Telugu Cinema News Live October 21, 2024: Bigg Boss Telugu 8: నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటి: నిఖిల్‍ను నిలదీసిన రోహిణి.. పృథ్వితోనూ గొడవ.. నామినేషన్లలో వీళ్లే!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 21 Oct 202404:54 PM IST
- Bigg Boss Telugu 8 Nominations: బిగ్‍బాస్‍లో ఎనిమిదో వారం నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగింది. నిఖిల్, పృథ్విని రోహిణి నామినేట్ చేశారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది.
Mon, 21 Oct 202403:18 PM IST
- Lubber Pandhu OTT Release Date: లబ్బర్ పందు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. గల్లీ క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఏ ప్లాట్‍ఫామ్‍లో రానుందో ఇక్కడ చూడండి.
Mon, 21 Oct 202402:36 PM IST
- Pushpa 2 The Rule Pre-Release Business: పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏకంగా రూ.1000కోట్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. చాలా విషయాల్లో రికార్డులను సృష్టించింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇక్కడ చూడండి.
Mon, 21 Oct 202412:56 PM IST
- Little Hearts Telugu OTT Streaming Date: మలయాళ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ తెలుగు వెర్షన్ వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Mon, 21 Oct 202411:09 AM IST
- The Raja Saab Prabhas New Look: ది రాజా సాబ్ సినిమా నుంచి ప్రభాస్ కొత్త లుక్‍ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ కూల్ లుక్ అదిరిపోయింది. ప్రభాస్ పుట్టిన రోజున మరో సర్‌ప్రైజ్ రానుంది.
Mon, 21 Oct 202409:59 AM IST
- OTT Psychological Thriller: మిథ్య వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమ్ అవనుంది.
Mon, 21 Oct 202408:54 AM IST
- Do Patti OTT Streaming: ‘దో పత్తీ’ చిత్రం ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కాజోల్, కృతి సనన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీపై మంచి బజ్ ఉంది. ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా వివరాలివే..
Mon, 21 Oct 202408:31 AM IST
Bigg Boss Telugu 8 Nominations 8th Week: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ కూడా బీకరమైన ఫైట్స్‌తో సాగినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 21 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీ చూసిన విధానం కరెక్ట్ కాదంటూ తీవ్రమైన ఫైట్‌కు దిగింది జబర్దస్త్ రోహిణి.
Mon, 21 Oct 202407:59 AM IST
- OTT Prabhas Interview: ప్రభాస్ ఇంటర్వ్యూల్లో కనిపించడం చాలా అరుదు. ఎప్పుడో సినిమాల ప్రమోషన్లు ఉంటే గానీ అతడు బయటకు రాడు. కానీ ఇప్పుడు ఈటీవీలో అతడు ఓ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon, 21 Oct 202407:30 AM IST
Sai Pallavi Sivakarthikeyan Amaran Story In Telugu: సాయి పల్లవి రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇందు రెబెకా వర్గీస్‌గా నటిస్తున్న బయోపిక్ మూవీ అమరన్. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈ సినిమా మరో సీతా రామం కానుందా అనే వివరాల్లోకి వెళితే..
Mon, 21 Oct 202406:48 AM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ ఓ సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఇప్పుడు తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
Mon, 21 Oct 202405:57 AM IST
Ram Karthik About Veekshanam Movie Reviews: హీరో రామ్ కార్తీక్ తను నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వీక్షణంకు చాలా మంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయని చెప్పాడు. వీక్షణం థ్యాంక్స్ మీట్‌లో రామ్ కార్తీక్‌తోపాటు డైరెక్టర్ మనోజ్ పల్లేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Mon, 21 Oct 202405:10 AM IST
OTT Releases This Week Telugu: ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఈ వారం మొత్తంగా 24 వరకు డిజిటల్ స్ట్రీమింగ్ అవనున్నాయి. వాటిలో బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ 4, కృతి సనన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతోపాటు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. వాటి ఓటీటీ రిలీజ్‌పై లుక్కేస్తే..
Mon, 21 Oct 202405:09 AM IST
- Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ చేతుల్లో ఇండియా తొలి టెస్టులో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon, 21 Oct 202404:32 AM IST
- AR Rahman Oscars: ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఆస్కార్ గెలిచానని, అయితే ఇప్పుడెవరు పట్టించుకుంటున్నారని అతడు అనడం గమనార్హం. ది వీక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు వివిధ అంశాలపై స్పందించాడు.
Mon, 21 Oct 202403:32 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial October 21 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో భర్త వెళ్లమంటేనే వెళ్తాను అని మీనా చెబుతుంది. దాంతో ఫోన్‌లో బాలు మీనాను వెళ్లిపోమ్మని, ఇక ఇద్దరికి సంబంధం లేదని చెబుతాడు. దాంతో పుట్టింటికి మీనా వెళ్తుంది. మరోవైపు రవితో శోభనం ప్లాన్ చేస్తుంది శ్రుతి.
Mon, 21 Oct 202403:04 AM IST
- OTT Korean Drama: కొరియన్ డ్రామాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడు మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రెండు ఓటీటీల్లో ఒకేసారి తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ కొత్త సిరీస్ ఎక్కడ చూడాలంటే?
Mon, 21 Oct 202402:37 AM IST
Brahmamudi Serial October 21st Episode: బ్రహ్మముడి అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి అనామిక వచ్చి షాక్ ఇస్తుంది. కావ్య అగ్రిమెంట్ గురించి చెబుతుంది. దాంతో పేపర్స్ సరిగ్గా చదువుకోమ్మని రూ. 50 లక్షలు ఇస్తుంది అపర్ణ. అలాగే తనకు ఇచ్చిన రెండు కోట్లు తిరిగి ఇవ్వాలని కేసు పెడాతనని చెబుతుంది.
Mon, 21 Oct 202401:39 AM IST
- Karthika deepam 2 today october 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. తన మెడలో తాళి ఎందుకు కట్టారని దీప కార్తీక్ ని నిలదీస్తుంది. తాను శౌర్యకు తండ్రిగా మాత్రమే ఉంటానని కార్తీక్ దీపకు హామీ ఇస్తాడు. దీప సుమిత్రకు సమాధానం చెప్పుకోవాలని ఆ ఇంటికి వెళ్తుంది.
Mon, 21 Oct 202401:22 AM IST
Nindu Noorella Saavasam October 21st Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో అరుంధతి గురించి ఆలోచిస్తుంటుంది భాగీ. పక్కింటావిడా, అరుంధతి ఇద్దరూ ఒక్కటేనా కాదా అని తెలియాలంటే ఫొటో చూడాలని అనుకుంటుంది భాగమతి. మరోవైపు ఆరు ఆత్మతో ఘోరా క్షుద్ర పూజలు చేస్తుంటాడు.
Mon, 21 Oct 202401:00 AM IST
Bigg Boss Telugu 8 Naga Manikanta Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఏడో వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. హెల్త్ సపోర్ట్ చేయట్లేదంటూ తనకు తానే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు నాగ మణికంఠ. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగులో 7 వారాల్లో నాగ మణికంఠ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.