Telugu Cinema News Live November 11, 2024: OTT Thriller Movie: మైండ్ బ్లాక్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. మాలీవుడ్‌ని వసూళ్లతో షేక్ చేసి మూవీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 11 Nov 202404:05 PM IST
Kishkindha Kaandam OTT: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారు కిష్కింద కాండం సినిమాను బాగా ఎంజాయ్ చేయవచ్చు. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?
Mon, 11 Nov 202403:02 PM IST
Pushpa 2 Kissik song: పుష్ప-1లో ఐటెం సాంగ్ కోసం అప్పట్లో ఆ సినిమాలోని హీరోయిన్ రష్మిక మంధనా కంటే ఎక్కువ పారితోషికాన్ని సమంత తీసుకోగా.. ఇప్పుడు పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల కూడా భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Mon, 11 Nov 202401:55 PM IST
Director Krish Marriage: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ల క్రితం ఒక డాక్టర్‌ని వివాహం చేసుకున్న క్రిష్.. రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో డాక్టర్‌ని క్రిష్ పెళ్లి చేసుకోవడం గమనార్హం.
Mon, 11 Nov 202401:28 PM IST
Sunny Leone Movie in OTT: పేట్టా రాప్ మూవీ ఎట్టకేలకి పలు వాయిదాల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ప్రభుదేవా, వేదికతో పాటు సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
Mon, 11 Nov 202412:05 PM IST
Pushpa 2 Trailer release date: పుష్ప టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమా రిలీజ్‌కి రెండు వారాల ముందు ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏడు నగరాల్లో ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తుండగా.. ఫస్ట్ ఈవెంట్‌లోనే ట్రైలర్ రిలీజ్ చేయనుంది.
Mon, 11 Nov 202411:21 AM IST
Naomi Scott In SSMB29: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్‌ను తీసుకున్న రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా కోసం మరో బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
Mon, 11 Nov 202410:39 AM IST
- Romantic Comedy OTT: ఓటీటీలోకి ఓ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా.. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది.
Mon, 11 Nov 202410:10 AM IST
- Allu Arjun Fans: అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఓ యూట్యూబ్ ఛానెల్ పై వాళ్లు దాడి చేసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. తమ అభిమాన హీరోపై పదే పదే నెగటివ్ వార్తలు ఇవ్వడంతో అభిమానులు అసహనంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది.
Mon, 11 Nov 202409:40 AM IST
Vijay Deverakonda: బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధిక మదన్‌తో కలిసి విజయ్ దేవరకొండ నటించిన సాహిబా మ్యూజిక్ వీడియో సాంగ్ ప్రొమో వచ్చేసింది.
Mon, 11 Nov 202409:38 AM IST
- Nuvvu Nenu Prema Serial: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన నువ్వు నేను ప్రేమ ఇవాళ్టి (నవంబర్ 11)తో ముగిసింది. ఏకంగా 777 ఎపిసోడ్ల పాటు సాగిన ఈ మెగా సీరియల్ ఆ ఛానెల్లోని టాప్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగింది.
Mon, 11 Nov 202409:32 AM IST
Deadpool And Wolverine OTT Streaming: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ. 11 వేల కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ డెడ్‌పూల్ 4 ఏ ఓటీటీలో రిలీజ్ కానుందనే ఇక్కడ చూద్దాం.
Mon, 11 Nov 202408:52 AM IST
Matka Director Karuna Kumar About Vizag: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ కరుణ కుమార్ వైజాగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, మట్కాలోని ఓ సీన్ హైలెట్ అని తెలిపారు.
Mon, 11 Nov 202407:41 AM IST
- OTT Family Drama: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా వచ్చేస్తోంది. సుధీర్ బాబు నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.
Mon, 11 Nov 202407:30 AM IST
OTT Release Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 9 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, వీటిన్నంటిలో చూసేందుకు నాలుగు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అవన్నీ కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దాం.
Mon, 11 Nov 202407:12 AM IST
- Kamal Haasan: కమల్ హాసన్ తన అభిమానులకు ఇప్పుడో స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. సోమవారం (నవంబర్ 11) అభిమానులకు రాసిన లేఖను అతడు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. తనను లోక నాయకుడు అని పలవొద్దని అతడు కోరడం విశేషం.
