Telugu Cinema News Live January 7, 2025: Daaku Maharaaj Tickets: మాకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదు: డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-latest telugu cinema news today live january 7 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 7, 2025: Daaku Maharaaj Tickets: మాకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదు: డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Daaku Maharaaj Tickets: మాకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదు: డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telugu Cinema News Live January 7, 2025: Daaku Maharaaj Tickets: మాకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదు: డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

04:34 PM ISTJan 07, 2025 10:04 PM HT Telugu Desk
  • Share on Facebook
04:34 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 07 Jan 202504:34 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj Tickets: మాకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదు: డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Daaku Maharaaj Tickets: డాకు మహారాజ్ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదని అతడు అనడం విశేషం. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202503:26 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller Movie: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ప్రేమలు హీరో మరో హిట్

  • OTT Crime Thriller Movie: ఓటీటీలోకి ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెండు నెలల తర్వాత వస్తోంది. ప్రేమలు హీరో నస్లేన్ కే గఫూర్ నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202502:04 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ajith Kumar Accident: అజిత్‌కు ప్రమాదం.. 180 కి.మీ. వేగంతో గోడను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న వీడియో

  • Ajith Kumar Accident: తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ కు ప్రమాదం జరిగింది. అతడు గంటకు 180 కి.మీ. వేగంతో నడుపుతున్న కారు గోడను ఢీకొట్టింది. అయితే ఇంతటి తీవ్రమైన ప్రమాదం నుంచి అతడు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం ఓ అద్భుతం కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202501:45 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Razakar OTT Release Date: ఓటీటీలోకి పది నెలల తర్వాత వస్తున్న అనసూయ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Razakar OTT Release Date: ఓటీటీలోకి అనసూయ నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా పది నెలల తర్వాత వస్తోంది. తాజాగా మంగళవారం (జనవరి 7) ఆహా వీడియో ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202512:54 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Reloaded Version: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. రన్ టైమ్ 20 నిమిషాలు పెరిగింది.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?

  • Pushpa 2 Reloaded Version: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా రన్ టైమ్ కు అదనంగా మరో 20 నిమిషాల ఫుటేజీ జోడించడం విశేషం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (జనవరి 7) వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202511:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj Pre Release Business: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్

  • Daaku Maharaaj Pre Release Business: డాకు మహారాజ్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ లోనే రికార్డు క్రియేట్ చేసింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేయడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202510:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Amitabh Bachchan: మెగాస్టార్ ఎప్పుడూ ఉత్తరం వైపు ముఖం చేసే భోజనం చేస్తాడట.. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

  • Amitabh Bachchan: ఉత్తరం వైపు ముఖం చేస్తూ భోజనం చేస్తే ఏం జరుగుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎందుకు ఎప్పుడూ ఆ వైపే కూర్చొని తింటాడు? ఈ ప్రశ్నలకు తాజాగా తన కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో బిగ్ బీ సమాధానమిచ్చాడు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202510:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nandamuri Mokshagna Teja: బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్ర మూవీ ఎప్పుడు మొదలుకానుందో చెప్పిన నిర్మాత

  • Nandamuri Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తొలి మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందోననే నిరీక్షణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుపై కొన్ని రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ కొన్ని విషయాలు చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202509:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: RGV: మళ్లీ థియేటర్లలోకి ఆర్జీవీ కల్ట్ క్లాసిక్ మూవీ.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..

