Telugu Cinema News Live January 8, 2025: Game Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.. బెనిఫిట్ షోలకు నో
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 08 Jan 202505:09 PM IST
- Game Changer Ticket Prices: గేమ్ ఛేంజర్ టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే బెనిఫిట్ షోలకు మాత్రం నో చెప్పింది. మొత్తానికి దిల్ రాజు చేసిన ప్రయత్నాలతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట మార్చేయాల్సి వచ్చింది.
Wed, 08 Jan 202504:53 PM IST
- Sreemukhi Apology: యాంకర్ శ్రీముఖి క్షమాపణ చెప్పింది. తాను హిందువునే అని, జై శ్రీరామ్ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా శ్రీముఖి రామలక్ష్మణులపై చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో ఆమె క్షమాపణ చెప్పింది.
Wed, 08 Jan 202503:36 PM IST
- Bachchala Malli OTT Release Date: ఓటీటీలోకి అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా వచ్చేస్తోంది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అయితే స్ట్రీమింగ్ తేదీ ఊహించగలరా అంటూ ఆ ఓటీటీ ఓ ట్విస్ట్ ఇవ్వడం విశేషం.
Wed, 08 Jan 202502:26 PM IST
- Ramayana Release Date: ఇండియాలో ఇప్పుడో మూవీ 32 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది. ఒకప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత వివాదంతో వాయిదా పడుతూ వస్తున్న ఈ యానిమేషన్ మూవీ.. మొత్తానికి ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Wed, 08 Jan 202501:43 PM IST
- Suriya Retro Release Date: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న రెట్రో మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ భారీ బడ్జెట్ మూవీలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్న సూర్య.. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Wed, 08 Jan 202511:58 AM IST
- TV Premiers: సంక్రాంతికి థియేటర్లలోనే కాదు.. టీవీల్లోనూ బ్లాక్ బస్టర్ సినిమాల జాతర ఉండనుంది. ఈ పండుగ సంబురాల్లో భాగంగా టాప్ తెలుగు టీవీ ఛానెల్స్ గతేడాది థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ అయిన మూడు సినిమాలను టెలికాస్ట్ చేయనున్నాయి.
Wed, 08 Jan 202511:13 AM IST
Varun Dhawan Apartment: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ముంబైలోని జుహు ఏరియాలో ఏకంగా రూ.86.92 కోట్లు పెట్టి రెండు అపార్ట్‌మెంట్లు కొనడం విశేషం. అతడు ఈ మధ్యే నటించిన బేబీ జాన్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా అతడు ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్నాడన్న వార్త వైరల్ అవుతోంది.
Wed, 08 Jan 202510:41 AM IST
- Pushpa 2 The Rule: పుష్ప 2 చిత్రం కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే, ఓ విషయంలో మాత్రం బాహుబలితో పోలిస్తే ఇంకా 40 శాతం తక్కువగానే ఉంది. ఆ వివరాలివే..
Wed, 08 Jan 202510:18 AM IST
- Upendra UI Movie OTT: ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ (UI) మూవీ వచ్చేస్తోందని, ప్లాట్‌ఫామ్ ఇదే అంటూ వస్తున్న వార్తలను ఆ మూవీ టీమ్ ఖండించింది. అందులో నిజం లేదని, వీటిపై తమ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని కోరింది.
Wed, 08 Jan 202509:25 AM IST
- Konda Devara Song Lyrics - Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాలోని కొండ దేవర పాట అదిరిపోయింది. ఫోక్ ట్యూన్‍తో ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Wed, 08 Jan 202509:15 AM IST
- Director Bobby Kolli Naga Vamsi About Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీపై డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డాకు మహారాజ్‌లో 5 యాక్షన్ సీన్స్ ఉంటాయని, ఒక్కో సీక్వెన్స్ ఎంతో హై ఇస్తుందని దర్శకుడు చెప్పారు.
Wed, 08 Jan 202508:34 AM IST
- OTT Political Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. టాలీవుడ్ నటి రాశీ ఖన్నా నటించిన ఈ సినిమా రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో చూసి మెచ్చిన సినిమా ఇది కావడం విశేషం.
Wed, 08 Jan 202508:21 AM IST
- How Celebrities Save Heroes And Heroines Names: ఇష్టమైన వాళ్ల పేర్లను ఫోన్‌లో తమకు నచ్చినట్లుగా నిక్ నేమ్స్, డిఫరెంట్‌గా సేవ్ చేసుకుంటారు. అలాగే, ఈ సెలబ్రిటీలు కూడా హీరోలు, హీరోయిన్స్ పేర్లను విభిన్నంగా సేవ్ చేసుకున్నారు. మరి వారెవరు, వారు ఎవరి పేరును ఎలా సేవ్ చేసుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Wed, 08 Jan 202508:13 AM IST
- Aha OTT Movies: ఆహా ఓటీటీలో మూడు ఇంట్రెస్టింగ్ చిత్రాలు అడుగుపెట్టబోతున్నాయి. మూడు డిఫరెంట్ జానర్లతో ఉన్నాయి. ఓ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు వస్తోంది. మరో చిత్రం థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తోంది.
