Telugu Cinema News Live November 9, 2024: Netflix Nayanthara: నయనతార ‘బియాండ్ ది ఫెయిరీటేల్’ ట్రైలర్ విడుదల.. అంచనాల్ని పెంచేసిన లేడీ సూపర్ స్టార్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 09 Nov 202404:15 PM IST
Nayanthara documentary: రెండేళ్లుగా నయనతార అభిమానుల్ని ఊరిస్తూ వస్తున్న డాక్యుమెంటరీ రిలీజ్‌పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. శనివారం రిలీజైన ట్రైలర్.. ఈ డాక్యుమెంటరీపై అంచనాల్ని మరింత పెంచింది.
Sat, 09 Nov 202403:42 PM IST
Icon Star Allu Arjun: పుష్ప-2 ప్రమోషన్ ఈవెంట్స్‌ను దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నిర్వహించేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ.. ఏపీలో మాత్రం ఎలాంటి ఈవెంట్ ఉండటం లేదు.
Sat, 09 Nov 202402:31 PM IST
Ram Charan On Director Shankar: లక్నోలో ఈరోజు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. కానీ.. డైరెక్టర్ శంకర్ మాత్రం ఈ ఈవెంట్‌కి వెళ్లలేకపోయాడు. దానికి కారణం చెప్పిన రామ్ చరణ్.. డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు.
Sat, 09 Nov 202402:03 PM IST
Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకి వెంట వెంటనే సమాధానం చెప్పిన సూర్య.. ఒక ప్రశ్నకి మాత్రం సిగ్గుపడిపోతూ సమాధానం దాటవేశారు. దాంతో బాలయ్య తెలివిగా కార్తీకి ఫోన్ చేసి సమాధానం రాబట్టేశారు.
Sat, 09 Nov 202412:57 PM IST
Ram Charan Game Changer: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది. కొత్త మేనరిజం, డైలాగ్ డెలివరీతో రామ్ చరణ్ సినిమాపై అంచనాల్ని పెంచేశాడు.
Sat, 09 Nov 202412:11 PM IST
పుష్ప-2 రిలీజ్ ముంగిట ఆ సినిమా సెట్స్ నుంచి ఒక ఫొటో లీక్ అయ్యింది. శ్రీలీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుండగా.. సెట్స్‌లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటో బయటికి వచ్చింది.
Sat, 09 Nov 202411:35 AM IST
Game Changer teaser: గేమ్ ఛేంజర్ టీజర్‌ను ఈరోజు సాయంత్రం రాబోతుండగా.. ఈ టీజర్‌ను లాంచ్ చేయడానికి హైదరాబాద్ నుంచి లక్నోకి రామ్ చరణ్ వెళ్లారు.
Sat, 09 Nov 202410:30 AM IST
Sivakarthikeyan gift: అమరన్ మూవీని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తన మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. మరీ ముఖ్యంగా.. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ సీన్స్‌లో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు.
Sat, 09 Nov 202409:21 AM IST
Bigg Boss Elimination: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పృథ్వీతో పాటు గంగవ్వ బిగ్‌బాస్ హౌజ్‌ను వీడనున్నట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ కానున్నట్లు చెబుతోన్నారు.
Sat, 09 Nov 202408:10 AM IST
కన్నప్ప మూవీ నుంచి వర్కింగ్ స్టిల్ లీకయినట్లు సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు తెలిపాడు. ఈ లీక్ చేసిన వారిని పట్టిస్తే ఐదు లక్షలు బహుమానంగా అందజేస్తామని చెప్పాడు. లీకు దొంగపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్లు వెల్లడించాడు.
Sat, 09 Nov 202407:33 AM IST
Sci fi Thriller OTT: ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హాప్ హాప్ తమిళ హీరోగా నటించిన తమిళ మూవీ కడైసి ఉతళ పోర్ తెలుగు లాస్ట్ వరల్డ్ వార్ పేరుతో రిలీజైంది. డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ హిప్ హాప్ తమిళనే కావడం గమనార్హం.
Sat, 09 Nov 202406:05 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు లేటెస్ట్ ప్రోమోలో రోహిణిని డబ్బుల కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే రోహిణినే కళ్యాణి అనే నిజం బయటపెడతానని బెదిరిస్తాడు. వారి మాటల్ని మీనా వింటుంది. మీనాకు నిజం తెలియడంతో రోహిణి షాకవుతుంది.
Sat, 09 Nov 202405:01 AM IST
Adi Parvam Review: మంచు లక్ష్మి, ఆదిత్యం ప్రధాన పాత్రల్లో నటించిన ఆది పర్వం మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించాడు.
Sat, 09 Nov 202403:40 AM IST
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి బర్త్‌డే సందర్భంగా గీతా శంకరం మూవీ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మట్టిబుర్ర అంటూ సాగిన ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. గేమ్ ఛేంజర్ ఫేమ్ సునిధి చౌహాన్ ఈ పాటను అలపించింది.
Sat, 09 Nov 202402:51 AM IST
Brahmamudi November 9th Episode: బ్రహ్మముడి నవంబర్ 9 ఎపిసోడ్‌లో బతుకుతెరువు కోసం కళ్యాణ్ ఆటోనడుపుతోన్న వీడియోను చూపించి దుగ్గిరాల ఇంట్లో గొడవలు సృష్టిస్తుంది రుద్రాణి. అప్పు వల్లే తన కొడుకు కష్టాలు పడుతున్నావని ధాన్యలక్ష్మి రచ్చచేస్తుంది.
Sat, 09 Nov 202401:40 AM IST
- Karthika deepam 2 today november 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కూతురి కోరిక మేరకు రిసెప్షన్ చేసుకునేందుకు దీప ఒప్పుకుంటుంది. అందంగా రెడీ అయిన దీపను చూసి కార్తీక్ ఫిదా అయిపోతాడు. అటు రిసెప్షన్ లో దీప పరువు తీయాలని జ్యోత్స్న, పారిజాతం, శ్రీధర్ రెడీ అయిపోతారు.
Sat, 09 Nov 202401:27 AM IST
Bigg Boss Nabeel: శుక్రవారం బిగ్‌బాస్ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇంటి సభ్యుల గొడవలు, వాదనలతో సాగింది. చివరకు ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ నబీల్‌కు దక్కింది. ప్రేరణ కోసం నిఖిల్ త్యాగానికి సిద్ధపడగా...గౌతమ్ అతడిపై సెటర్లు వేశాడు.
Sat, 09 Nov 202412:30 AM IST
- NNS 9th November Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (నవంబర్ 9) ఎపిసోడ్లో మనోహరి అడ్డంగా దొరికిపోతుంది. దీంతో ఆమెను కలకత్తా వెళ్లిపొమ్మని అమర్ చెబుతాడు. అటు భాగీని మంగళ హేళనగా మాట్లాడుతుంది.