  • Satya Re Release: సత్య సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. 27 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కానుంది. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202508:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Varun Sandesh: యాక్ష‌న్ హీరోగా మారిన వ‌రుణ్ సందేశ్ - కానిస్టేబుల్ టీజ‌ర్ రిలీజ్‌

  • Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ యాక్ష‌న్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. కానిస్టేబుల్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. ఈ మూవీ టీజ‌ర్‌ను డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన రిలీజ్ చేశాడు. కానిస్టేబుల్ మూవీకి ఆర్య‌న్ సుభాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202508:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Squid Game: స్క్విడ్ గేమ్‍ ప్లేయర్లుగా ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్, అల్లు అర్జున్, రజినీ సహా స్టార్ హీరోలు.. వీడియో వైరల్

  • Squid Game 2 AI Video: స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్‍లో ఇటీవలే రెండో సీజన్ వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఈ తరుణంలో భారత సినీ, క్రీడాస్టార్లు స్క్విడ్ గేమ్ ప్లేయర్లుగా ఉన్న ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202508:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu TV Shows TRP Ratings: తెలుగులో టాప్ టీవీ షో ఇదే.. వచ్చీ రావడంతోనే బెస్ట్ టీఆర్పీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

  • Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోలకు సంబంధించి 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇంకా ఏ షోలు ఉన్నాయో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202508:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Crime Thriller OTT: మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌!

  • Crime Thriller OTT: తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ హైడ్ అండ్ సీక్ ఈ వార‌మే ఓటీటీలోకి వ‌స్తోంది. జ‌న‌వ‌రి 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విశ్వాంత్‌, రియా స‌చ్‌దేవ్‌, శిల్పా మంజునాథ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీకి బ‌సిరెడ్డి రానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202506:34 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: మోస్ట్ వైలెంట్ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  • OTT Action Thriller: మలయాళ మూవీ మార్కో సెన్సేషనల్ హిట్‍గా నిలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ విషయంలో రూమర్లు వస్తున్నాయి. దీనిపై నిర్మాత స్పందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202506:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Oscars 2025: ఆస్కార్ బ‌రిలో సూర్య కంగువ - బెస్ట్ పిక్చ‌ర్ కేట‌గిరీలో మ‌రో రెండు ఇండియ‌న్ మూవీస్ కూడా!

  • Oscars 2025: సూర్య కంగువ మూవీ ఆస్కార్ రేసులోకి నిలిచింది. బెస్ట్ పిక్చ‌ర్ కోసం కంగువ‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ది గోల్ లైఫ్‌, గ‌ర్ల్స్ విల్ బి గ‌ర్ల్స్ సినిమాలు నామినేష‌న్స్‌లో నిలిచాయి. బెస్ట్ పిక్చ‌ర్ కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 207 సినిమాలు నామినేట్ అయ్యాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202505:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: విడాకులు తీసుకున్న జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్

  • జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ 2024 ఆగస్టు 20న విడాకుల కోసం దాఖలు చేశారు. ఈ జంట 2024 ఏప్రిల్ 26 నుంచి విడిగా ఉంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202504:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Marco Collections: 2025లో టాలీవుడ్‌లో ఫ‌స్ట్ హిట్ డ‌బ్బింగ్ సినిమాదే - మ‌ల‌యాళ హీరో బోణీ- మార్కో తెలుగు వెర్ష‌న్‌కు డ‌బు

  • Marco Collections: 2025లో టాలీవుడ్ ఫ‌స్ట్ హిట్‌గా మ‌ల‌యాళ డ‌బ్బింగ్ మూవీ మార్కో నిలిచింది. జ‌న‌వ‌రి 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈయాక్ష‌న్ మూవీ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టించిన మార్కో మూవీకి వ‌చ్చిన మొత్తం క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202504:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top Releases: ఈ వారం ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు.. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్.. యథార్థ ఘటనలపై ఓ చిత్రం

  • OTT Top 5 Releases This Week: ఈ వారం ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. గోద్రా రైలు దగ్ధంపై రూపొందిన చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ తెలుగు మూవీ నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202503:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: శాడిస్ట్‌గా మారిన సంజు - అత్తింట్లో మౌనిక‌కు న‌ర‌కం - చెల్లికి గాజులు గిఫ్ట్‌గా ఇచ్చిన బాలు