Wed, 08 Jan 202507:11 AM IST
- Film Critic Umair Sandhu About Ram Charan Has Haters: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, సోషల్ మీడియాలో అతనికి ఎందుకు అంత మంది హేటర్స్ ఉన్నారంటూ సౌత్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌కు అనేకమంది నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Wed, 08 Jan 202505:59 AM IST
- Arvind Krishna On A Masterpiece Injury At 1000 Words: టాలీవుడ్‌లో హీరోగా అలరిస్తున్న అరవింద్ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 1000 వర్డ్స్. గుప్పెడంత మనసు జగతి అకా జ్యోతి పూర్వాజ్ నటించిన ఏ మాస్టర్ పీస్ సినిమాకు సంబంధించి 1000 వర్డ్స్ స్పెషల్ షో ఈవెంట్‌లో అరవింద్ కృష్ణ ఆసక్తికర విశేషాలు చెప్పాడు.
Wed, 08 Jan 202505:37 AM IST
- Toxic Yash First Look Teaser: యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వీడియో వచ్చేసింది. స్వాగ్‍తో అదరగొట్టారు రాకింగ్ స్టార్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్‍ను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ఎలా ఉందో చూడండి.
Wed, 08 Jan 202505:14 AM IST
- Thaman on Prabhas: ది రాజాసాబ్ పాటల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. పాటలు ఎలా ఉండనున్నాయో వివరించారు. థమన్ మాటలతో ప్రభాస్ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ మరింత పెరిగిపోయింది. థమన్ ఏం చెప్పారంటే..
Wed, 08 Jan 202503:24 AM IST
- Gunde Ninda Gudi Gantalu Serial January 8th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 8 ఎపిసోడ్‌లో మౌనిక ఇంటికి వెళ్లనని బాలు దగ్గర మాట తీసుకుంటాడు సత్యం. తర్వాత టిఫిన్ చేస్తుండగా.. సత్యం తల్లి సుశీల గురించి బాలు అడిగితే.. తను చనిపోయనట్లుగా చెబుతుంది ప్రభావతి. దాంతో అంతా షాక్ అవుతారు.
Wed, 08 Jan 202502:48 AM IST
- OTT Crime Thriller: డిస్పాచ్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Wed, 08 Jan 202502:13 AM IST
- Brahmamudi Serial January 8th Episode: బ్రహ్మముడి జనవరి 8 ఎపిసోడ్‌లో అనామిక ప్లాన్ బెడిసికొట్టడంతో సామంత్ ఆవేశపడుతాడు. తనవైపుకు కోపంగా వచ్చి కాలర్ పట్టుకున్న అనామికను నేను కూడా గొంతుపట్టుకోగలను అని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు గోల్డ్ తక్కువ ధరకు తీసుకొచ్చిన ప్రకాశంకు కావ్య వల్ల అవమానం జరుగుతుంది.
Wed, 08 Jan 202502:00 AM IST
- Karthika Deepam Today Episode January 8th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వంట గురించి సుమిత్రపై వెటకారం చేస్తుంది పారిజాతం. కార్తీక్, శివన్నారాయణ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగా జరిగింది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Wed, 08 Jan 202512:58 AM IST
- Renu Desai About 1000 Words Movie And Climax: సీనియర్ హీరోయిన్, నటి రేణు దేశాయ్ 1000 వర్డ్స్ మూవీ స్పెషల్ ప్రీమియర్‌కు ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరయ్యారు. 1000 వర్డ్స్ సినిమా క్లైమాక్స్ చూసిన తనకు కూడా కన్నీళ్లు వచ్చేశాయంటూ ఇటీవల కామెంట్స్ చేశారు. 1000 వర్డ్స్ మూవీపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు.
Wed, 08 Jan 202512:30 AM IST
- NNS 8th January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 8) ఎపిసోడ్లో రామ్మూర్తికి అసలు నిజం తెలిసిపోతుంది. ఆరు అక్కడే ఉందని అమర్ చెప్పడంతో ఆమె కోసం అంతటా వెతుకుతాడు. అటు మిస్సమ్మకు మాత్రం తన అక్క గురించి ఏమీ తెలియదు.
Wed, 08 Jan 202512:00 AM IST
- South Heroes Children's Favourite Heroes Or Actors: మెగాస్టార్ చిరంజీవి, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ హీరో సూర్య వంటి ఎంతోమంది సౌత్ హీరోలు అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ, తెలుగు స్టార్ హీరోల పిల్లలకు ఇష్టమైన హీరోలు వేరే కూడా ఉన్నారు. మరి వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.