Telugu Cinema News Live January 9, 2025: Game Changer: గేమ్ ఛేంజింగ్ డే అంటూ రామ్ చరణ్ చేసిన పోస్ట్ వైరల్.. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 09 Jan 202504:50 PM IST
- Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు కొన్ని గంటల ముందు రామ్ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజింగ్ డే కాబోతోందంటూ చెర్రీ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా శుక్రవారం (జనవరి 10) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Thu, 09 Jan 202504:07 PM IST
- Zee Telugu Sankranthi: జీ తెలుగులో మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తోపాటు ఇతర పండుగ ప్రత్యేక షోలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూడండి.
Thu, 09 Jan 202502:48 PM IST
- OTT Comedy Mystery Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళం బ్లాక్‌బస్టర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ పేరు సూక్ష్మదర్శిని. గతేడాది నవంబర్ లో రిలీజైన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతోంది.
Thu, 09 Jan 202511:20 AM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. 53వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో టాప్ 6లో ఎలాంటి మార్పులు లేవు. అయితే కొత్త సీరియల్ మాత్రం క్రమంగా రేటింగ్స్ లో మెరుగవుతోంది.
Thu, 09 Jan 202510:26 AM IST
- Bachchala Malli OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా బచ్చల మల్లి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ కన్ఫమ్ చేసింది.
Thu, 09 Jan 202510:21 AM IST
Apsara Rani: హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ విలన్‌గా కనిపించబోతున్నాడు. రాచరిక మూవీలో నెగెటివ్ క్యారెక్టర్ చేశాడు. అప్సర రాణి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న రిలీజ్ కాబోతోంది. రాచరికం మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశాడు.
Thu, 09 Jan 202509:21 AM IST
- OTT Crime Thriller Movie: ఓటీటీలోకి మాధవన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. గతేడాది నవంబర్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ఈ మూవీని థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్రీమియర్ చేయాలని నిర్ణయించడం విశేషం.
Thu, 09 Jan 202508:29 AM IST
- Allu Arjun New Look: అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించాడు. ఐదేళ్ల పాటు పుష్ప కోసం భారీ గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసిన అతడు.. మొత్తానికి ఇప్పుడు స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
Thu, 09 Jan 202508:21 AM IST
- Rajamouli To Bobby Deol Who Depended On Wife Income: సినిమాలతో కోట్లల్లో సంపాందించే సెలబ్రిటీలు కూడా ఒకప్పుడు వారి భార్యల సంపాదన మీద బతికిన పరిస్థితులు ఉన్నాయి. వారిలో దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఉండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి అలా తమ భార్యల డబ్బుపై బతికిన సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
Thu, 09 Jan 202507:30 AM IST
Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఈ సంక్రాంతికి తెలుగులో హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకోబోతున్నది ఐశ్వర్య రాజేష్. ఆమె కెరీర్‌లో బిగ్ బడ్జెట్ తెలుగు మూవీగా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతోంది. ఐశ్వర్య రాజేష్ తాతతో పాటు ఆమె తండ్రి కూడా తెలుగులో పలు సినిమాలు చేశారు.
Thu, 09 Jan 202507:08 AM IST
- Nidhhi Agerwal Complaint To Cyber Crime Over Threatening: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ సినిమా హరి హర వీరమల్లులో హీరోయిన్ నిధి అగర్వాల్. తాజాగా తనను చంపుతానంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నిధి అగర్వాల్.
Thu, 09 Jan 202505:22 AM IST
- 1000 Words Director Ramana Villart About Renu Desai: అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ దివి నటించిన లేటెస్ట్ మూవీ 1000 వర్డ్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రమణ విల్లర్ట్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇటీవల జరిగిన 1000 వర్డ్స్ స్పెషల్ షో సందర్భంగా డైరెక్టర్ రమణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Thu, 09 Jan 202504:49 AM IST
Romantic Tragedy: మలయాళం రొమాంటిక్ ట్రాజెడీ మూవీ కల్బ్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఐదు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రంజిత్ సజీవ్, నేహా నజ్నీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సాజిద్ దర్శకత్వం వహించాడు.