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 7 ఎపిసోడ్‌లో మౌనిక‌ను సంజు టార్చ‌ర్ పెట్టిన‌ట్లు క‌ల రావ‌డంతో ఉలిక్కిప‌డి నిద్ర‌లో నుంచి లేస్తాడు బాలు. మౌనిక‌ను ఇప్పుడే పుట్టింటికి తీసుకొస్తాన‌ని సంజు ఇంటికి బ‌య‌లుదేర‌బోతాడు. అత‌డిని ప్ర‌భావ‌తి, మ‌నోజ్ అడ్డుకుంటారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202503:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్న అల్లు అర్జున్! భారీగా బందోబస్తు

  • Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‍ను అల్లు అర్జున్ కలవనున్నారని సమాచారం. ఇందుకోసం ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ వివరాలివే.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202502:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dil Raju: దిల్ రాజు ఆశ నెరవేరుతుందా? ఎదురుచూస్తున్న మొత్తం టాలీవుడ్

  • Dil Raju: గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఏపీలో టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం పెంచింది. అయితే, ఇటీవలి పరిణామాలతో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంది. ఈ తరుణంలో తనకు ఇంకా ఆశ ఉందని దిల్‍రాజు చెప్పారు. ఈ విషయంపై టాలీవుడ్ అంతా ఉత్కంఠగా ఉంది. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202501:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 7th Episode: రొమాన్స్‌కు కావ్య కండీష‌న్స్‌ - రాజ్‌పై ఫ్రాడ్‌గా ముద్ర - అనామిక‌ రిట‌ర్న్ గిఫ్ట్‌

  • Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 7 ఎపిసోడ్‌లో తాము త‌యారు చేసిన న‌గ‌ల‌ను జ‌గ‌దీష్‌ప్ర‌సాద్‌కు చూపిస్తాడు రాజ్‌. క్వాలిటీ చెక్‌లో కిరీటం న‌కిలీ అని తేలుతుంది. రాజ్‌ను ఫ్రాడ్‌గా పొర‌పాడిన జ‌గ‌దీష్‌ప్ర‌సాద్ అత‌డిని దారుణంగా అవ‌మానిస్తాడు. భ‌ర్త‌తో పాటు స్వ‌రూజ్ గ్రూప్‌ను కావ్య కాపాడుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202501:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 7th Episode: టిఫిన్ సెంటర్‌పై ఆఫీసర్స్ రైడ్.. దీప, కార్తీక్ కంగారు.. జ్యోత్స్న ప్లాన్ మిస్ ఫైర్

  • Karthika Deepam 2 Today episode January 7th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప చేసిన టిఫిన్స్ అని తెలియడంతో తినే మధ్యలోనే శివన్నారాయణ వెళ్లిపోతాడు. దీప టిఫిన్ బండిపై ఆఫీసర్లు రైడ్ చేస్తారు. సీజ్ చేస్తామంటారు. అయితే జ్యోత్స్న వేసిన ప్లాన్ ఫలించదు. పూర్తిగా ఏం జరిగిందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202512:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 7th January Episode: రామ్మూర్తికి నిజం చెప్పిన అమర్​.. కూలబడిపోయిన ఆరు.. అయోమయంలో మిస్సమ్మ!

  • NNS 7th January Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 7) ఎపిసోడ్లో రామ్మూర్తికి ఆరు తన కూతురే అన్న నిజం చెప్పేస్తాడు అమర్. అది చూసి ఆరు కుప్పకూలిపోతుంది. అటు అమర్ జాడ తెలియక మిస్సమ్మ అయోమయంలో పడుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202512:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Romantic Movie: ఓటీటీలోకి వ‌చ్చిన రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ మూవీ - ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్ - ఇది క‌న్న‌డ అర్జున్ రెడ్డి!

  • OTT Romantic Movie:క‌న్నడ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ ధృవ‌తారే ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌తీక్‌, మౌల్య హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 07 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer First Review: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ- మూవీ ఒక టార్చర్, రామ్ చరణ్ కెరీర్ నాశనం చేశావ్, రిటైర్ అయిపో అంటూ!

  • Game Changer First Review In Telugu By Umair Sandhu: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీపై ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన రివ్యూ అంటూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ట్విటర్‌ వేదికగా తెలిపాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి