Telugu Cinema News Live November 15, 2024: Kubera Glimpse: ధనుష్, నాగార్జున, రష్మిక కుబేర గ్లింప్స్ రిలీజ్.. మహేష్ బాబు చేతుల మీదుగా..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 15 Nov 202402:33 PM IST
- Kubera Glimpse: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, డైరెక్టర్ శేఖర్ కమ్ములలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న కుబేర మూవీ గ్లింప్స్ వీడియో శుక్రవారం (నవంబర్ 15) రిలీజైంది. మహేష్ బాబు ఈ గ్లింప్స్ రిలీజ్ చేయడం విశేషం.
Fri, 15 Nov 202412:47 PM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి ఏకంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా వస్తుండటం విశేషం. ఈ హాలీవుడ్ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
Fri, 15 Nov 202410:49 AM IST
- Allu Arjun: అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ను యానిమల్ మూవీ రణ్‌బీర్ కపూర్ తో పోల్చడం విశేషం. తనను చాలా ప్రేమిస్తాడని, అయితే ఏమాత్రం తేడా వచ్చినా ఇక ఊరుకోడంటూ బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Fri, 15 Nov 202410:06 AM IST
- NNS 15th November Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (నవంబర్ 15) ఎపిసోడ్లో ఆరుని తీసుకెళ్లడానికి యముడు సిద్ధపడతాడు. అటు భాగీని తీసుకు వెళ్లడానికి అమర్, పిల్లలు వెళ్లగా.. అల్లుడిపై రామ్మూర్తి అలుగుతాడు.
Fri, 15 Nov 202409:46 AM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. బ్రహ్మముడే టాప్ లో ఉన్నా.. ఇదే చివరి వారం కావచ్చని కొందరు కామెంట్స్ చేయడం విశేషం. ఈ సీరియల్ టైమ్ మారిపోయిన విషయం తెలిసిందే.
Fri, 15 Nov 202409:05 AM IST
Amaran OTT: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్ ఓటీటీలోకి వచ్చింది. ఓవర్‌సీస్ ఓటీటీ ఐంథుసన్‌లో రిలీజైంది. ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు మరో పదిహేను రోజుల తర్వాతే ఈ మూవీ రానున్నట్లు సమాచారం.
Fri, 15 Nov 202408:53 AM IST
- Today OTT Releases: ఓటీటీలో ఈరోజు అంటే శుక్రవారం (నవంబర్ 15) ఒక్క రోజే సినిమాలు, వెబ్ సిరీస్ ఎన్నో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళంలాంటి భాషల్లో కంటెంట్ రావడం విశేషం.
Fri, 15 Nov 202408:18 AM IST
OTT: రానా దగ్గుబాటి త్వరలో ఓ టాక్ షోతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ది రానా దగ్గుబాటి షో టైటిల్‌తో రాబోతున్న ఈ షో నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ టాక్ షో ప్రోమోను శుక్రవారం రిలీజ్ చేశారు.
Fri, 15 Nov 202408:08 AM IST
- OTT Crime Thriller: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ సూపర్ హిట్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. శుక్రవారం (నవంబర్ 15) నుంచి ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Fri, 15 Nov 202406:46 AM IST
Kanguva Day 1 Collections: సూర్య కంగువ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తెలుగు వెర్షన్ ఆరు కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం. హిందీలో మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మలయాళం, కన్నడ భాషల్లో పూర్తిగా డిసపాయింట్ చేసింది.
Fri, 15 Nov 202405:50 AM IST
Balakrishna: బాలకృష్ణ 109వ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలు, ఎలివేషన్స్‌తో డాకు మహారాజ్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ను సంక్రాంతి జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Fri, 15 Nov 202405:05 AM IST
Suspense Thriller OTT: మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కురుక్కు శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Fri, 15 Nov 202403:25 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 15 ఎపిసోడ్‌లో మీనాను పెళ్లిచేసుకున్న రోజు నుంచే తన జీవితం ముళ్లబాట అయిపోయిందని, మనశ్శాంతి, ఆనందం కరువయ్యాయని బాలు అంటాడు. మీనాను ఆమె తల్లి ముందే అవమానిస్తాడు. భర్త మాటలతో మీనా బాధపడుతుంది.
Fri, 15 Nov 202401:58 AM IST
Brahmamudi :బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్‌లో కావ్య కంపెనీకి దక్కిన కాంట్రాక్ట్‌ను ఎలాగైనా చెడగొట్టేయాలని ఫిక్సవుతుంది అనామిక. రాజ్, కావ్య గొడవలు పడి విడిపోయారని, ఈ గొడవల వల్లే రాజ్‌ను సీఈవో పదవి నుంచి తీశారనని కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని కలిసి బురిడీ కొట్టిస్తుంది అనామిక.
Fri, 15 Nov 202401:49 AM IST
- Karthika deepam 2 serial today november 15th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 15వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పారిజాతం కార్తీక్ ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంది. కాంచన, దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో కార్తీక్ పారుకు గట్టిగా బుద్ధి చెప్తాడు.
Fri, 15 Nov 202412:52 AM IST
Bigg Boss: బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా విష్ణుప్రియ తండ్రితో పాటు పృథ్వీ తల్లి హౌజ్‌లోకి అడుగుపెట్టారు.పృథ్వీతో లవ్‌స్టోరీ స్ట్రాటజీనే అయినా అందరూనిజమని అనుకుంటున్నారని విష్ణుప్రియతో ఆమె తండ్రి అన్నాడు. పృథ్వీ తన పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుందని తండ్రికి విష్ణుప్రియ బదులిచ్చింది.