Mon, 11 Nov 202406:35 AM IST
- OTT Romantic Comedy: ఓ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలిపోయినా.. ఓటీటీలో మాత్రం కొన్ని వారాలుగా టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా పేరు భలే ఉన్నాడే.
Mon, 11 Nov 202406:15 AM IST
Sumanth Prabhas New Movie Launch Ceremony: మేము ఫేమస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ప్రభాస్ కొత్త సినిమాతో రానున్నాడు. సుమంత్ ప్రభాస్ కొత్త సినిమా లాంచ్ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్‌తో రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని సుమంత్ ప్రభాస్ చెప్పాడు.
Mon, 11 Nov 202405:44 AM IST
- Brahmamudi Serial: స్టార్ మా టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడి టైమ్ రేపటి నుంచి మారిపోనుంది. ఇన్నాళ్లూ రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ ఇక నుంచి మధ్యాహ్నం రానుంది.
Mon, 11 Nov 202405:19 AM IST
Varun Tej Comments On Ram Charan In Matka Pre Release Event: మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి గొప్పగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నీకు సపోర్ట్ ఇచ్చినవాళ్లను మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదని వరుణ్ తేజ్ అన్నాడు.
Mon, 11 Nov 202404:28 AM IST
- Kushi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోదరి, నటి ఖుషీ కపూర్ తన రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేసినట్లే కనిపిస్తోంది. నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడామె ఫొటో వైరల్ అవుతోంది.
Mon, 11 Nov 202403:22 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial November 11 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 11 ఎపిసోడ్‌లో కొరియర్ బాయ్ వేశంలో రోహిణి బాయ్ ఫ్రెండ్ దినేష్ వర్దన్ వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తాడు. తను కల్యాణి అనే రహస్యం తన దగ్గర ఉందని 50 వేలు అడుగుతాడు. ఆ డబ్బును మనోజ్‌ను అడుగుతుంది రోహిణి.
Mon, 11 Nov 202402:33 AM IST
- OTT Comedy Movie: ఓటీటీలో సుహాస్ నటించిన కామెడీ మూవీ దుమ్ము రేపుతోంది. డిజిటల్ ప్రీమియర్ కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్లకుపైగా స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఇంతకీ మీరు ఈ మూవీ చూశారా లేదా?
Mon, 11 Nov 202402:08 AM IST
Brahmamudi Serial November 11th Episode: బ్రహ్మముడి నవంబర్ 11 ఎపిసోడ్‌లో కల్యాణ్ చీదరించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వారికి పంచాలని ధాన్యలక్ష్మీ పెద్ద రాద్దాంతం చేస్తుంది. దానికి రుద్రాణి సపోర్ట్ చేస్తుంది. దాంతో ఆస్తి పంపకాలకు టైమ్ ఇవ్వమని సీతారామయ్య అంటాడు.
Mon, 11 Nov 202401:43 AM IST
- Karthika deepam november 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప రిసెప్షన్ కు జ్యోత్స్న పారిజాతం వస్తారు. కార్తీక్ మంచితనం గురించి ఏవీ ప్లే చేయాలని కాశీ వాళ్ళు రెడీ చేస్తారు. కానీ జ్యోత్స్న అందరిలో కార్తీక్ పరువు తీసేస్తుంది.
Mon, 11 Nov 202401:11 AM IST
Nindu Noorella Saavasam November 10th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 11 ఎపిసోడ్‌లో ఇంట్లో టిఫిన్స్ చూసి బాగా లేదని పిల్లలు సెటైర్లు వేస్తారు. స్కూల్‌కు వెళ్లేదారిలో బయట టిఫిన్ చేయాలని అనుకుంటారు. తర్వాత భాగీని ఇంటికి తీసుకొచ్చేందుకు అమర్ ఒప్పుకుంటాడు. అది విని కిందపడిపోతుంది మనోహరి.
Mon, 11 Nov 202412:48 AM IST
Bigg Boss Telugu 8 Hari Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం డబుల్ ఎలిమినేషన్ అయింది. ఊహించని విధంగా అనారోగ్య కారణాలతో గంగవ్వ ఎలిమినేట్ అయితే.. అతి తక్కువ ప్రేక్షకుల ఓట్లతో హరితేజ ఎలిమినేట్ అయింది. మరి వైల్డ్ కార్డ్‌గా వచ్చిన హరితేజ బిగ్ బాస్ 8 తెలుగులో 5 వారాల సంపాదన ఎంతో చూద్దాం.