Telugu Cinema News Live October 27, 2024: Bigg Boss Sunday Episode: బిగ్‌బాస్ గిఫ్ట్‌కు గంగవ్వ కన్నీళ్లు - కంటెస్టెంట్స్‌పై అనసూయ, హైపర్ ఆది పంచ్‌లు
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 27 Oct 202404:48 PM IST
Bigg Boss Sunday Episode: బిగ్బాస్ సండే ఎపిసోడ్‌లో లక్కీ భాస్కర్, అమరన్‌తో పాటు క మూవీ టీమ్‌లు సందడి చేశాయి. అనసూయ, హైపర్ ఆది కూడా గెస్ట్‌గా వచ్చింది. ఈ వీక్ బిగ్‌బాస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు.
Sun, 27 Oct 202402:52 PM IST
Naga Chaitanya: టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల మెడలో త్వరలో ఏడడుగులు వేయబోతున్నాడు నాగచైతన్య. శోభితలో పెళ్లి టైమ్ దగ్గరపడుతోన్న టైమ్‌లో నాగచైతన్య చేసిన ఓ పని హాట్ టాపిక్‌గా మారింది. విడాకుల ముందు సమంతతో కలిసి దిగిన చివరి ఫొటోనుఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశాడు.
Sun, 27 Oct 202401:59 PM IST
Anantham Teaser: అనంతం మూవీ టీజర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వెంకటశివకుమార్, రుచితా సాధినేని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. టాలీవుడ్ కమెడియన్ స్నిగ్ధ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తోంది.
Sun, 27 Oct 202401:08 PM IST
Kanguva Director: సూర్య కంగువ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్‌గా శివ కెరీర్ టాలీవుడ్‌లోనే మొదలైంది.
Sun, 27 Oct 202412:06 PM IST
Thriler OTT: దేవర్ విలన్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించి ఎక్స్‌పీరిమెంటల్ మలయాళం మూవీ ఆధిథట్టు థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Sun, 27 Oct 202410:34 AM IST
Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో రాజ్‌కు ఎలాగైనా ఆఫీస్‌కు వెళ్లేలా చేయాలని ఇందిరాదేవి, అపర్ణతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. కావ్యకు భయపడే నువ్వు ఆఫీస్‌కు వెళ్లడం లేదుకదా అని రాజ్‌ను రెచ్చగొడతారు. రాహుల్‌తో అతడిని పోల్చుతారు.
Sun, 27 Oct 202409:34 AM IST
Thalapathy Vijay: 18 ఏళ్ల వయసులో నాలైయతీర్పు మూవీతో కోలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి సోదరి ఎమ్.ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ అందించింది. కేవలం ఇరవై లక్షల బడ్జెట్‌తో రూపొందిన నాలైయతీర్పు డిజాస్టర్‌గా నిలిచింది.
Sun, 27 Oct 202409:06 AM IST
- Diwali Tollywood Updates: దీపావళి సందర్భంగా కొన్ని టాలీవుడ్ చిత్రాల నుంచి అప్‍డేట్లు రానున్నాయి. హరి హర వీరమల్లు చిత్రం నుంచి పాట విడుదల కానుంది. బాలయ్య కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ కూడా రెడీ అయింది. గేమ్ ఛేంజర్ టీజర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sun, 27 Oct 202408:48 AM IST
OTT Crime Thriller: కోలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రశాంత్ హీరోగా నటించిన అంధగాన్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజు ఓవర్‌సీస్‌లో ఆస్ట్రో టీవీలో అంధగాన్ మూవీ టెలికాస్ట్ కాబోతోంది.
Sun, 27 Oct 202408:07 AM IST
- Allu Arjun - David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. ఇన్‍స్టాగ్రామ్‍లో విషెస్ చెప్పారు. దీనికి వార్నర్ కూడా స్పందించారు.
Sun, 27 Oct 202406:49 AM IST
- Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍తో మూవీ చేయనున్నారు. ఈ చిత్రంపై నిర్మాత నాగవంశీ ఇప్పటికే హైప్ ఇచ్చారు. లక్కీ భాస్కర్ మూవీ ఈవెంట్‍కు త్రివిక్రమ్ నేడు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.
Sun, 27 Oct 202406:13 AM IST
- Bigg Boss 8 Telugu Today Episode Promo: బిగ్‍బాస్‍లో నేడు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. సినిమాల ప్రమోషన్ల కోసం కొందరు సినీ సెలెబ్రిటీలు వచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు ఉంటాయి. నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.
Sun, 27 Oct 202404:24 AM IST
- Demonte Colony 2 Horror Thriller Movie: డిమోంటి కాలనీ 2 చిత్రం తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈ సినిమా టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. పండుగ సందర్భంగా ఈ చిత్రం టీవీలోకి వస్తోంది.
Sun, 27 Oct 202403:40 AM IST
- Kaithi 2 Rolex: ఖైదీ 2 సినిమాలో రోలెక్స్ పాత్ర ఉంటుందా అనే ఉత్కంఠ మామూలుగా లేదు. ఈ విషయంపై కార్తి తాజాగా ఓ హింట్ ఇచ్చారు. కంగువ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయంపై కామెంట్ చేశారు.
Sun, 27 Oct 202402:22 AM IST
- Golam OTT Streaming: గోలం సినిమా ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మరో నాలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
Sun, 27 Oct 202401:31 AM IST
- OTT Trending Movies: కృతి సనన్ నటించిన థ్రిల్లర్ చిత్రం ఓటీటీలో ప్రస్తుతం టాప్‍కు దూసుకొచ్చింది. స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ఫస్ట్ ప్లేస్‍కు వచ్చింది. కార్తి సూపర్ హిట్ మూవీ కూడా నేషనల్ వైడ్‍లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
Sun, 27 Oct 202412:41 AM IST
- Suriya: కంగువ ప్రమోషన్లలో భాగంగా బిగ్‍బాస్ తెలుగు షోకు తమిళ స్టార్ హీరో సూర్య వచ్చారు. హోస్ట్ నాగార్జునతో మాట్లాడారు. తన తమ్ముడు కార్తిపై ఓ విషయంలో తనకు బాగా అసూయ ఉంటుందని సూర్య చెప్పారు.
Sun, 27 Oct 202412:30 AM IST
Bigg Boss Telugu 8 Mehaboob Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం అందింది. మరి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌజ్‌లో 3 వారాల పాటు ఉన్నాడు. కాబట్టి, 21 రోజుల్లో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా మెహబూబ్ ఎంత సంపాదించాడనే లెక్కల్లోకి వెళితే!