Telugu Cinema News Live January 4, 2025: Namo Namah Shivaya Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి శివతాండవం - నమో నమః శివాయ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 04 Jan 202504:37 PM IST
Song Lyrics: నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ మూవీ నుంచి నమో నమః శివాయ సాంగ్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. డివోషనల్ టచ్‌తో కూడిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
Sat, 04 Jan 202503:58 PM IST
సినిమాలు తీసేవాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలని, సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు సినీ పరిశ్రమ గురించి మాట్లడవద్దని ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
Sat, 04 Jan 202501:39 PM IST
Gundeninda Gudi Gantalu Mounika: గుండె నిండా గుడిగంటలు ఫేమ్ జ్యోతి గౌడ తెలుగులో మరో కొత్త సీరియల్ చేయబోతున్నది. వేయి శుభములు కలుగు నీకు పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్‌లో మౌనికరెడ్డి, శిల్పా చక్రవర్తి, వీజే సంయుక్త, శ్వేత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Sat, 04 Jan 202512:26 PM IST
Ram Charan VS Niharika: రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ తెలుగుతో పాటు తమిళంలో జనవరి 10న రిలీజ్ అవుతోంది. అదే రోజు మెగా డాటర్ నిహారిక కొణిదల నటించిన తమిళ మూవీ మద్రాస్‌కారణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Sat, 04 Jan 202510:48 AM IST
Mythological Thriller: సత్యరాజ్ ప్రధాన పాత్రలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా తెలుగులో త్రిబాణధారి బార్బరిక్ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌ను మారుతి రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ఉదయభాను, సత్యంరాజేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Sat, 04 Jan 202510:02 AM IST
Katha Kamamishu Review: రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలుగు మూవీ కథా కమామీషు డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీలో ఇంద్రజ, కరుణకుమార్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలు పోషించారు.
Sat, 04 Jan 202509:28 AM IST
- Bellamkonda Sai Sreenivas BSS12 Poster Released: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న న్యూ మూవీ బీఎస్ఎస్12 ఇటీవల ప్రారంభం అయింది. 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది.
Sat, 04 Jan 202508:52 AM IST
- OTT Hollywood: వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ చిత్రం ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటి వరకు కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు పూర్తిస్థాయి ఓటీటీ రిలీజ్‍కు రానుంది.
Sat, 04 Jan 202508:50 AM IST
- Meenakshi Chaudhary About Balakrishna And Aishwarya Rajesh: లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా చేసిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి చౌదరి.
Sat, 04 Jan 202508:46 AM IST
Action Thriller OTT: అల్లరి నరేష్ బచ్చలమల్లి సంక్రాంతి వీక్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాక్షన్ డ్రామా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది బచ్చలమల్లి మూవీలో హనుమాన్ ఫేమ్ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది.
Sat, 04 Jan 202506:38 AM IST
- Kalki 2898 AD TV Premiere Date: కల్కి 2898 ఏడీ చిత్రం టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ అధికారికంగా ఖరారయ్యాయి.
Sat, 04 Jan 202506:09 AM IST
- Tollywood Highest Viewed Liked Trailers In 24 Hrs: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన టాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ ఏంటీ?, వాటి స్థానాలు, లైక్స్ అండ్ వ్యూస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Sat, 04 Jan 202505:48 AM IST
- Game Changer Pre Release: గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు భారీస్థాయిలో జరగనుంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ హాజరవుతున్న తొలి సినీ ఈవెంట్ ఇదే. దీంతో ఈ ఈవెంట్‍పై ఆసక్తి విపరీతంగా ఉంది.
Sat, 04 Jan 202505:04 AM IST
- Nindu Noorella Saavasam January 4th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 4 ఎపిసోడ్‌లో అమర్ నచ్చజెప్పడంతో అరుంధతి అస్థికలు ఇస్తుంది అంజు. ఆశ్రమంలో పిల్లలకు చాక్లెట్స్ పంచుతున్న రామ్మూర్తిని చూసి తన కూతురు గురించి టీచర్‌తో నిజం చెబుతుంది వార్డెన్. ఆ మాటలు విన్న రామ్మూర్తి అమర్ ఇంటికి వెళ్తాడు.
Sat, 04 Jan 202503:37 AM IST
- Superstar Mohanlal Barroz 3D OTT Streaming: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన త్రీడి ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ బరోజ్. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన బరోజ్ 3డీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఐదు భాషల్లో ఓటీటీ రిలీజ్ కానున్న బరోజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై లుక్కేద్దాం.
Sat, 04 Jan 202503:23 AM IST
- OTT Telugu Movies: ఈ వారం రెండు తెలుగు చిత్రాలు ఒకే ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఓ కామెడీ డ్రామా మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో ఎమోషనల్ లవ్ చిత్రం కూడా అందుబాటులోకి వచ్చింది.
Sat, 04 Jan 202502:40 AM IST
- Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌లో సంజును మౌనిక పెళ్లి చేసుకుందని కుమిలిపోతాడు బాలు. అతని దగ్గరికి వచ్చిన మీనా అందరితోపాటు మౌనిక కూడా సంజునే నమ్మిందని చెబుతుంది. తర్వాత అత్తింట్లో మౌనికకు రోజుకో శిక్ష వేస్తానని సంజు అంటాడు.
Sat, 04 Jan 202501:58 AM IST
- Karthika Deepam Today Episode January 4th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపను అవమానించేలా పారిజాతం చాలా మాటలు అంటుంది. దీంతో కార్తీక్ గట్టిగా స్పందిస్తాడు. పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Sat, 04 Jan 202501:32 AM IST
- Brahmamudi Serial January 4th Episode: బ్రహ్మముడి జనవరి 4 ఎపిసోడ్‌లో రాజ్ కావ్య ఇంటికి వస్తారు. ఎవరిని అడగకుండా కారులను పంపించడం ఏంటీ అని ధాన్యలక్ష్మీ నిలదీస్తే ఎవరిని అడగాలి అని కావ్య కఠినంగా మాట్లాడుతుంది. అది ప్రకాశం, సుభాష్‌కు నచ్చదు. ప్రకాశం తమకు దూరమయ్యే ప్రమాదం ఉందని సుభాష్ అంటాడు.
Sat, 04 Jan 202512:34 AM IST
- Meenakshi Chaudhary About Venkatesh Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి హీరో వెంకటేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే, సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని రోల్ గురించి పలు విశేషాలు చెప్పుకొచ్చింది.