Thu, 09 Jan 202503:50 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 9 ఎపిసోడ్‌లో గుడిలో సంజు చూడకుండా గుడిలో బాలు, మీనాలను కలుస్తుంది మౌనిక. సంజు తనను టార్చర్ పెడుతోన్న సంగతి అన్నయ్య దగ్గర దాస్తుంది. సంజు తనను బాగా చూసుకుంటున్నాడని అబద్ధం ఆడుతుంది. చెల్లెలు మాటలు నిజమని బాలు నమ్ముతాడు.
Thu, 09 Jan 202503:09 AM IST
- Shraddha Srinath About Daaku Maharaaj Jersey Difference: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీలో ఒక హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ చేసింది. ఇదివరకు ఆమె నటించిన నాని జెర్సీ మూవీ ఎంతో పేరు తెచ్చుకుంది. పాత్ర పరంగా జెర్సీ, డాకు మహారాజ్ సినిమాల్లో ఏది బెస్ట్ అన్న ప్రశ్నకు శ్రద్ధా శ్రీనాథ్ ఇచ్చిన ఆన్సర్ ఇదే.!
Thu, 09 Jan 202502:22 AM IST
- Brahmamudi Serial January 9th Episode: బ్రహ్మముడి జనవరి 9 ఎపిసోడ్‌లో ప్రకాశంకు కావ్య క్షమాపణలు చెబుతుంది. కానీ, ప్రకాశం మాత్రం క్షమించకుండా వెళ్లిపోతాడు. దాంతో కావ్య ఏడుస్తుంటే రాజ్ వచ్చి క్యూట్‌గా, చిన్న పిల్లలా ఉన్నావంటాడు. స్వప్నకు సీమంతం అని రుద్రాణి కొత్త స్కెచ్ వేస్తుంది.
Thu, 09 Jan 202502:07 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 9 ఎపిసోడ్‌లో జ్యోత్స్న వల్ల జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు కార్తీక్, దీప అండగా ఉంటారు. తిరిగి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలని జ్యోత్స్న ఆఫీస్ ముందు కార్తీక్, దీప ధర్నా చేస్తారు. జ్యోత్స్న చేసిన పని గురించి తెలిసిన శివన్నారాయణ ఫైర్ అవుతాడు.
Thu, 09 Jan 202501:15 AM IST
- Aishwarya Rajesh On Acting With Venkatesh In Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఒక హీరోయిన్‌గా నటించింది ఐశ్వర్య రాజేష్. వెంకటేష్‌తో నటించడం, సంక్రాంతికి వస్తున్నాం మూవీ, అందులోని పాత్ర తదితర సినీ విశేషాలను పంచుకుంది ఐశ్వర్య రాజేష్.
Thu, 09 Jan 202512:34 AM IST
OTT Thriller: తమిళ్ థ్రిల్లర్ మూవీ అథోముగం థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అథోముగం సినిమాలో సిద్ధార్థ్, చైతన్య ప్రతాప్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.
Thu, 09 Jan 202512:30 AM IST
- Nindu Noorella Saavasam January 9th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 9 ఎపిసోడ్‌లో అక్క గురించి ఆచూకి తెలిసిందా అని రామ్మూర్తిని మిస్సమ్మ అడిగితే సైలెంట్‌గా ఉంటాడు. దాంతో ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని నిలదీస్తుంది భాగమతి. మరోవైపు నిజం తెలిసి ఏడుస్తుంటుంది అరుంధతి. గుప్తా ఓదారుస్తాడు.
Thu, 09 Jan 202512:00 AM IST
- Break Out OTT Streaming Telugu: ఓటీటీలోకి దాదాపుగా రెండేళ్ల తర్వాత ఇవాళ వచ్చేసిన తెలుగు మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ బ్రేక్ అవుట్. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ హీరోగా చేసిన బ్రేక్ అవుట్ మూవీకి ఐఎండీబీ 6.8 రేటింగ్ ఇచ్చింది. బ్రేక్ అవుట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.