్రారంభించింది. ఈ మూవీ నుంచి తొలి రోజు వచ్చిన గ్రాస్ లెక్కను వెల్లడించింది. ఆ వివరాలు ఇవే..
Sat, 14 Sep 202405:02 AM IST
Sobhita Dhulipala Love Sitara OTT Release: నాగ చైతన్యకు కాబోయే భార్య, లవర్ శోభితా ధూళిపాళ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ లవ్ సితార. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ మూవీపై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి లవ్ సితార ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
Sat, 14 Sep 202404:07 AM IST
- Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై మంచి హైప్ ఉంది. ఈ ఈవెంట్‍కు అతిథులుగా ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‍కు సూపర్ స్టార్ మహేశ్ బాబు అథితిగా వస్తారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇవే..
Sat, 14 Sep 202403:15 AM IST
- Parakramam OTT Streaming: పరాక్రమం సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బండి సరోజ్ కుమార్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వం చేసిన ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలను ఎక్కడ చూడొచ్చంటే..
Sat, 14 Sep 202402:58 AM IST
Gundeninda Gudigantalu Serial September 14th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో శ్రుతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఇంట్లో వాళ్లందరికి రవి చెబుతాడు. వాళ్ల ఫ్యామిలీ నాన్నకు గౌరవం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని బాలు అంటాడు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్లో..
Sat, 14 Sep 202402:19 AM IST
- Pawan Kalyan Question in KBC 16: కౌన్ బనేగా కరోడ్‍పతి 16లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వచ్చింది. కంటెస్టెంట్లను అమితాబ్ క్వశ్చన్ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sat, 14 Sep 202402:11 AM IST
- Karthika deepam 2 serial today september 14th episode:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ పొడిచిన కత్తి మీకు గుచ్చుకుంటే శౌర్యకు ఎవరున్నారని కార్తీక్ అంటాడు. నా బిడ్డను తల్లిలా చూసుకోవడానికి మీరున్నారు కదాని దీప అనేసరికి కార్తీక్ సంతోషిస్తాడు.
Sat, 14 Sep 202401:58 AM IST
Brahmamudi Serial September 14th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో అపర్ణ కోమా నుంచి కోలుకుంటుంది. కావ్య ఉద్యోగం కోసం బయటకు వెళ్తుంది. రాజ్, కావ్య బంధంపైనే అపర్ణ ప్రాణాలు ముడిపడి ఉన్నాయని ఇందిరాదేవి చెబుతుంది. ఇంటికి వచ్చిన అపర్ణ కావ్య గురించి రాజ్‌ను నిలదీస్తుంది.
Sat, 14 Sep 202401:28 AM IST
- OTT Malayalam Movies: ఈ వారం ఏకంగా నాలుగు మలయాళం సినిమాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. రెండు సినిమాలు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మలయాళం చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
Sat, 14 Sep 202412:39 AM IST
Bigg Boss Telugu 8 Prize Money: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఇప్పటివరకు సంపాదించుకున్న ప్రైజ్ మనీ ఎంతో బిగ్ బాస్ తెలిపాడు. అలాగే బిగ్ బాస్ 8 తెలుగులోకి కొత్తగా ఆరుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
Sat, 14 Sep 202412:30 AM IST
- NNS 14th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (సెప్టెంబర్ 14) ఎపిసోడ్లో భాగీలో అనుమానం మొదలవుతుంది. అటు అరుంధతి తాను ఎక్కడ దొరికిపోతానో అని భయపడగా.. రణ్‌వీర్ నంబర్ కావాలని మనోహరిని అడుగుతుంది అంజు.