Telugu Cinema News Live November 6, 2024: Citadel Honey Bunny: సెలెబ్రిటీల కోసం ముంబయిలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ షో ప్రివ్యూ.. ఇన్‌స్టాలో సెలెబ్రిటీలు రివ్యూస్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 06 Nov 202404:03 PM IST
Citadel Honey Bunny reviews: సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కానుంది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్‌కి ముందు ముంబయిలో సెలెబ్రిటీలకి ప్రీమియర్ షో వేశారు.
Wed, 06 Nov 202402:39 PM IST
US Election Results 2024: సినిమాల్లో క్యామియో రోల్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్.. రియాలిటీ షోస్‌కి హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. అప్పట్లో ఒక్కో ఎపిసోడ్‌కి ట్రంప్ ఎంత ఛార్జ్ చేసేవారంటే?
Wed, 06 Nov 202412:31 PM IST
Sivakarthikeyan: తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ మౌత్ టాక్‌తో అమరన్ మూవీ థియేటర్లలో దూసుకెళ్తోంది. క, లక్కీ భాస్కర్ నుంచి పోటీ ఉన్నా.. ఇప్పటికే ఆరు రోజుల్లో ఓవరాల్‌గా రూ.155 కోట్లని వసూలు చేసింది.
Wed, 06 Nov 202410:46 AM IST
- Mahesh Babu Teja Sajja: తేజ సజ్జపై మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐఫా ఉత్సవం అవార్డుల సెర్మనీలో రానా దగ్గుబాటితో కలిసి అతడు గుంటూరు కారం మూవీపై చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు.
Wed, 06 Nov 202410:43 AM IST
Dil Raju About Game Changer Release In Tamil: విజయ్ వారిసు సినిమా తర్వాత తమిళంలో ఇంకా సినిమాలు చేయాలని ఉందని నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళంలో రామ్ చరణ్ గేమ్ చరణ్ మూవీ రిలీజ్‌పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఇతర విశేషాలు పంచుకున్నారు.
Wed, 06 Nov 202410:22 AM IST
Pushpa 2 The Rule release date: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరులో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ముంగిట ఐకాన్ స్టార్‌కి భారీ ఊరట లభించింది.
Wed, 06 Nov 202410:16 AM IST
- NNS 7th November Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (నవంబర్ 7) ఎపిసోడ్లో భాగీని ఇంట్లో నుంచి పంపించేస్తాడు శివరాం. అది చూసి మనోహరి ఎగిరి గంతేయగా.. ఇటు భాగీ, అటు ఆరు ఎంతో బాధపడుతుంటారు.
Wed, 06 Nov 202409:49 AM IST
- Brahmamudi Serial Time: బ్రహ్మముడి సీరియల్ టైమ్ మారిపోయింది. నవంబర్ 12 నుంచి స్టార్ మాలో సరికొత్త సీరియల్ రానుండటంతో ఈ టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్ నుంచి ప్రైమ్ టైమ్ నుంచి తప్పించడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
Wed, 06 Nov 202409:23 AM IST
Do You See What I See OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ డూ యూ సీ వాట్ ఐ సీ. గత కొన్ని రోజులుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ సినిమాలో కోరిన కోరికలను దెయ్యాలు తీర్చే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. మరి ఈ హారర్ మూవీ డూ యూ సీ వాట్ ఐ సీ ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.
Wed, 06 Nov 202409:13 AM IST
Mr Bachchan Cinema Troll: రానా సాధారణంగా వివాదాలకి దూరంగా ఉంటాడు. కానీ.. ఐఫా-2024 వేడుకల్లో చాలా మంది హీరోల సినిమాలపై సరదాగా ట్రోల్ చేసిన రానా.. ఒక్కసారిగా వివాదంలో ఇరుక్కున్నాడు.
Wed, 06 Nov 202408:14 AM IST
- Rajkumar Periasamy About Sai Pallavi Anugraham: సాయి పల్లవి సినిమా ఒప్పుకుంటే దేవత అనుగ్రహం పొందినట్లే అని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమరన్ మూవీ రిలీజ్ కంటే ముందు హైదారబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి పల్లవిపై డైరెక్టర్ ఇలా కామెంట్స్ చేశారు.
Wed, 06 Nov 202408:10 AM IST
- OTT Telugu Mystery Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులో మరో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ కు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బుధవారం (నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
Wed, 06 Nov 202407:25 AM IST
Erracheera The Beginning Glimpse Release Event: తెలుగులో హారర్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఎర్రచీర. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించింది. సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించిన ఎర్రచీర గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Wed, 06 Nov 202407:09 AM IST
- OTT Thriller Movie: ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. భార్యను చంపి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే ఓ తెలివైన గుమాస్తా చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మంచి సక్సెస్ సాధించింది.
