Telugu Cinema News Live January 29, 2025: Anil Ravipudi Remuneration: వరుసగా 8 హిట్స్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 29 Jan 202504:13 PM IST
- Anil Ravipudi Remuneration: సంక్రాంతికి వస్తున్నాం మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దూకుడు మామూలుగా లేదు. వరుసగా 8 హిట్స్ అందించిన అతడు.. తాజాగా సంక్రాంతి హిట్ తర్వాత తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Wed, 29 Jan 202502:52 PM IST
- Pushpa 2 on Netflix: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోంది. మొత్తానికి ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జనవరి 29) రాత్రి అధికారికంగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించడం విశేషం.
Wed, 29 Jan 202511:13 AM IST
- UI OTT Release Date: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర డైరెక్ట్ చేసి నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ యూఐ (UI) ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేలా కనిపిస్తోంది. తాజాగా జీ కన్నడ ఛానెల్ రిలీజ్ చేసిన ప్రోమోతో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Wed, 29 Jan 202510:59 AM IST
- Chiranjeevi: చిరంజీవి ఓ ఇండియన్-హాలీవుడ్ సినిమా చేయాల్సింది. ఆ చిత్రం షూటింగ్ కాస్త జరిగినా ఆగిపోయింది. లేకపోతే అప్పటికే గ్లోబల్ రేంజ్‍లో చిరూ ఫేమస్ అయ్యేవారు. ఆ ప్రాజెక్ట్ వివరాలివే..
Wed, 29 Jan 202510:45 AM IST
Janhvi Kapoor Condom Ad: కండోమ్ యాడ్‌కు జాన్వీ కపూర్ బాగా సూటవుతుందని అన్నాడు ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మ్యాన్‌ఫోర్స్ ఫౌండర్ రాజీవ్ జునేజా. అతని కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Wed, 29 Jan 202510:00 AM IST
- The Mehta Boys OTT Release: ది మెహతా బాయ్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది. ట్రైలర్‌తో పాటే రిలీజ్ తేదీ వెల్లడైంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది.
Wed, 29 Jan 202509:11 AM IST
OTT: మలయాళ, తమిళం సినిమాలు మాత్రమే చూడటానికి స్పెషల్‌గా కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలతో ఈ ఓటీటీలలో మలయాళం, తమిళ సూపర్ హిట్ సినిమాలను చూడొచ్చు. ఆ ఓటీటీలు ఏవంటే?
Wed, 29 Jan 202508:35 AM IST
- Netflix Greatest Rivalry Documentary: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో అదిరిపోయే డాక్యుమెంటరీ రాబోతోంది. ఈసారి ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ వార్ తెరవెనుక సీన్ ఎలా ఉంటుందో దీని ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు.
Wed, 29 Jan 202508:10 AM IST
Jani Master: జానీ మాస్టర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ జానీ మాస్టర్ వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసిందని నటి, యాంకర్ ఝాన్సీ ఓ పోస్ట్ పెట్టింది. ఝాన్సీ ట్వీట్‌పై జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు.
Wed, 29 Jan 202507:48 AM IST
- OTT Malayalam Thrillers: త్వరలో ఓటీటీల్లోకి మరో నాలుగు మలయాళ చిత్రాలు రానున్నాయి. ఇందులో రెండు బ్లాక్‍బస్టర్ పాపులర్ చిత్రాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Wed, 29 Jan 202506:17 AM IST
- Vishwambhara: విశ్వంభర సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన మూవీ వాయిదా పడింది. మూవీ టీమ్ తేదీ కోసం చూస్తున్నా.. ఓ కారణం వల్ల రిలీజ్ డైలమాలో పడిందని తెలుస్తోంది. ఎందుకంటే..
Wed, 29 Jan 202505:43 AM IST
NNS January 29th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 29 ఎపిసోడ్‌లో తన పిల్లలను కాపాడుకోవడానికి భూలోకానికి వెళతానని ఆరు పట్టుపడుతుంది. యముడు అంగీకరించడు. తన పాపాల చిట్టా లెక్క తేలాల్సిందేనని ఆరు అంటుంది. తనకు న్యాయం జరగడానికి పంచాయతీ పెట్టాల్సిందేనని రచ్చ చేస్తుంది.
Wed, 29 Jan 202505:36 AM IST
- Pragya Jaiswal: బాలకృష్ణతో ప్రగ్యా జైస్వాల్ రెండు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉందని, ఇది సరి కాదంటూ కొందరు విమర్శించారు. ఈ విషయంపై ప్రగ్యా ఇప్పుడ స్పందించారు. ఏమన్నారంటే..
Wed, 29 Jan 202504:49 AM IST
OTT: మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒరు కట్టిల్ ఒరు మురి మనోరమా మ్యాక్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను త్వరలో అనౌన్స్‌చేస్తామని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ మలయాళం మూవీలో పూర్ణిమ ఇంద్రజీత్, హకీష్ షా, ప్రియంవద కీలక పాత్రలు పోషించారు.
Wed, 29 Jan 202504:37 AM IST
- Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బంపర్ హిట్ అయింది. అయితే, ఈ చిత్రం విషయంలో తాను చేసిన పొరపాటును దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఎలా చేసి ఉంటే మరింత బాగుండేదో అంగీకరించారు. ఆ వివరాలివే..
Wed, 29 Jan 202503:56 AM IST
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 29 ఎపిసోడ్‌లో ఊరి పెద్దగా అమ్మవారికి హారతి ఇవ్వమని రామరాజును పూజారి కోరుతాడ. హారతి ఇచ్చే అర్హత రామరాజుకు లేదని భద్రావతి వాదిస్తుంది. పిల్లలకు లేపుకెళ్లి పెళ్లి చేయడం నువ్వే నేర్పించావా అంటూ రామరాజును అవమానిస్తుంది.
Wed, 29 Jan 202502:41 AM IST
- Pushpa 2 OTT: పుష్ప 2 చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ సమీపించింది. రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం అడుగుపెట్టనుంది.
Wed, 29 Jan 202502:20 AM IST
Brahmamudi: బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మి, ప్రకాశం కోర్టుకు వెళితే ఇళ్లు ముక్కలవ్వడం ఖాయమని, ఆస్తిలో తమకు వాటా దక్కుతుందని రుద్రాణి, రాహుల్ సంబరంతో పార్టీ చేసుకుంటారు. ప్రకాశం, ధాన్యలక్ష్మి తరఫు లాయర్‌ను లా పాయింట్స్‌తో కావ్య బెదరగొడుతుంది.
Wed, 29 Jan 202501:48 AM IST
- Karthika Deepam 2 Today Episode January 29: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. తండ్రి శివన్నారాయణను దశరథ్ నిలదీస్తాడు. కాంచనను అవమానించినందుకు బాధపడతాడు. జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. ఆసుపత్రిలో ఉన్న శౌర్య దగ్గరికి దీప వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Wed, 29 Jan 202512:46 AM IST
Tollywood:కొంత గ్యాప్ తర్వాత కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్...డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తోన్నాడు. తల పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాలో ఆయన తనయుడు రాగిన్ రాజ్ హీరోగా నటిస్తోన్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను బిగ్‌బాస్ సోహెల్, హీరో అశ్విన్ రిలీజ్ చేశారు.