Wed, 06 Nov 202406:18 AM IST
- Sai Pallavi Ramayana: సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్న రామాయణ మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతేకాదు రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్లను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
Wed, 06 Nov 202406:08 AM IST
OTT Release Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 26 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ, ఫాంటసీ, యాక్షన్, కామెడీ సినిమాలు, వెబ్ సిరీసులు మరింత స్పెషల్‌గా 8 ఉన్నాయి. అలాగే, ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
Wed, 06 Nov 202405:38 AM IST
- Rana on Samantha: సమంతపై జోకులు వేశాడు రానా దగ్గుబాటి. ఒకప్పుడు మరదలుగా ఉన్న సామ్ చెల్లెలు అయిందని అతడు అన్నాడు. ఐఫా అవార్డుల వేడుకలో రానా వేసిన జోక్స్ కు సమంత కూడా కాస్త గట్టిగానే పంచ్ ఇచ్చింది.
Wed, 06 Nov 202404:50 AM IST
Rajkumar Periasamy About Kamal Haasan Emotional: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన మూవీ అమరన్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
Wed, 06 Nov 202403:35 AM IST
- OTT Korean Web Series: ఒకే రోజు రెండేసి ఓటీటీల్లోకి రెండు కొరియన్ వెబ్ సిరీస్ వచ్చాయి. అందులో ఒకటి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కాగా.. మరొకటి రొమాంటిక్ కామెడీ జానర్ కావడం విశేషం.
Wed, 06 Nov 202403:34 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial November 6 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 6 ఎపిసోడ్‌లో మీనా హాస్పిటల్‌కు వచ్చి తాయత్తు కట్టిన విషయం చెబుతాడు సత్యం. తర్వాత మీనా ఇంటికి వస్తేనే ట్యాబ్లెట్స్ వేసుకుంటానని మొండిపట్టు పడతాడు సత్యం. దాంతో మీనాను ఇంటికి తీసుకొస్తాడు బాలు.
Wed, 06 Nov 202402:48 AM IST
- OTT Friday Releases: ఓటీటీలోకి ఒకే రోజు మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన ఈ సినిమాలు అన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండగా.. ఇవి బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.800 కోట్లు వసూలు చేశాయి.
Wed, 06 Nov 202402:17 AM IST
- Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ భర్త, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తమ 17 ఏళ్ల వివాహ బంధానికి విడాకులతో తెర దించబోతున్నారని పుకార్లు వస్తున్న విషయం తెలుసు కదా. వీటికి కారణమైన నటి నిమ్రత్ కౌర్ తమ రిలేషన్షిప్ పై స్పందించింది.
Wed, 06 Nov 202402:13 AM IST
Brahmamudi Serial November 6th Episode: బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్‌లో దీపావళి రోజున కావ్యతో జరిగిన సన్నివేశాలను ఊహించుకుంటాడు రాజ్. ఇంతలో కావ్య నిజంగా రావడం చూసి షాక్ అవుతాడు రాజ్. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో ఆటో బాంబ్ పేల్చడానికి రెడీ చేస్తుంటారు రుద్రాణి, అనామిక.
Wed, 06 Nov 202401:39 AM IST
- Karthika deepam 2 serial today november 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ ని రిసెప్షన్ కు రావాలని స్వప్న పిలుస్తుంది. తాను రానని అంటే తీసుకొస్తానని కావేరి మాట ఇస్తుంది. తండ్రీ కూతుర్ల మధ్య కాసేపు తిట్ల పురాణం జరుగుతుంది.
Wed, 06 Nov 202401:09 AM IST
Nindu Noorella Saavasam November 6th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 6 ఎపిసోడ్‌లో భాగమతిని అమర్ కొట్టబోయి ఆగుతాడు. అరుంధతి చీరను కర్టెన్‌గా కట్టడంపై ఫైర్ అవుతాడు. తర్వాత మనోహరి వచ్చి నువ్ బయటకు వెళ్లే సమయం వచ్చిందని సంతోషంగా చెబుతుంది మనోహరి. గుప్తాతో మనోహరిపై కోపంగా మాట్లాడుతుంది ఆరు.
Wed, 06 Nov 202412:38 AM IST
Bigg Boss Telugu 8 Tenth Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో గౌతమ్ కృష్ణ టాప్‌లో దుమ్ములేపుతున్నాడు. విన్నర్ మెటీరియల్‌గా వచ్చిన నిఖిల్‌ను పక్కకు నెట్టేసి మరి మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక డేంజర్ జోన్‌లో విష్ణుప్రియ ఉంది.